Top story: అమరావతి చట్టబద్ధతపై వైసిపి దారేటు…?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. అయితే మండలిలో అధికార టీడీపీకి బలం లేకపోవడంతో అక్కడ తీర్మానాన్ని ప్రవేశ పెట్టకుండానే ,నేరుగా అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం.

Post Published By: dialnews
Updated : 30 March 2026, 9:12 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. అయితే మండలిలో అధికార టీడీపీకి బలం లేకపోవడంతో అక్కడ తీర్మానాన్ని ప్రవేశ పెట్టకుండానే ,నేరుగా అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర క్యాబినెట్ దీనిపై చర్చించి పార్లమెంట్లో అమరావతి రాజధాని కి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు పెడితే అది పాస్ కావడం పెద్ద కష్టమేమి కాదు. ఎన్డీఏ కి లోక్సభలో కావాల్సినంత బలం ఉంది కనుక , అమరావతి చట్టబద్ధత కి ఆమోద లభించడం నల్లేరు మీద నడకే. అయితే ఆ సందర్భంగా పార్లమెంట్లో వైసిపి ఎలా రియాక్ట్ అవుతుంది అన్నదే ఇప్పుడు అందరూ ఆసక్తిగా గమనిస్తున్న విషయం.

అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టే సమయంలో స్పీకర్ నుంచి ప్రతి ఒక్కరూ అమరావతికి చట్టబద్ధత ఆవశ్యకతను చెప్పడం కంటే, వైసిపి అధినేత జగన్ ని టార్గెట్ చేయడం పైనే ఎక్కువ దృష్టి పెట్టారు.అయితే మండలిలో మాత్రం అమరావతి కి చట్టబద్ధతపై తీర్మానం చేయలేదు. ఒకవేళ అక్కడ అదే జరిగి ఉంటే వైసీపీకి నెంబర్ ఎక్కువ ఉంది కనుక ఆ తీర్మానం వీగిపోయే ప్రమాదం ఉంది. ఈ దెబ్బతో రాజధాని అమరావతిపై వైసీపీ ఇరుక్కుని పడిపోయిందని, తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉందని టిడిపి భావిస్తుంది. ఇదే విషయాన్ని లోకేష్ కూడా మీడియా వాళ్లతో స్విచ్ ఆఫ్ చేస్తూ ప్రస్తావించారు. పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లుపై వైసీపీ కచ్చితంగా తన స్టాండ్ ఏమిటో చెప్పాల్సి ఉంటుందని, ఒకవేళ ఆ పార్టీ దానిని వ్యతిరేకిస్తే పొలిటికల్ గా తమకు అడ్వాంటేజ్ అవుతుందని టిడిపి భావిస్తోంది.

అయితే వైసిపి ఇప్పటికే వ్యతిరేకం కాదని స్పష్టం చేసేసింది. రాజధాని అమరావతి తో గోక్కోకూడదు అని ఆ పార్టీ నిర్ణయం చేసింది కూడా. అయితే అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతిని మాత్రం అడ్డుకుంటామని చెప్తుంది. బహుశా లోక్సభలో కూడా చర్చ జరిగితే వైసిపి ఇదే విషయాన్ని ప్రస్తావించి, అమరావతి నిర్మాణంలో అవినీతి, రెండో దశ ల్యాండ్ పూలింగ్ ఇలాంటి అంశాలను దేశం దృష్టికి తీసుకొచ్చి, ఓటింగ్ సమయంలో బాయ్ కట్ చేసే అవకాశం ఉంది. అమరావతికి తాము వ్యతిరేకం కాదంటూనే అక్కడ జరుగుతున్న అవినీతిని ఎత్తిచూపటమే వైసీపీ ప్రధాన లక్ష్యం.

 

 

Published : 
  • 30 March 2026, 9:12 AM IST