తమ సంస్థను టార్గెట్ గా చేసుకుని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని హెరిటేజ్ ఫుడ్స్ ఖండించింది. ఈ మేరకు సంస్థ.. వైఎస్ జగన్ కు లీగల్ నోటీసులు పంపింది. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌పై ఉద్దేశపూర్వకంగా, పునరావృతంగా మరియు రాజకీయ దురుద్దేశంతో సాగిన అసత్య, తప్పుదారి పట్టించే, పరువు నష్టం కలిగించే ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ లీగల్ నోటీసులు జారీ చేసామని పేర్కొంది. టీటీడీ నెయ్యి సరఫరా, కల్తీ, కుట్రలు, “సిండికేట్” వంటి పదాలతో హెరిటేజ్ ఫుడ్స్‌ను నేర సంస్థలా చిత్రీకరించడం పూర్తిగా అసత్యం, ఆధారరహితం మరియు చట్టవిరుద్ధం అని మండిపడింది.
ప్రజలను ఉద్దేశపూర్వకంగా మభ్యపెట్టేందుకు, కంపెనీ పరువును కూల్చివేయాలనే దురుద్దేశంతోనే ఈ ఆరోపణలు చేసారని తమ నోటీసుల్లో పేర్కొంది. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌కు ఇతర సంస్థలతో ఉన్న సంబంధాలు పూర్తిగా చట్టబద్ధమైన వ్యాపార ఒప్పందాల పరిధిలోనే ఉన్నాయనే విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి, అక్రమ కుమ్మక్కులున్నట్టు ప్రచారం చేయడం ఘోరమైన అబద్ధ ప్రచారమని కంపెనీ మండిపడింది. షరతులు లేకుండా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.