Top story:ఇరాన్ గ్రేట్ ఫ్రెండ్షిప్, మోడీ గట్స్ కు ట్రంప్ షాక్… ఇండియాకు రెడ్ కార్పెట్, ఇరాన్ సెన్సేషనల్ కామెంట్స్… గ్లోబల్ మ్యాప్‌పై ఇండియా మాస్ పవర్…!

ప్రపంచం మొత్తం గత రెండు నెలల నుంచి.. గుండె గుప్పిట్లో పట్టుకుని కూర్చుంది. ఇరాన్ పై ఇజ్రాయిల్, అమెరికా అటాక్స్ స్టార్ట్ అయిన రోజు నుంచి భయం భయం. మన ఇండియాలో గ్యాస్ దొరకదు అనే కంగారు.

Post Published By: dialnews
Updated : 15 April 2026, 5:25 PM IST

ప్రపంచం మొత్తం గత రెండు నెలల నుంచి.. గుండె గుప్పిట్లో పట్టుకుని కూర్చుంది. ఇరాన్ పై ఇజ్రాయిల్, అమెరికా అటాక్స్ స్టార్ట్ అయిన రోజు నుంచి భయం భయం. మన ఇండియాలో గ్యాస్ దొరకదు అనే కంగారు. పెట్రోల్ స్టాక్ లేదనే వర్రీస్.. ఇలా ఒకటి కాదు.. పవర్ ప్లాంట్స్ దగ్గర నుంచి పానీ పూరి బండి వరకు అన్నీ వణుకుతున్నాయి. ఇలాంటి టైంలో ఇరాన్ మనను ఇబ్బంది పెట్టడం లేదు. తాజాగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉరితీయాలని హార్ముజ్ జలసంధిని తన నౌకాదళంతో చుట్టుముట్టారు.

ఒక్క చుక్క చమురు కూడా బయటకు వెళ్లకూడదు, ఒక్క నౌక కూడా కదలకూడదని ట్రంప్ ఆజ్ఞలు జారీ చేశారు. కానీ, సరిగ్గా ఇదే సమయంలో ఇరాన్ నుంచి ఒక అద్భుతమైన ప్రకటన వచ్చింది. 'హోర్ముజ్ జలసంధిలో అమెరికాకు నరకం కనిపిస్తుంది.. కానీ భారత నౌకలకు మాత్రం రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది' ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ స్వయంగా మన ఇండియన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మాట చెప్పారు. ట్రంప్ హెచ్చరికలను లెక్కచేయకుండా, మోదీతో ఉన్న స్నేహం కోసం ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది.

బెదిరించడం, ఆంక్షలు విధించడం, బలవంతంగా లొంగదీసుకోవడం అనేది ట్రంప్ పద్ధతి.. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికా మిత్రదేశాలే ఆయనను అసహ్యించుకుంటున్నాయి. ఎప్పుడు ఏ మాట మాట్లాడతాడో అతనికే తెలియదు. రోజుకో పంచాయితీ.. గంటకో ట్వీట్.. నిమిషానికో నోటి దూల కామెంట్.. ఇలా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా కాదు కదా.. గల్లీ లీడర్ గా కూడా పనికిరాడు అనేది అర్ధమైంది.

కానీ ఇక్కడ మోడీ స్టైల్ డిఫరెంట్. 'వసుధైక కుటుంబం'. ఇటు అమెరికాతో స్నేహం చేస్తూనే, అటు ఇరాన్‌తో ఉన్న చారిత్రక బంధాన్ని మోదీ కాపాడుకున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటించిన 'టాప్-5 ఫ్రెండ్స్' లిస్టులో ఇండియా ఉండటం మోదీ సాధించిన ఘనత. ట్రంప్ యుద్ధం కోరుకుంటుంటే, మోదీ భారత్ ప్రయోజనాలను కాపాడుకుంటూ శాంతిని కోరుకుంటున్నారు. వార్ స్టార్ట్ అయిన తర్వాతి నుంచి హార్ముజ్ విషయంలో భారత్ ను ఇబ్బంది పెట్టడం లేదు ఇరాన్. ఇప్పుడు కూడా అదే చెప్పేసింది.

ప్రపంచ చమురు రవాణాలో 20% జరిగే హోర్ముజ్ జలసంధి ఇరాన్ గుప్పిట్లో ఉంది. అమెరికా బ్లాకేడ్ వల్ల ఏ దేశం కూడా అక్కడి నుంచి నౌకలను పంపడానికి ధైర్యం చేయడం లేదు. కానీ ఇరాన్ రాయబారి ఫతాలీ ఏమన్నారంటే.. 'భారత ప్రభుత్వంతో మాకు ప్రత్యక్ష సంప్రదింపులు ఉన్నాయి. మా భారతీయ సోదరుల నౌకలకు ఎలాంటి అంతరాయం కలగదు'. దీని అర్థం ఏంటో తెలుసా? ప్రపంచం మొత్తం చమురు కోసం అల్లాడుతున్నా, భారత్‌కు మాత్రం ఇరాన్ నుంచి చమురు సరఫరా నిరంతరాయంగా అందుతుంది.

అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ, ఇరాన్ తన "సార్వభౌమాధికారాన్ని" చాటుకుంటూనే భారత నౌకలకు దారి ఇవ్వడం మోదీ పట్ల టెహ్రాన్‌కు ఉన్న నమ్మకాన్ని చాటి చెప్పింది. తాజా సమాచారం ప్రకారం అంటే.. ఏప్రిల్ 13న, జగ్ విక్రమ్ అనే భారతీయ ఎల్ పీ జీ ట్యాంకర్ 24 మంది సిబ్బందితో అత్యంత ప్రమాదకరమైన హోర్ముజ్ జలసంధిని దాటి సురక్షితంగా బయటకు వచ్చింది. అమెరికా దిగ్బంధనం అమల్లో ఉన్నప్పటికీ, ఇరాన్ సహకారంతో భారత నౌకలు ఇలా ధైర్యంగా ప్రయాణించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.

యుద్ధం జరుగుతున్న వేళ, అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ ప్రజలు ఇబ్బంది పడుతుంటే, భారత్ నిశ్శబ్దంగా తన మిత్రుడికి మెడికల్ ఎయిడ్ (వైద్య సహాయం) అందించింది. ఇరాన్ దీనికి స్పందిస్తూ 'థాంక్యూ ఇండియా' అని కృతజ్ఞతలు తెలపడం, ఈ బంధం కేవలం వ్యాపారం కోసం కాదు, ఒక "సివిలైజేషనల్ పార్టనర్‌షిప్" అని నిరూపిస్తోంది. ట్రంప్ ఒకవైపు "ఇరాన్ నాయకత్వాన్ని క్లీన్ చేస్తా" అని బెదిరిస్తుంటే, ప్రధాని మోదీ మాత్రం ప్రెసిడెంట్ పెజెష్కియాన్ తో ఫోన్ లో మాట్లాడుతూ 'మధ్యప్రాచ్యంలో శాంతి అవసరం' అని హితవు పలికారు.

ట్రంప్ యుద్ధం కోరుకుంటుంటే, మోదీ దౌత్యంతో సమస్యను పరిష్కరించాలని చూస్తున్నారు. ఫైనల్ గా.. ట్రంప్ పెట్టిన ఆంక్షలను మోదీ తన దౌత్యంతో చిత్తు చేశారు. భారత్-ఇరాన్ సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయంటే, అమెరికా యుద్ధ నౌకల మధ్య నుంచే భారత నౌకలు గర్వంగా ప్రయాణించబోతున్నాయి. ఇరాన్ భారత్‌ను ఎందుకు ఇంతలా నమ్ముతోంది..? ఎందుకంటే కష్టకాలంలో ఇండియా.. ఇరాన్‌ను వదులుకోలేదు. పాకిస్థాన్‌ను బైపాస్ చేస్తూ ఇరాన్‌లో చాబహార్ ఓడరేవును నిర్మించి ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు భారత్ ఊపిరి పోసింది.

అమెరికా ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా, భారత్ తన అవసరాల కోసం ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తూనే ఉంది. ట్రంప్ కేవలం స్వార్థంతో ఆలోచిస్తుంటే, మోదీ 'నమ్మకం' అనే పునాది మీద ఈ బంధాన్ని నిర్మించారు. అందుకే ఈరోజు యుద్ధ మేఘాల మధ్య కూడా ఇరాన్ భారత్‌కు అండగా నిలుస్తోంది. ఇది కేవలం రెండు దేశాల మధ్య విషయం కాదు. ప్రపంచ వేదికపై మోదీ ఇమేజ్ ఏంటో ఈ ఘటన నిరూపించింది. చర్చలు విఫలమై, అమెరికా-ఇరాన్ యుద్ధానికి సిద్ధమైన వేళ.. ఇద్దరితోనూ మాట్లాడగలిగే ఏకైక నేత ప్రధాని మోదీ మాత్రమే. ట్రంప్ మొండితనం వల్ల ప్రపంచం నష్టపోతుంటే, మోదీ తెలివితేటల వల్ల భారత్ సురక్షితంగా ఉంది.

ఇరాన్ రాయబారి మాటల్లో చెప్పాలంటే, వాషింగ్టన్ తన 'చట్టవిరుద్ధమైన డిమాండ్లను' వెనక్కి తీసుకోవాలి. లేదంటే జరిగే విధ్వంసానికి ట్రంప్ మాత్రమే బాధ్యుడు. కానీ భారత్ మాత్రం ఈ గొడవలో ఇరుక్కోకుండా తన ప్రయోజనాలను కాపాడుకోగలిగింది. బాబాయ్.. చూశారుగా. ట్రంప్ అహంకారానికి, మోదీ సంస్కారానికి ఉన్న తేడా ఇదే. ప్రపంచాన్ని శాసించాలనుకున్న ట్రంప్ ఒంటరి అవుతుంటే, అందరినీ కలుపుకుపోయే మోదీ విశ్వగురువుగా ఎదుగుతున్నారు. భారత నౌకలకు హార్ముజ్ జలసంధి తెరిచే ఉండటం అనేది మోదీ గట్స్ కి నిదర్శనం.

Published : 
  • 15 April 2026, 5:25 PM IST