Top story:ఇరాన్ మైండ్ గేమ్.. ఇదిరా ధైర్యం అంటే… యుద్ధంలో ఇరాన్ దే గెలుపు…? అసలు బ్యాక్ గ్రౌండ్ లో ఏం జరిగింది..?

చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక అగ్రరాజ్యం తన డెడ్ లైన్ ని వెనక్కి తీసుకుంది. '8 గంటల లోపు లొంగిపోండి.. లేదంటే మీ నాగరికతనే తుడిచేస్తా' అన్న డొనాల్డ్ ట్రంప్.. డెడ్ లైన్ కి కేవలం 90 నిమిషాల ముందు మెత్తబడ్డాడు. ఎందుకు..?

Post Published By: dialnews
Updated : 9 April 2026, 9:23 AM IST

చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక అగ్రరాజ్యం తన డెడ్ లైన్ ని వెనక్కి తీసుకుంది. '8 గంటల లోపు లొంగిపోండి.. లేదంటే మీ నాగరికతనే తుడిచేస్తా' అన్న డొనాల్డ్ ట్రంప్.. డెడ్ లైన్ కి కేవలం 90 నిమిషాల ముందు మెత్తబడ్డాడు. ఎందుకు..? ఇరాన్ దగ్గర ఉన్న ఆ 15 వేల మిస్సైల్స్ కి భయపడిందా..? లేక ఇరాన్ ఒక 'గ్లోబల్ ఎకనామిక్ బ్లాక్ మెయిల్' చేసిందా..? ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కోమాలో ఉన్నాడని ప్రచారం జరుగుతున్నా.. ఇరాన్ సైన్యం అమెరికాను ఎలా మోకాళ్ల మీదకు తెచ్చింది..? ప్రపంచం ముందు ఇరాన్ ఒక పక్కా లెక్క పెట్టింది. 'మా మీద 13 వేల దాడులు చేశారు.. కానీ మా దగ్గర ఇంకా 15 వేల బాలిస్టిక్ మిస్సైల్స్, 45 వేల డ్రోన్లు సిద్ధంగా ఉన్నాయి' అని వాల్ స్ట్రీట్ జర్నల్ కి లీక్ ఇచ్చింది. అమెరికా ఇంటెలిజెన్స్ కూడా దీన్ని ధృవీకరించింది. ఇరాన్ తన దేశమంతా నిర్మించిన 'మిస్సైల్ సిటీస్' లో ఇవి భద్రంగా ఉన్నాయి. అమెరికా ఆ మిస్సైల్ సిటీలను నాశనం చేయాలంటే 'బంకర్ బస్టర్' బాంబులు వాడాలి.. కానీ వాటన్నింటిని ఒకేసారి కనిపెట్టడం అసాధ్యం. ఈ స్టాక్ తో ఇరాన్ కనీసం 10 ఏళ్ల పాటు యుద్ధం చేయగలదు. ఇదే అమెరికాను వణికించింది.

ఇరాన్ తన క్షిపణి కేంద్రాల చుట్టూ 'జియో-ఫెన్సింగ్', 'సిగ్నల్ జామర్స్' వాడింది. దీనివల్ల అమెరికా ప్రయోగించే అత్యంత ఖరీదైన 'శాటిలైట్ గైడెడ్ బాంబులు' దారి తప్పి ఖాళీ ప్రదేశాల్లో పడ్డాయి. ఇరాన్ ఇంత ధైర్యంగా 15 వేల మిస్సైల్స్ గురించి చెబుతోందంటే దాని వెనుక చైనా, రష్యాల అండ ఉంది. అమెరికా ఆంక్షలు విధించినా ఇరాన్‌కు అవసరమైన చిప్స్, స్పేర్ పార్ట్స్ చైనా ద్వారా అందుతున్నాయి. ఇది కేవలం అమెరికా-ఇరాన్ యుద్ధం కాదు, తెర వెనుక ఇది 'గ్లోబల్ పవర్ గేమ్'. ఇరాన్ వెనుక ఉన్న ఈ అదృశ్య శక్తుల వల్లే అమెరికా ఒక్క అడుగు వెనక్కి వేయాల్సి వచ్చింది.ఇలాగే యుద్ధం కొనసాగితే అమెరికా ఆర్థికంగా భారీగా నష్టపోతుంది. ఇరాన్ తన 'లో-కాస్ట్' ఆయుధాలతో అమెరికా ఖజానాను ఖాళీ చేసే ప్లాన్ వేసింది. అమెరికా వెనక్కి తగ్గడానికి ప్రధాన కారణం యుద్ధం కాదు.. పెట్రోల్ ధరలు. ప్రపంచ ఆయిల్ సరఫరాలో 20% వాటా ఉన్న 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' ని ఇరాన్ క్లోజ్ చేసింది. ట్రంప్ డెడ్ లైన్ ఇవ్వగానే వరల్డ్ మార్కెట్ లో ఆయిల్ రేట్ 117 డాలర్లు దాటిపోయింది. 'మీరు మమ్మల్ని కొడితే.. మేము ప్రపంచానికి ఆయిల్ ఆపేస్తాం' అని ఇరాన్ బ్లాక్ మెయిల్ చేసింది. ఇరాన్ దగ్గర ఉన్న స్టాక్ కు.. హార్ముజ్ ను ఇంకో పదేళ్ళు ఆపడం పెద్ద మేటర్ కాదు.

ఫైనల్ గా ఆయిల్ రేట్ పెరిగితే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి ట్రంప్ కి రాజకీయంగా దెబ్బ పడుతుంది. అందుకే ట్రంప్ అల్టిమేటం కాస్తా చర్చల రూపం తీసుకుంది. ఇరాన్ ఇక్కడ సైలెంట్ గా గెలిచింది. మంగళవారం వచ్చిన వార్తల ప్రకారం.. మొజ్తాబా ఖమేనీ ప్రస్తుతం 'అపస్మారక స్థితి'లో ఉన్నాడు. ఇరాన్ ప్రభుత్వం దీన్ని నిరాకరిస్తున్నా, ఆయన బయటకు రాకపోవడం అనేక అనుమానాలను రేకెత్తించింది. కానీ, ఇక్కడే ఇరాన్ తన పవర్ చూపించింది. సుప్రీం లీడర్ లేకపోయినా ఇరాన్ సైన్యం ఇంత బలంగా స్పందిస్తోందంటే, రేపు ఆయన లేకపోయినా ఇరాన్ వ్యవస్థ చెక్కుచెదరదు అనే భయాన్ని శత్రువుల్లో కలిగించారు.సుప్రీం లీడర్ కోమాలో ఉన్నా.. వ్యవస్థ ఏమాత్రం చెక్కుచెదరకుండా '10 పాయింట్ల శాంతి ప్రణాళిక'ను అమెరికా ముందు పెట్టింది. అంటే.. వ్యక్తి కంటే వ్యవస్థ ముఖ్యమని, తమ సైన్యం ఎంతటి ఒత్తిడినైనా తట్టుకోగలదని ఇరాన్ నిరూపించింది. ఇది అమెరికాకు ఒక పెద్ద హెచ్చరిక. ఒక నాయకుడు లేకపోయినా దేశం పోరాడగలదు అని నిరూపించడం ఇరాన్ సాధించిన మానసిక విజయం. కాల్పుల విరమణ జరగడానికి కొన్ని గంటల ముందే ఇరాన్ ఒక 'శాంపిల్' చూపించింది. ఇజ్రాయెల్, యూఏఈ పై 'క్లస్టర్ మ్యునిషన్స్' ఉన్న మిస్సైల్స్‌తో దాడి చేసింది.

ఒకే మిస్సైల్ లో వందల కొద్దీ చిన్న బాంబులు ఉండే ఈ టెక్నాలజీ.. ఐరన్ డోమ్ ని కూడా బోల్తా కొట్టించింది. 'మేము శాంతికి సిద్ధమే.. కానీ మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్ మీదనే ఉన్నాయి' అని ఇరాన్ ఇచ్చిన సంకేతం అమెరికాను రక్షణలోకి వెళ్లేలా చేసింది. ఖచ్చితంగా ప్రస్తుతానికి ఇరాన్ దే పైచేయి ఎందుకంటే.. ఇక్కడ కొన్ని లెక్కలు ఉన్నాయి. ట్రంప్ విధించిన 8 గంటల డెడ్ లైన్ నీరుగారిపోయింది, పాకిస్థాన్ లో జరగబోయే 'ఇస్లామాబాద్ చర్చలకు' అమెరికా అంగీకరించింది. సాధారణంగా అమెరికా తన షరతులకు లొంగిపోవాలని చెబుతుంది.కానీ ఇక్కడ ఇరాన్ కోరినట్లుగా ఒక 'తటస్థ వేదిక' మీద చర్చలకు అమెరికా అంగీకరించింది. తన ఆయుధ నిల్వలను మళ్ళీ సర్దుబాటు చేసుకోవడానికి ఇరాన్ కి రెండు వారాల విలువైన సమయం దొరికింది. అంటే అమెరికా ఇప్పుడు ఇరాన్‌ను ఒక 'సమానమైన శక్తి'గా గుర్తించి చర్చలకు వస్తోందని అర్థం. ఇది ఇరాన్ గౌరవాన్ని పెంచింది. ఒకవైపు మొజ్తాబా మరణ వార్తలు వస్తున్నా.. ఆ ఒత్తిడిలో కూడా అగ్రరాజ్యాన్ని చర్చల మేజా మీదకు తీసుకురావడం ఇరాన్ సాధించిన వ్యూహాత్మక విజయంగా చెప్పవచ్చు. చూశారుగా.. యుద్ధం అంటే కేవలం బాంబులు వేయడం కాదు.. శత్రువు ఆలోచనలను నియంత్రించడం. 15 వేల మిస్సైల్స్, ఆయిల్ గొంతు నొక్కే సామర్థ్యం ఇరాన్ కి ఈ విజయాన్ని ఇచ్చాయి. మరి ఈ రెండు వారాల కాల్పుల విరమణ తర్వాత ఏం జరగబోతోంది..? మళ్ళీ యుద్ధం మొదలవుతుందా..? లేక శాశ్వత శాంతి నెలకొంటుందా..? అనేది చూడాలి.

Published : 
  • 9 April 2026, 9:23 AM IST