Top story:ఇరాన్ సుప్రీం లీడర్ సెక్యూరిటీ దీనెమ్మ సెక్యూరిటీ, కళ్ళు భైర్లు కమ్మాల్సిందే…!

ప్రపంచ దేశాధినేతల భద్రత అంటే అంత ఈజీ ఫ్యాక్టర్ కాదు. ఏ రేంజ్ లో సెక్యూరిటీ ఉంటుందో ఊహించడం కూడా కష్టమే.

Post Published By: dialnews
Updated : 12 March 2026, 11:49 AM IST

ప్రపంచ దేశాధినేతల భద్రత అంటే అంత ఈజీ ఫ్యాక్టర్ కాదు. ఏ రేంజ్ లో సెక్యూరిటీ ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. ముఖ్యంగా అమెరికా, భారత్, చైనా, ఇజ్రాయిల్, రష్యా, జర్మనీ, ఇరాన్ వంటి దేశాధినేతల సెక్యూరిటీ ఓ సంచలనం. అయితే ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ ను ఇజ్రాయిల్ హతమార్చడంతో.. ఖమేనీకి ఉండే సెక్యూరిటీ గురించి చర్చలు మొదలయ్యాయి. అసలు ఇరాన్ సుప్రీం లీడర్ సెక్యూరిటీ ఏ రేంజ్ లో ఉంటుంది..?

ఇరాన్ సుప్రీం లీడర్ కు ‘షాడో’ సెక్యూరిటీ ఉంటుంది. ప్రపంచంలో అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే నాయకులలో ఇరాన్ సుప్రీం లీడర్ ఒకరు. ఇరాన్ రాజకీయ, మతపరమైన అధికారాలన్నీ ఆయన చేతుల్లోనే ఉండటంతో, ఆయన రక్షణ కోసం ఇరాన్ ప్రభుత్వం ఒక భారీ సైన్యాన్నే కేటాయించింది. ఆ భద్రతా వలయం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

సుప్రీం లీడర్ వ్యక్తిగత భద్రతను పర్యవేక్షించేది 'వలీ-ఎ-అమ్ర' అనే ఎలైట్ ఫోర్స్. ఇది ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లోని ఒక ప్రత్యేక విభాగం. ఇందులో దాదాపు 12,000 మంది అత్యంత శిక్షణ పొందిన కమెండోలు ఉంటారు. కేవలం శారీరక సామర్థ్యం మాత్రమే కాదు, సుప్రీం లీడర్ పట్ల అత్యంత విధేయత కలిగి ఉండాలి. వీరి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా డెప్త్ గా తెలుసుకుంటారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో NOPO దళం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వీరు నల్లటి దుస్తులు ధరించి, అత్యాధునిక ఆయుధాలతో శిక్షణ తీసుకుంటారు. ముఖ్యంగా సుప్రీం లీడర్ బహిరంగ సభలకు వచ్చినప్పుడు లేదా దేశంలో అశాంతి నెలకొన్నప్పుడు వీరు రంగంలోకి దిగుతారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో ఆరితేరిన వారిగా వీరికి గుర్తింపు ఉంటుంది.

సుప్రీం లీడర్ చుట్టూ కేవలం సైనికులే కాదు, వందలాది మంది ఇంటెలిజెన్స్ అధికారులు మారువేషంలో ఉంటారు. ఆయన వెళ్లే మార్గాలను గంటల ముందే తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఆయన నివసించే ప్రాంతం చుట్టూ రేడియేషన్, ఎలక్ట్రానిక్ నిఘా పరికరాలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. యుద్ధం లేదా విదేశీ దాడుల ముప్పు ఉన్నప్పుడు, సుప్రీం లీడర్‌ను భూగర్భంలో ఉండే అత్యాధునిక బంకర్లకు తరలిస్తారు. ఈ బంకర్లు అణు బాంబు దాడులను కూడా తట్టుకోగలవు. ఆయన ప్రయాణించే వాహనాలు బుల్లెట్ ప్రూఫ్ మాత్రమే కాదు, బాంబు దాడులను, కెమికల్ ఎటాక్స్‌ను కూడా తట్టుకోగలవు.

టెక్నాలజీ ద్వారా ట్రాక్ చేయకుండా ఉండేందుకు సుప్రీం లీడర్ కమ్యూనికేషన్ వ్యవస్థను అత్యంత రహస్యంగా ఉంచుతారు. సైబర్ దాడుల నుండి రక్షణ కోసం ఇరాన్ సొంతంగా అభివృద్ధి చేసిన నెట్‌వర్క్‌లను మాత్రమే ఆయన ఉపయోగిస్తారు. మొత్తానికి, ఇరాన్ సుప్రీం లీడర్ భద్రత అనేది ఒక మల్టీ-లేయర్డ్ వ్యవస్థ. ఒకవైపు అత్యాధునిక సాంకేతికత, మరోవైపు ప్రాణాలకు తెగించే కమెండోల కాపలా ఉంటారు. అయినా సరే ఇజ్రాయిల్.. పర్ఫెక్ట్ వర్కౌట్ చేసి సుప్రీం లీడర్ ను చంపడం ఓ సెన్సేషన్.

Published : 
  • 12 March 2026, 11:49 AM IST