యుద్ధం కొత్త దశలోకి పయనిస్తోంది. ఈ యుద్ధం క్షిపణుల తో చేసేది కాదు. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం లక్ష్యం ఆర్థిక వ్యవస్థ నీ చిన్నాభిన్నం చేయడమేప్రపంచ రాజకీయాల్లో యుద్ధం అనే పదం వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది క్షిపణులు, బాంబులు, ట్యాంకులు, డ్రోన్లు. కానీ ఆధునిక కాలంలో యుద్ధం రూపం వేగంగా మారుతోంది. ఇప్పుడు యుద్ధం కేవలం సరిహద్దుల్లో కాదు *బ్యాంక్ సర్వర్లలో, క్లౌడ్ డేటా సెంటర్లలో, ఫైనాన్షియల్ నెట్వర్క్‌లలో* కూడా జరుగుతోంది.ఇటీవల ఈ మార్పు స్పష్టంగా కనిపించే ఒక సంఘటన జరిగింది. ఇరాన్ సైనిక సంస్థ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఒక అసాధారణ ఆరోపణ చేసింది. అమెరికా , ఇజ్రాయిల్ కలిసి ఉత్తర ఇరాన్‌లోని ఒక పెద్ద బ్యాంక్‌పై దాడి చేశారని ఐఆర్ జి సి చెప్తోంది.
ఫిబ్రవరి జీతాల పంపిణీ కోసం బ్యాంక్ ఉద్యోగులు రాత్రి షిఫ్ట్‌లో పనిచేస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని ఇరాన్ వాదన.ఈ ఆరోపణలతో పాటు ఇరాన్ మరో కీలక హెచ్చరిక కూడా చేసింది .యుద్ధానికి టెక్నాలజీ సహాయం చేస్తున్నాయని ఆరోపిస్తూ ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద టెక్నాలజీ మరియు ఫైనాన్షియల్ కంపెనీలను “లెజిటిమేట్ టార్గెట్లు”గా ప్రకటించింది.ఆ జాబితాలో ఉన్న సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకీలకపాత్రపోషిస్తున్నాయి: మైక్రోసాఫ్ట్,Google,Amazon, IBM,Oracle Corporation,Palantir Technologies,Nvidia,Goldman Sachs లాంటి సంస్థలు క్లౌడ్ సర్వర్లు, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల ద్వారా యుద్ధానికి పరోక్షంగా సహాయం చేస్తున్నాయన్నది ఇరాన్ ఆరోపణ.
ఇరాన్ హెచ్చరిక వెలువడిన వెంటనే అమెరికా బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన కొన్ని స్టాక్స్ దారుణంగా పడిపోయాయి. కానీ ఇరాన్ అసలు టార్గెట్ ఈ సంస్థలు కాదు. ఇరాన్ టార్గెట్ మిడిల్ ఈస్ట్ ఆర్థిక కేంద్రంగా ఎదిగిన దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సెంటర్.
దాదాపు 270 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రంలో ప్రపంచవ్యాప్తంగా 7,700కు పైగా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఆయిల్ ట్రేడ్ సెటిల్మెంట్స్, ఫిన్‌టెక్ నెట్వర్క్స్, అంతర్జాతీయ బ్యాంకింగ్ లావాదేవీలు, క్రాస్ బార్డర్ పేమెంట్స్ ఇవన్నీ ఈ హబ్ ద్వారా జరుగుతాయి.ఈ ప్రాంతంపై ఒక చిన్న డ్రోన్ దాడి జరిగినా మార్కెట్లో కుప్పకూలిపోతాయి.
పెద్దపెద్ద సంస్థల భయం బాంబుల వల్ల కాదు *డబ్బు ప్రవాహం నిలిచిపోతుందనే భయంతో* వస్తుంది. అందుకే క్షిపణులు, బాంబు దాడులు కంటే పెద్ద పెద్ద సంస్థల ఆర్థిక పతనం యుద్ధం కంటే ప్రమాదకరమైన దని ఇప్పుడు అందరూ భయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్స్, వ్యాపారవేత్తలు, అలాగే భారతదేశానికి చెందిన కొన్ని రాజకీయ , వ్యాపార వర్గాలు తమ పెట్టుబడులన్ని దుబాయ్ కంపెనీలు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టేశారు.ఇటీవలి ఇరాన్ దాడులతో *దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా ఊహించని విధంగా కుదేలైపోయింది*. ఒకప్పుడు స్థిరమైన పెట్టుబడి కేంద్రంగా భావించిన ఈ మార్కెట్ కూడా గ్లోబల్ జియోపాలిటికల్ ఉద్రిక్తతల ప్రభావానికి లోనవుతుందని ఈ పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి.
ఇక్కడ ఒక ముఖ్యమైన వాస్తవం ఉంది. అమెరికాను సైనికంగా ఓడించడం చాలా కష్టం. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కదిలించడం అంత కష్టం కాదు.ఇరాన్ వ్యూహం కూడా ఇదే దిశలో సాగుతున్నట్టు కనిపిస్తోంది.మరోవైపు ఇజ్రాయిల్ కూడా తన వ్యూహాన్ని మార్చింది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం, దేశంలో అంతర్గత అసంతృప్తిని రెచ్చగొట్టడం, అలాగే ఇతర దేశాలను కూడా ఈ ఘర్షణలోకి లాగడానికి ప్రయత్నించడం పై ఇజ్రాయిల్ దృష్టి పెట్టింది.ఈ క్రమంలో టర్కీ, ఇండియా వంటి దేశాలు కూడా జాగ్రత్తగా పరిస్థితిని గమనిస్తున్నాయి.
అలాగే పాశ్చాత్య సైనిక కూటమి అయిన NATO పాత్రపై కూడా చర్చ జరుగుతోంది.ఈ ఘర్షణను ఒక చెస్ ఆటగా చూస్తే ప్రధాన ఆటగాళ్లు ముగ్గురు:ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా.కానీ ఆ చెస్ బోర్డుపై పావులుగా మారే ప్రమాదం మాత్రం చాలా దేశాలకు ఉంది. కొన్ని యుద్ధాలు సరిహద్దుల్లో జరుగుతాయి.కానీ ఆధునిక ప్రపంచంలో కొన్ని యుద్ధాలు…*బ్యాంక్ సర్వర్లలో ప్రారంభమై ప్రపంచ మార్కెట్లను కదిలిస్తాయి.* ఇప్పుడు అమెరికా ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చాలామంది ఆయుధాల దృష్టిలో చూస్తున్నారు. ఆర్థిక దృష్టి తో చూస్తే ఈ యుద్ధం వెనుక జరుగుతున్న ఆర్థిక విధ్వంసం అర్థమవుతుంది.