Top story: ఇది కదరా.. పొలిటికల్ గేమ్.. అంటే.. ఎవడూ ఊహించని ట్విస్ట్ స్టాలిన్, రాహుల్, విజయ్, క్రేజీ త్రీ-డైమెన్షనల్ మైండ్ గేమ్ కొడుకు కోసం స్టాలిన్ పక్కా ప్లానింగ్, విజయ్ సీఎం.. స్టాలిన్ కు లాభం…!

తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. దళపతి విజయ్ ముఖ్యమంత్రి కావడానికి రంగం సిద్ధమైంది. అయితే, ఇక్కడ అసలు ట్విస్ట్ విజయ్ గెలుపు కాదు.. ఆ గెలుపు వెనుక ఉన్న వ్యూహం

Post Published By: dialnews
Updated : 11 May 2026, 5:46 PM IST

తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. దళపతి విజయ్ ముఖ్యమంత్రి కావడానికి రంగం సిద్ధమైంది. అయితే, ఇక్కడ అసలు ట్విస్ట్ విజయ్ గెలుపు కాదు.. ఆ గెలుపు వెనుక ఉన్న వ్యూహం. దశాబ్దాల కాలంగా మిత్రపక్షాలుగా ఉన్న డీఎంకే, కాంగ్రెస్ హఠాత్తుగా ఎందుకు విడిపోయాయి..? రాహుల్ గాంధీ ఎందుకు విజయ్‌కి మద్దతు ప్రకటించారు..? వీటన్నింటి వెనుక మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఆడుతున్న అతిపెద్ద మైండ్ గేమ్ ఏంటి..? ఎన్డీయే కూటమిని తమిళనాడు పొలిమేరల్లో కూడా అడుగు పెట్టకుండా చేయాలనే స్టాలిన్ వ్యూహం ఎలా అమలువుతోందో క్లియర్ గా చూద్దాం.

తమిళనాడులో ఎన్నికల ఫలితాలు రాగానే అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం కాంగ్రెస్ మరియు డీఎంకే మధ్య పొత్తు తెగిపోవడం. కానీ, ఇది నిజంగా గొడవ వల్ల జరిగిందా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి విడిపోయిన వెంటనే రాహుల్ గాంధీ తన ఐదుగురు ఎమ్మెల్యేలను విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వమని ఆదేశించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అంటే, విజయ్‌కి అవసరమైన మెజారిటీని అందించడానికి కాంగ్రెస్‌ను ఒక పావులా స్టాలిన్ వాడుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోంది.

మరో ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే.. డీఎంకే మిత్రపక్షాలైన లెఫ్ట్ పార్టీలు మరియు వీసీకే కూడా విజయ్‌కే మద్దతు ఇస్తున్నాయి. సాధారణంగా తన కూటమిలోని పార్టీలు మరొకరికి మద్దతు ఇస్తుంటే ఏ నాయకుడైనా అడ్డుకుంటారు, కానీ స్టాలిన్ ఇక్కడ సైలెంట్‌గా ఉన్నారు. దీనికి కారణం.. ఆ మిత్రపక్షాలన్నీ విజయ్‌కు మద్దతు ఇవ్వడానికి స్టాలిన్ స్వయంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే. ఒకవేళ ఈ మిత్రపక్షాల వల్ల మెజారిటీ రాకపోతే, నేరుగా డీఎంకేనే రంగంలోకి దిగి విజయ్‌కు మద్దతు ఇచ్చి సీఎంను చేయడానికి కూడా స్టాలిన్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

ఒకవేళ విజయ్ బీజేపీ వైపు వెళ్తే ప్రమాదమని గుర్తించిన రాహుల్ గాంధీ, ముందే విజయ్‌తో చేతులు కలిపి ఆయనను 'ఇండియా' కూటమి వైపు లేదా తమకు అనుకూలమైన స్టాండ్‌లోకి తెచ్చుకున్నారు. దీనివల్ల బీజేపీకి ఉన్న ఒక్క అవకాశాన్ని కూడా స్టాలిన్-రాహుల్ ద్వయం దెబ్బకొట్టారు. రాహుల్ గాంధీకి తమిళనాడులో డీఎంకేతో పొత్తు వల్ల కేవలం కొన్ని సీట్లు మాత్రమే వస్తున్నాయి. కానీ విజయ్‌తో కలిస్తే, యువత ఓట్లు మరియు ఒక బలమైన సెలబ్రిటీ ఇమేజ్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్లస్ అవుతాయి.

అందుకే రాహుల్ గాంధీ చాలా తెలివిగా డీఎంకేతో 'బహిరంగ విడాకులు' తీసుకుని, విజయ్‌తో 'రహస్య స్నేహం' చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు విడిపోయాయి అని నమ్మించడానికి.. కనిమొజి.. పార్లమెంట్ స్పీకర్ కు ఓ లేఖ రాసారు. తమ పార్టీకి ఇండి కూటమికి సంబంధం లేదని. నిజానికి కాంగ్రెస్ కు.. స్టాలిన్ ఇండియా కూటమిలో ఉండటమే లాభం. కేంద్రంపై పోరాడాలంటే.. 22 మంది ఎంపీలు రాహుల్ కు అవసరం. అందుకే సైలెంట్ గా ఆడాల్సిన గేమ్ రాహుల్ – స్టాలిన్ ఆడుతున్నారు.మరి అసలు స్టాలిన్ ఎందుకు విజయ్‌కి ఇంతలా ఫేవర్ చేస్తున్నారు..? దీని వెనుక ఉన్న ఏకైక లక్ష్యం.. తమిళనాడులో ఎన్డీయే అడుగుపెట్టకూడదు. అన్నాడీఎంకే మళ్లీ బలపడితే అది భవిష్యత్తులో డీఎంకేకు ముప్పు అని స్టాలిన్ భయం. అందుకే, కొత్తగా వస్తున్న విజయ్‌ని ప్రోత్సహించడం ద్వారా అన్నాడీఎంకే ఓటు బ్యాంకును దెబ్బతీయాలని, అలాగే బీజేపీ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకట్ట వేయాలని స్టాలిన్ ప్లాన్ చేశారు. అన్నాడీఎంకే బలహీనపడితే, రాష్ట్రంలో డీఎంకేకు ఇక తిరుగుండదు.

అందుకే అన్నాడీఎంకేతో కలిసే కంటే, విజయ్‌కు మద్దతు ఇచ్చి వారిని రాజకీయంగా సమాధి చేయాలనేది స్టాలిన్ మాస్టర్ ప్లాన్. అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వడం కంటే విజయ్‌కు మద్దతు ఇచ్చి 'కింగ్ మేకర్' గా ఉండటమే స్టాలిన్‌కు లాభం. అలాగే స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధిని భవిష్యత్తు సీఎం చేయాలనుకుంటున్నారు. కానీ ప్రస్తుతానికి విజయ్‌కి ఉన్న క్రేజ్ ముందు అది కష్టమని ఆయనకు తెలుసు. అందుకే ఇప్పుడు విజయ్‌కి మద్దతు ఇచ్చి సీఎంను చేస్తే, ప్రభుత్వంపై వచ్చే 'యాంటీ ఇంకంబెన్సీ' (ప్రభుత్వ వ్యతిరేకత) మొత్తం విజయ్‌పై పడుతుంది.ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో ఉదయనిధిని 'రక్షకుడిగా' ప్రొజెక్ట్ చేసి అధికారంలోకి తీసుకురావాలనేది స్టాలిన్ దూరదృష్టి. నేరుగా డీఎంకే మద్దతు ఇస్తే క్యాడర్‌లో గందరగోళం వస్తుంది. అందుకే లెఫ్ట్ పార్టీలు, వీసీకే లాంటి మిత్రపక్షాలను ముందు పెట్టి విజయ్‌కు మద్దతు ఇప్పించడం ద్వారా స్టాలిన్ తన చేతులకు మట్టి అంటకుండా జాగ్రత్త పడ్డారు. దీనివల్ల "మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ఎన్డీయేను అడ్డుకోవడానికి మిత్రపక్షాల నిర్ణయానికి గౌరవం ఇచ్చాం" అని చెప్పుకోవడానికి స్టాలిన్‌కు అవకాశం ఉంటుంది.

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం.. విజయ్ పదే పదే వెళ్లి గవర్నర్‌ను కలుస్తుండటం. స్టాలిన్ మరియు రాహుల్ గాంధీ మద్దతు ఖాయమని తెలియబట్టే విజయ్ అంత ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. అంటే విజయ్ పదే పదే గవర్నర్‌ను కలవడం వెనుక స్టాలిన్ నుండి అందుతున్న 'అఫీషియల్ సపోర్ట్' కూడా ఉంది. ఒక యువ నేతను సీఎం సీటుపై కూర్చోబెట్టి, వెనుక నుండి తామే పాలనను శాసించాలని స్టాలిన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ విజయ్ పాలనలో విఫలమైతే, 6 నెలల తర్వాత ప్రజలు మళ్లీ డీఎంకే వైపే చూస్తారని, అది తమకు ప్లస్ అవుతుందని స్టాలిన్ వ్యూహం.మొత్తానికి తమిళనాడులో జరుగుతున్నది కేవలం ఒక రాజకీయ మార్పు మాత్రమే కాదు, అది అతిపెద్ద 'మైండ్ గేమ్'. రాహుల్ గాంధీ, స్టాలిన్ కలిసి విజయ్‌ని ఒక ఆయుధంగా వాడుకుని ఎన్డీయేను రాష్ట్రం నుండి శాశ్వతంగా దూరం చేయాలని చూస్తున్నారు. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అయ్యి విజయ్ సక్సెస్ అవుతారా..? లేక స్టాలిన్ వ్యూహంలో విజయ్ చిక్కుకుంటారా..? అనేది కాలమే నిర్ణయించాలి.

Published : 
  • 11 May 2026, 5:46 PM IST