మూడుసార్లు ముఖ్యమంత్రి...అంతకుముందు ఎంపీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి...ఆమె ఆస్తులు చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఆమె పేరుతో కనీసం 50 లక్షల ఆస్తులు లేవు. దీదీ అని ప్రజలందరూ ముద్దుగా పిలుచుకుంటారు. మమత బెనర్జీకి ఉన్న చరాస్తులెన్ని ? స్థిరాస్తులు ఏంటి ? ఆమె ఏం చదువుకున్నారు ? నిరాడంబర జీవితం గడుపుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.మమతా బెనర్జీ...పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లుగా కొనసాగుతున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆమెను దీదీ ప్రేమగా పిలుచుకుంటారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నప్పటికీ, ఆమె గడుపుతున్న నిరాడంబర జీవితం గడుపుతున్నారు.
భవానీ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మమత నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసే సమయంలో కూడా ఆమె ఎప్పటిలాగే తన ట్రేడ్‌మార్క్ కాటన్ చీర, హవాయి చెప్పులతో ఎంతో సాదాసీదాగా కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. మమతా బెనర్జీ సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తి వివరాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మమత మొత్తం చరాస్తులు రూ.15.37 లక్షలు కాగా 2021లో ఇది రూ.16.7 లక్షలుగా ఉంది. చేతిలో రూ. 75,700 నగదు, రూ. 1.45 లక్షల నగలు ఉన్నాయి. మమత బెనర్జీకి వ్యవసాయ భూమి లేదు. సొంత ఇల్లు లేదు. కనీసం సొంత కారు కూడా లేదు. ముఖ్యమంత్రి అఫిడవిట్‌ను చూసిన వారంతా నోరెళ్లబెడుతున్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసినా...ఏం సంపాదించలేదా ? ఆస్తులు కూడబెట్టలేదా ? అక్రమ ఆస్తులు లేవా అని చర్చించుకుంటున్నారు.
మమతా బెనర్జీ 1970లో దేశబంధు శిశు శిక్షాలయ నుంచి మాధ్యమిక విద్యను పూర్తి చేశారు. 1974లో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. కలకత్తా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. దీదీపై ఇప్పటివరకు ఎలాంటి కేసులు లేవు. మమతా బెనర్జీకి సొంత ఇల్లు కూడా లేదు. కాళీఘాట్‌లోని 30బీ హరీశ్ ఛటర్జీ వీధిని తన అడ్రస్‌గా ప్రస్తావించారు. అయితే ఆ ఇల్లు ఆమె పేరు మీద లేదు. వ్యవసాయ భూమి, స్థలం గానీ, నివాస సంబంధిత ఆస్తులు గానీ లేవు. కనీసం వ్యక్తిగత వాహనం కూడా లేదు. రెండు బ్యాంక్ ఖాతాలు ఉంటే...అందులో ఒకటి పర్సనల్ అకౌంట్. ఈ ఖాతాలో 12,36,209 ఉన్నట్లు మమత తెలిపారు.
రెండోది ఎన్నికల సంబంధిత ఖర్చుల కోసం తీసుకున్న బ్యాంకు ఖాతా. అందులో రూ.40వేలు మాత్రమే నిల్వ ఉంది. చేతిలో రూ.75,700 నగదు ఉన్నట్లు దీదీ వెల్లడించారు. 2021లో ఆమె చరాస్తుల విలువ రూ.16.72లక్షలుగా ఉంది. బ్యాంకు డిపాజిట్లు, నగదు, బంగారు ఆభరణాలు అన్నీ కలిపి ఆమె చరాస్తుల విలువ 15.37లక్షలుగా ఉంది. గత ఐదేళ్లలో దీదీ ఆస్తులు తగ్గిపోయాయి. మమతా బెనర్జీ వద్ద కేవలం 9.75 గ్రాముల బంగారం ఉంది. 2021లో దాని విలువ రూ.88,837 కాగా.. ప్రస్తుతం పసిడి విలువ భారీగా పెరగడంతో రూ.1.75లక్షలకు పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 40,600 టీడీఎస్ రిఫండ్ వచ్చినట్లు మమత వెల్లడించారు. రాయల్టీలు, బ్యాంకు వడ్డీలే తన ప్రాథమిక ఆదాయ వనరని ప్రస్తావించారు.
మమతా బెనర్జీ సంగతి ఇలా ఉంచితే...ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆపిడవిట్‌లో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. భారీగా ఆస్తులు ఉండటమే కాదు...కేసులు అదే స్థాయిలో ఉన్నాయి. సువేందు అధికారికి 61.30 లక్షల ఇల్లు, ఫ్లాట్, 2.46 ఎకరాల భూమి ఉన్నాయి. చరాస్తులు రూ. 24.57 లక్షలు, 25 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆయన ఆదాయం రూ. 17.38 లక్షలుగా ఉంది. ఇది 2021 ఎన్నికల నాటి కంటే ఆయన ఆస్తులు రెట్టింపు అయ్యాయి. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో తలపడిన వీరిద్దరూ ఈసారి భవానీపూర్ వేదికగా రెండోసారి పోటీ పడుతున్నారు. సువేందు అధికారి ఈసారి నందిగ్రామ్, భవానీపూర్ రెండు చోట్ల బరిలో నిలిచారు.