ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీని లేపేసే విషయంలో ఇజ్రాయిల్ – అమెరికా ప్లానింగ్ ప్రపంచ నాయకులను వణికించిన మాట వాస్తవం. అత్యంత భద్రత నడుమ ఉండే ఖమేనీ అంత ఈజీగా ఎలా దొరికారు అనేది అర్ధం కాని విషయం. కాని ఇక్కడ ఖమేనీని ఇజ్రాయిల్ ఎలా టార్గెట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్ కావడం ఖాయం. టెహ్రాన్‌లోని దాదాపు అన్ని ట్రాఫిక్ కెమెరాలను చాలా ఏళ్ళుగా ఇజ్రాయిల్ హ్యాక్ చేస్తోంది. ఇరాన్‌లోని సీనియర్ అధికారుల రాకపోకల కోసం ఇజ్రాయిల్ పక్కా ప్లాన్ చేసింది.
టెహ్రాన్‌లోని పాశ్చర్ స్ట్రీట్ సమీపంలో కార్యక్రమాలకు వచ్చే విషయంపై ఇజ్రాయిల్ నిఘా విభాగం మోసాద్ పక్కాగా ఫోకస్ చేసింది. ఈ ఫోకస్ తోనే.. శనివారం అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. దీని వెనుక బలమైన సపోర్ట్ హ్యాకింగ్ రూపంలోనే వచ్చినట్టు నిపుణులు అంటున్నారు. దీనిపై బ్రిటీష్ దినపత్రిక సంచలన కథనం ప్రచురించింది. ఖమేనీ ఆఫీస్ లోకి ఎవరు వస్తున్నారు.. ఏంటీ అనే దానిపై ఖమేనీ ఆఫీస్ సమీపంలో ఉన్న ఓ ట్రాఫిక్ కెమెరా ద్వారా ఇజ్రాయిల్ తెలుసుకుంది.
అక్కడ పని చేసే సెక్యూరిటీ గార్డుల సభ్యుల అడ్రస్, వర్కింగ్ హవర్స్, వారు ఆఫీస్ కు వెళ్ళే రోడ్స్, అధికారులను రక్షించేందుకు, రవాణా కోసం ఎవరిని ఇరాన్ ఉపయోగిస్తుంది అనే విషయాలను ఇజ్రాయిల్ నిఘా విభాగం మోసాద్ తెలుసుకుంది. ఖమేనీ హత్యకు ఈ సమాచారమే పక్కాగా ఉపయోగపడింది. ఈ రియల్-టైమ్ ట్రాఫిక్ డేటాను ట్రాక్ చేయడం ద్వారా ఇజ్రాయెల్ నిఘా విభాగం మోసాద్, అమెరికా నిఘా విభాగం సిఐఏ.. గురించి పక్కా సమాచారం సేకరించాయని.. బ్రిటీష్ పత్రిక వెల్లడించింది.
శనివారం ఉదయం సుప్రీం లీడర్ ఖమేనీ.. తన ఆఫీసులో ఎంత సేపు ఉంటారు, ఆయన దగ్గరకు ఎవరు వస్తారో, ఆయన ఎవరితో మాట్లాడతారో పక్కాగా ఇజ్రాయిల్ ట్రాక్ చేసింది. శనివారం ఉదయం టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న ఆఫీస్ లో.. కీలక సమావేశం జరుగుతోందని, ఇజ్రాయెల్ నిఘా వర్గాలు గుర్తించాయని, ఆ తర్వాతనే దాడులు ముందుకు వెళ్లాయని బ్రిటీష్ మీడియా తెలిపింది. సుప్రీం లీడర్ ఆ ప్రదేశంలోనే ఉంటున్నారు అని అమెరికా కూడా పక్కా సమాచారం తెలుసుకుందని పేర్కొంది.
మొబైల్ టవర్స్ కూడా ఇజ్రాయిల్ ట్రాక్ చేసిందని, దాదాపు 12 మొబైల్ ఫోన్ టవర్స్ పై ఫోకస్ చేసిందని బ్రిటీష్ మీడియా పేర్కొంది. ఖమేనీ వాడే మొబైల్ కు మోసాద్ ఫోన్ కాల్ కూడా చేసిందని సంచలన విషయం బయటపెట్టింది. యుద్ధం సరిగ్గా ప్రారంభమైన తర్వాత ఖమేనీని వేటాడటం కష్టం అని అమెరికా అంచనా వేసింది. అందుకే యుద్దాన్ని ఖమేనీ టార్గెట్ గానే ఇరాన్ మొదలుపెట్టింది. ఇరాన్ ప్రజలు త్వరగా తప్పించుకునే పద్దతులను వాడతారని.. బంకర్లలో వెళ్లి తప్పించుకునే ప్రయత్నం చేస్తారని మోసాద్ పేర్కొంది.
ఇక ఇరాన్‌పై దాడికి నెలల తరబడి ఇజ్రాయిల్ – అమెరికా ప్రణాళిక చేసాయి. కానీ ఖమేనీ, అతని సీనియర్ అధికారులు శనివారం ఉదయం టెహ్రాన్‌లోని తన కాంపౌండ్‌లో సమావేశం అవుతారని అమెరికా మరియు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు ధృవీకరించిన తర్వాత అధికారులు తమ ఆపరేషన్ కు రంగం సిద్దం చేసారు. ఖమేనీ గురించిన సమాచారం.. అతని మొబైల్ ఫోన్ సిగ్నల్స్ తమ ఇంటెలిజెన్స్ నుండి.. ఇజ్రాయెల్ నిఘాకు సమాచారం ఉందని బ్రిటీష్ మీడియా వెల్లడించింది. ఖమేనీతో సమావేశం షెడ్యూల్ ప్రకారం జరిగిందని, సీనియర్ అధికారులు ఆ ప్రదేశానికి వెళ్తున్నారని పక్కాగా ఇజ్రాయిల్ గుర్తించింది.