Top story:నో కండీషన్స్.. నో డీల్స్.. ఆపేద్దాంరా, ప్లీజ్ రా…. ఇరాన్ గ్రాండ్ విక్టరీ.. దండం పెట్టేసిన ట్రంప్…!

అగ్రరాజ్యం అమెరికా అహంకారం మట్టికరిచింది.. ప్రపంచాన్ని శాసిస్తానన్న వైట్ హౌస్ గడగడలాడిపోతోంది. నిన్నటి వరకు ఇరాన్‌ను మ్యాప్ నుంచి తుడిచేస్తానన్న డొనాల్డ్ ట్రంప్.. నేడు అదే ఇరాన్ దెబ్బకు భయపడి తోకముడిచాడు.

Post Published By: dialnews
Updated : 2 April 2026, 8:30 PM IST

అగ్రరాజ్యం అమెరికా అహంకారం మట్టికరిచింది.. ప్రపంచాన్ని శాసిస్తానన్న వైట్ హౌస్ గడగడలాడిపోతోంది. నిన్నటి వరకు ఇరాన్‌ను మ్యాప్ నుంచి తుడిచేస్తానన్న డొనాల్డ్ ట్రంప్.. నేడు అదే ఇరాన్ దెబ్బకు భయపడి తోకముడిచాడు. రెండు వారాల్లో ఇరాన్ కథ ముగిస్తాం అని విర్రవీగిన అమెరికన్ ప్రెసిడెంట్ కు చుక్కలు కనపడ్డాయి. ఎలా తప్పుకోవాలో అర్ధం కాక.. సైలెంట్ గా సైడ్ అయిపోవాలని డిసైడ్ అయిపోయాడు. 'రెండు మూడు వారాల్లో మా దాడులు ఆపేస్తాం.. ఇరాన్ మాతో ఎలాంటి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదు' అంటూ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచ దేశాలను షాక్‌కు గురిచేస్తోంది. అంటే.. ఇరాన్ తలవంచలేదు, కానీ అమెరికా మాత్రం మోకరిల్లింది. అసలు ఇరాన్ చూపించిన ఏ విశ్వరూపానికి అమెరికా వణికిపోయింది..? సూపర్ పవర్ అని చెప్పుకునే దేశం.. ఇలా అర్థాంతరంగా పారిపోవడానికి కారణం ఏంటి..? ఈ వీడియోలో చూద్దాం.

సాధారణంగా అమెరికా ఒక దేశం మీద పడిందంటే.. ఆ దేశం నాశనమైపోవాలి, లేదా అమెరికా కాళ్ల దగ్గర లొంగిపోవాలి. కానీ ఇరాన్ చరిత్ర తిరగరాసింది. ఇరాన్ తన 18 ఐటీ కంపెనీలను టార్గెట్ చేయగానే అమెరికా వెన్నులో వణుకు మొదలైంది. ఒక్క సైబర్ ఎటాక్ జరిగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ 50 ఏళ్లు వెనక్కి వెళ్తుందని పెంటగాన్ రిపోర్ట్స్ హెచ్చరించాయి. అంతేకాదు, ఇరాన్ దగ్గరున్న 'హైపర్ సోనిక్' క్షిపణులు అమెరికా విమానవాహక నౌకలను సముద్రంలోనే సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే వాషింగ్టన్ డీసీ వరకు ఇరాన్ డ్రోన్లు వస్తాయని భయపడే.. ట్రంప్ ఈ 'సేఫ్ ఎగ్జిట్' ప్లాన్ వేశారని విశ్లేషకులు చెబుతున్నారు. ఒప్పందం లేకుండానే యుద్ధం ఆపడం అంటే.. 'మమ్మల్ని వదిలేయండి బాబోయ్' అని ఇరాన్‌ను వేడుకోవడమే. గతంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయినట్లే.. ఇప్పుడు ఇరాన్ భయంతో అమెరికా పారిపోతోంది. ట్రంప్ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.. 'మేము 3 వారాల్లో దాడులు ఆపేస్తాం' అని గడువు పెట్టుకున్నారంటే.. ఇరాన్ ఇచ్చిన కౌంట్‌డౌన్‌కు అమెరికా లొంగిపోయిందని అర్థం.

ఇరాన్ అణు పరీక్షలకు సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నా.. అమెరికా ఏమీ చేయలేక చేతులెత్తేసింది. 'టెహ్రాన్ ఏ ఒప్పందం చేసుకోనక్కర్లేదు' అనడం వెనుక మర్మం ఏంటంటే.. ఇరాన్ పెట్టిన కఠినమైన షరతులకు అమెరికా తలొగ్గింది. ఇది దౌత్య విజయం కాదు.. ఇది పచ్చి ఓటమి. అమెరికా యుద్ధ నౌకలు ఇప్పుడు ఇరాన్ తీరం వదిలి వెనక్కి మళ్లుతుంటే.. ప్రపంచం మొత్తం అమెరికా వైపు చూసి నవ్వుకుంటోంది. ఇరాన్ దెబ్బకు అమెరికా పారిపోవడం చూసి ఇజ్రాయెల్ లాంటి మిత్రదేశాలు ఇప్పుడు ఒంటరి అయిపోయాయి.

ఇరాన్ యొక్క 'రెసిస్టెన్స్ ఫోర్స్' ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌ను ఏలబోతోంది. రష్యా మరియు చైనాల అండతో ఇరాన్ సాధించిన ఈ విజయం.. రాబోయే రోజుల్లో అమెరికా ప్రాభవం తగ్గిపోతుందని చెప్పడానికి ఒక సంకేతం. అగ్రరాజ్యం తన ఇమేజ్‌ను కాపాడుకోవడానికి ఎన్నెన్ని కబుర్లు చెప్పినా.. వాస్తవం ఒక్కటే.. ఇరాన్ గర్జించింది.. అమెరికా వణికిపోయింది. ఒక చిన్న దేశాన్ని కూడా లొంగదీసుకోలేని అమెరికా ఇక సూపర్ పవర్ ఎలా అవుతుంది..? రెండు మూడు వారాల్లో దాడులు ఆపేయడం అంటే.. ఇరాన్ శక్తి ముందు అమెరికా ఆయుధాలు మొద్దుబారిపోయాయని ఒప్పుకోవడమే.

ఈ పరిణామం చూసి రష్యా, చైనాలు నవ్వుకుంటున్నాయి. ఇప్పటివరకు అమెరికాను నమ్ముకున్న మిత్రదేశాలు ఇప్పుడు అయోమయంలో పడ్డాయి. ఒక చిన్న దేశం తన పట్టుదలతో అగ్రరాజ్యాన్ని గడగడలాడించింది. ఇరాన్ తన 18 ఐటీ కంపెనీలను టార్గెట్ చేయడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయని సమాచారం. సాధారణంగా అమెరికా ఏ దేశంతోనైనా యుద్ధం ఆపాలంటే కొన్ని వందల కండిషన్లు పెడుతుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే.. 'ఇరాన్ ఏ ఒప్పందం చేసుకోనక్కర్లేదు' అని ట్రంప్ స్వయంగా చెప్పారు.

అంటే ఇరాన్ తన షరతులకు లొంగకపోయినా, తన అణు కార్యక్రమాన్ని ఆపకపోయినా.. అమెరికా మాత్రం తప్పుకుంటోంది. ఇది ఇరాన్ సాధించిన నైతిక విజయం కాదా..? అంటున్నారు నిపుణులు. ట్రంప్ తాజా ప్రకటన ప్రకారం.. అమెరికా మిలిటరీ ఆపరేషన్స్ కేవలం మరో 15 నుంచి 20 రోజులు మాత్రమే కొనసాగుతాయి. ఆ తర్వాత ఒక్క అమెరికా విమానం కూడా ఇరాన్ గగనతలంలో కనిపించదు. ఏది ఎలా ఉన్నా.. నిన్నటి వరకు ఇరాన్ మీద బాంబుల వర్షం కురిపిస్తామని గర్జించిన ట్రంప్.. ఇప్పుడు పారిపోవడం షేకింగే.

Published : 
  • 2 April 2026, 8:30 PM IST