Top story: మహా సంక్షోభం ముంగిట…ఆర్థిక పతనాన్ని మోడీ రహస్యంగా ఎందుకు ఉంచారు?

బంగారం కొనొద్దు. పెట్రోల్ డీజిల్ వాడొద్దు. డెస్టినేషన్ వెడ్డింగ్స్‌ వద్దు. విదేశీ ప్రయాణాలు అసలే వద్దు. వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ చేయండి. బస్సుల్లో, మెట్రోలో తిరగండి. ఆయిల్స్‌ వాడొద్దు. అతిగా తినొద్దు. ఇది ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు.

Post Published By: dialnews
Updated : 13 May 2026, 10:29 AM IST

బంగారం కొనొద్దు. పెట్రోల్ డీజిల్ వాడొద్దు. డెస్టినేషన్ వెడ్డింగ్స్‌ వద్దు. విదేశీ ప్రయాణాలు అసలే వద్దు. వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ చేయండి. బస్సుల్లో, మెట్రోలో తిరగండి. ఆయిల్స్‌ వాడొద్దు. అతిగా తినొద్దు. ఇది ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు. ఖజానాలో విదేశీ మారక ద్రవ్యం పెంచడం కోసం ఇదొక్కటే మార్గం అని ఆయన భావించినట్లు ఉన్నారు.ప్రధాని ఆందోళనతో ఇచ్చిన ఈ హెచ్చరిక ఆర్థిక అలారం మోగించినట్లుంది. దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కడో గాడి తప్పిందని విషయం అర్థం అయిపోయింది. రేపో...మాపో...పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పేట్లు లేదు. నిత్యావసర వస్తువులు రేట్లు వాచిపోతాయి.మోడీ వార్నింగ్ వెనక ఆందోళన ఇదే. దేశం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఆ విషయం పైకి చెప్పకుండా ... రకరకాల మార్గాల్లో పొదుపు చేయాలని ప్రధాని మనకి సుద్దులు చెప్తున్నారు. మధ్య తరగతి జనానికి పొదుపు మంత్రం నేర్పిస్తున్నా రూ.

పైకి చెప్పడం లేదు కానీ మన ఆర్థిక పరిస్థితి అంతర్గతంగా చాలా ఆందోళనకరంగా ఉంది. అది పైకి కనిపించకుండా కేంద్రం, ప్రధాని మోడీ రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అమెరికా ఇరాన్యుద్ధం ప్రభావం కావచ్చు, విదేశీ మారక ద్రవ్యం తరిగిపోయి ఉండొచ్చు. ఖర్చులు పెరిగిపోయి ఉండొచ్చు. అప్పులు, వడ్డీలు మరింత పిండేస్తుండవచ్చు. మొత్తం మీద మన ఆర్థికం అస్తవ్యస్తం గా మారిపోయింది. ప్రధాని ప్రభుత్వ వైఫల్యాలను మన బాధ్యతలుగా మార్చేస్తున్నారు. బంగారం కొనొద్దంటా రూ. ఎందుకు కొనకూడదో చెప్ప రూ. పెట్రోల్, డీజిల్ వాడొద్దంటా రూ. ఎందుకు వాడకూడదో చెప్ప రూ. కూడు లేనోడిని ఉపవాసం చేయమన్నట్లు ఉంది ప్రధాని పొదుపు సూత్రం. అన్నం లేని వాళ్లకి ఆడంబరం ఎట్లా వస్తుంది అనే విషయాన్ని మాత్రం అందరూ విస్మరిస్తున్నారు.

నిన్నటి వరకు దేశం వెలిగిపోతుంది అన్నా రూ. ఇప్పుడు కాలిపోతుంది మళ్లీ జాగ్రత్త అంటున్నా రూ. జనాన్ని ప్రధాని అయోమయంలో పడేస్తున్నాడు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అలవికాని హామీలు ఇచ్చా రూ. అప్పుడు చెప్పొచ్చుగా ఈ పొదుపు సూత్రాలు. ఇలా ఎన్నికలు అవగానే మళ్లీ పొదుపు మంత్రాలు వల్లిస్తున్నాడు. మనల్ని హెచ్చరిస్తున్నా రూ. నిజానికి భారత ఆర్థిక పతనాన్ని ప్రధాని కేంద్రం, ప్రధాని చాలా ఏళ్లుగా రహస్యంగా ఉంచుతున్నారు. అంతా బాగుంది... మనం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిపోతున్నాం, అమెరికా చైనా మనమే పడాయి ప్రచారాలన్నీ విపరీతంగా చేశాం. కానీ బయట అలాంటి పరిస్థితులు లేవు. పేదరికం ఎక్కడ తగ్గిన సూచనలు కనిపించట్లేదు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సంక్షేమ పథకాల పిచ్చిలో లక్షల కోట్లు అప్పులు చేసి జనాన్ని కూర్చోబెట్టి మేపుతున్నాయి. మొబైల్ ఫోన్లో మొదలుకొని లాప్టాప్ డెస్క్ టాప్ వరకు స్వదేశీ ఉత్పత్తి లేకపోవడంతో విదేశాల నుంచే మనం దిగుమతి చేసు కుంటున్నాం. ఆర్థిక వ్యవస్థలో అసలు ఏం జరుగుతుందో చెప్పకుండా ఇన్నాళ్లు రహస్యంగా దాచిపెట్టి ఉంచడం వల్ల ఇప్పుడు అది సంక్షోభం అంచులకు చేరినా కూడా బయట పెట్టలేని పరిస్థితి ఉంది. దేశం అంతా రియల్ ఎస్టేట్ పడుకుంది. పారిశ్రామిక ఉత్పత్తులు అంతంత మాత్రమే ఉన్నాయి.

విదేశీ మారకద్రవ్య నిల్వలు పెట్రోల్ డీజిల్ కొనడానికి సరిపోతుంది. అంతర్జాతీయంగా గట్టిగా రెండు పెద్ద యుద్ధాలు వచ్చేటప్పటికి మన ఆర్థిక వ్యవస్థ కుదేలు అయిపోయింది. చివరికి ప్రభుత్వం చేసి.... త్యాగాలు మాత్రం ప్రజలను చేయమంటున్నారు. సూచించిన జాగ్రత్తగా నీ కేవలం సామాన్యులకేనా? రాజకీయ నాయకులకు వర్తించవా అనే వాదనలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. భారీ కాన్వాయిలు... విజయోత్సవాలు... పార్టీ ర్యాలీలు ఇవన్నీ జనం సొమ్ముతో చేస్తున్నవి కాదా? తగ్గించుకోవచ్చుగా అనే వాదన వినిపిస్తోంది. ప్రజలకు పొదుపు పాటలు చెప్తున్నా ప్రధాని వాళ్ల పార్టీ నేతలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించగలరా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్గం అమలు చేయగలరా? గ్రాండ్ గా పెళ్లిళ్లు చేయొద్దు.... డెస్టినేషన్ వెడ్డింగ్ వద్దు, పెళ్లిలకు బంగారం కొనొద్దు అని చెప్తున్నా మోడీ పెళ్లిళ్లు చేస్తున్న అంబానీకి, ఆదానికి ఈ సలహా ఇవ్వగలరా? ఆయన వాళ్ళ పెళ్లిళ్లకి వెళ్లకుండా ఉండగలరా? కేంద్రం తన వైఫల్యాలను కప్పిపుచ్చి ప్రజలను త్యాగాలను చేయమంటుందని విమర్శలు వస్తున్నాయి. అసలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పడం ఏంటి ఆర్థిక వ్యవస్థ గురించి... ఇన్నాళ్లు రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది అని జనం ప్రశ్నిస్తున్నారు.

 

 

Published : 
  • 13 May 2026, 10:29 AM IST