తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో ఇంత జరుగుతుంటే మీరంతా ఏంచేస్తున్నారు? నాపై... జనసేన పార్టీపై.. వైసీపీ సోషల్ మీడియాలో కుమ్మేస్తుంటే మీరెవరు ఎందుకు నోరెత్తలేదు? నన్ను తిడితే నేనే స్పందించాలా? మీరంతా ఏం మాట్లాడరా? నావల్ల మీరంతా పదవులు పొంది ఎంజాయ్ చేస్తున్నారా? ఎమ్మెల్సీ నాగబాబుకి ఆడవాళ్ళ బట్టలు గురించి తప్ప మిగిలిన విషయాలు పట్టవా? కాకినాడ ఎంపీ లండన్ లో ఏం పీకుతున్నాడు? అరవ శ్రీధర్ అనే వాడివల్ల పార్టీ మొత్తం బ్రష్టుపడిపోయింది. ఎవరెవరు ఏంటో.... తెర వెనక ఏం చేస్తున్నారో చిట్టా అంతా నాదగ్గరుంది. తీరు మార్చుకోకపోతే సీరియస్ యాక్షనే..! ఇదీ జనసేన జనరల్ బాడీ మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ ఆవేదన.జనసేన జనరల్ బాడీ మీటింగ్లో ముఖ్య నేతల తీరుపై ఓ రేంజ్‌లో మండిపడ్డారు పవన్. లడ్డూ వ్యవహారంపై వైసీపీ విష ప్రచారం చేస్తున్నా.. ఎందుకు ఎవరూ తిప్పికొట్టడం లేదని వాపోయారు.పార్టీకి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా అన్నింటికీ నేనే మాట్లాడాలా..? అలా అయితే.. ఎమ్మెల్యేలు, మంత్రులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా మీరెందుకు ఉన్నారంటూ నిలదీశారు. లడ్డూలో జంతువు కొవ్వు ఉందని తాను ఒకప్పుడు చెప్పిన మాటల్ని పట్టుకొని, ఇప్పుడు సిబిఐ ఇచ్చిన ఛార్జ్ షీట్ నీ చూపిస్తూ వైసిపి వాళ్లు తనకు వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తున్నారని, జనసేన నుంచి ఒక్క నాయకుడు కూడా దానిని పండించలేదన్నది పవన్ ఆవేదన.
కాకినాడ ఎంపీ ఉదయ్ పై పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను సంక్రాంతికి పిఠాపురం వెళ్తే కాకినాడ జనసేన ఎంపీ మాత్రం లండన్ లో విహారయాత్రలు చేస్తున్నాడని ఎద్దేవా చేశాడు. ఎంపీ విదేశాల్లో కూర్చుంటే ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? ప్రజలకు అందుబాటులో ఉండాలని హెచ్చరించారు. అంతేకాదు లోక్సభలో ఎంపీ ఉదయ్ ఏనాడైనా ఒక మంచి ప్రశ్న అడిగారా అని కూడా పవన్ కళ్యాణ్ నిలదీయడం ఆశ్చర్యం కలిగించింది. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ ర్యాలీలకు జనసేన నాయకులు హాజరవుతున్నారని.. మరి మీరు ఏం చేస్తున్నారంటూ ఎంపీని నిలదీశారు. టిడిపి రాలేదు తో జనసేన నాయకులకు ఏం సంబంధం, స్థానిక నాయకులు జనసేన కార్యకర్తలను ఎలా పంపిస్తారు అంటూ నిలదీయడం కొత్త ప్రశ్నలు లేవదీసింది.
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై పవన్ సీరియస్ అయ్యారు. శ్రీధర్ అనేవాడి వల్ల పార్టీ బ్రష్టు పడిపోయిందని, శ్రీధర్ లాంటి వాళ్ళ చాలామంది చిట్టా తనదగ్గర ఉందని హెచ్చరించారు. ఒకానొక దశలో ఆవేశంగా మాట్లాడుతూ సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్.. మీరు ఏం చేస్తారో రిపోర్ట్ ఇవ్వండి అంటూ నాదెండ్ల మనోహర్ .. ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరికి ఆదేశాలు ఇచ్చారు.ఇవన్నీ పక్కన పెడితే జనసేన కీలక నేత, ఎమ్మెల్సీ నాగబాబుని పవన్ మాటలతో వేటాడారు. సొంత అన్నని కూడా చూడకుండా.... అంతమందిలో నాగబాబు నిలదీశారు పవన్. ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి.... చీరలు బట్టలు గురించి సోషల్ మీడియాలో వీడియోలు చేసి పెట్టే నాగబాబుకి, తిరుమల లడ్డు లాంటి ఇతర విషయాలపై స్పందించాల్సిన అవసరం లేదా అని నేరుగా పవన్ కళ్యాణ్ నిలదీయడం ఆశ్చర్యం కలిగించింది.ఓవరాల్ గా ఇటీవల ప్రభుత్వం ఎదుర్కొంటున్న వివాదాలు సంక్షోభాల్లో జనసేన నాయకులు స్పందించడం లేదు. జనసేన ఎదుర్కొంటున్న వివాదాలను, విమర్శలను టిడిపి నేతలు కూడా ఖండించడం లేదు. దీన్ని బట్టి రెండు పార్టీల మధ్య గ్రౌండ్ లెవెల్ లో చాలా గ్యాప్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలోనే పవన్ కళ్యాణ్ బాగా టెన్షన్ పడుతున్నట్లు జనరల్ బాడీ మీటింగ్ లో ఆయన తీరు చెప్తోంది.