పిఠాపురంకు గిఫ్ట్ రెడీ చేసిన పవన్..!

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తనను గెలిపించిన, పిఠాపురం నియోజకవర్గానికి కానుకలు రెడీ చేసారు డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్.

Post Published By: dialnews
Updated : 19 February 2026, 2:32 PM IST

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తనను గెలిపించిన, పిఠాపురం నియోజకవర్గానికి కానుకలు రెడీ చేసారు డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్. ఉప్పాడ మత్స్యకారుల కోసం పిఠాపురం వేదికగా భారీ ప్రకటనకు సిద్ధమయ్యారు. గత అక్టోబర్‌లో మత్స్యకారులు లేవనెత్తిన సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించింది డిప్యూటి సిఎం కార్యాలయం. సముద్ర కోత నివారణ, కాలుష్య నియంత్రణపై డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక దృష్టి సారించారు.

మత్స్య సంపద వృద్ధి, అధునాతన పద్ధతుల్లో వేట, మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు వ్యవసాయం, ఇతర ఉపాధి అవకాశాల మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు పవన్. మెరైన్ ఫిషరీస్ నిపుణులు, ఉన్నతాధికారుల సలహాలతో పక్కా రోడ్ మ్యాప్ రెడీ చేసుకుని రంగంలోకి దిగుతున్నారు.

Published : 
  • 19 February 2026, 2:32 PM IST