Police have registered a case against former Chief Minister Nara Chandrababu Naidu as A1
అన్నమయ్య జిల్లా ముదివేడు మండలంలోని అంగల్లు గ్రామంలో ఇటీవల చంద్రబాబు నాయుడు పర్యటించారు. ప్రాజెక్టు సందర్శించేందుకు వచ్చి అక్కడి స్థానిక టీడీపీ కార్యకర్తలను, పార్టీ శ్రేణులను రెచ్చగొట్టేలా ప్రసంగిస్తున్నారని కురబలకోట మండలం, దాదంవారిపల్లి చెందిన బి.ఆర్ ఉమాపతి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన తంబళ్లపల్లె నియోజకవర్గం ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1 గా నారా చంద్రబాబు నాయుడిని చేర్చగా, ఏ2 మాజీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఉన్నారు. వీరితో పాటూ మరో 18 మందిని ఎక్యూస్డ్ గా పేర్కొన్నారు. క్రైమ్ నెంబర్ 79 /2023 120బి 147 145 153 307 115 109 323 324 506 రెడ్ విత్149 ఐపీసీ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ముదివేడు ఎస్సై షేక్ మొబిన్ తాజ్ తెలిపారు.
ఎఫ్ఐఆర్ లో నమోదైన పేర్ల వివరాలు
T.V.SRIKAR