Top story:అండర్ వాటర్ డ్రోన్… వణికిస్తున్న ఇరాన్ టెక్నాలజీ, ఇదేం ప్లాన్ రా బాబూ…!

మొండివాడి దగ్గర బలం ఉంటే.. ప్రపంచం వణుకుతుంది.. ఈ విషయాన్ని ఇరాన్ అక్షరాలా ప్రూవ్ చేస్తుంది. పోరాడితే పోయేది ఏముందనే ధీమాతో యుద్దాన్ని మొదలుపెట్టిన ఇరాన్.. తాను నాశనం అయినా పర్వాలేదనే ధీమాతో.. ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది.

Post Published By: dialnews
Updated : 13 March 2026, 12:52 PM IST

మొండివాడి దగ్గర బలం ఉంటే.. ప్రపంచం వణుకుతుంది.. ఈ విషయాన్ని ఇరాన్ అక్షరాలా ప్రూవ్ చేస్తుంది. పోరాడితే పోయేది ఏముందనే ధీమాతో యుద్దాన్ని మొదలుపెట్టిన ఇరాన్.. తాను నాశనం అయినా పర్వాలేదనే ధీమాతో.. ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. ప్రపంచ చమురు మ్యాప్ నే మార్చేస్తోంది. హార్మోజ్ జల సంధిలో నేనే కింగ్ అని తోడగోట్టిన ఇరాన్.. ఆ మార్గంలో అడుగు పెడితే మాత్రం చుక్కలు చూపిస్తోంది. సి మైన్స్ తో పాటుగా అండర్ వాటర్ డ్రోన్స్ ను కూడా రంగంలోకి దించింది.ఇప్పుడు హార్మోజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరుగుతున్న టైంలో, ఇరాన్ తన అండర్ వాటర్ డ్రోన్ల శక్తిని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. వీటిని సాంకేతికంగా 'అన్‌మ్యాన్డ్ అండర్ వాటర్ వెహికల్స్' అని పిలుస్తారు. ఇరాన్ నౌకాదళం ఇటీవల వీటిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇరాన్ వద్ద ఉన్న ప్రధాన అండర్ వాటర్ డ్రోన్లు ఒకసారి చూస్తే..

అజ్దార్: ఇది ఇరాన్ అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన అండర్ వాటర్ డ్రోన్. ఇది దాదాపు 8 మీటర్ల పొడవు ఉండి, చూడటానికి టార్పెడో లాగా ఉంటుంది. దీని ప్రత్యేకత చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇది సముద్రం అడుగున అత్యంత నిశ్శబ్దంగా ట్రావెల్ చేస్తుంది. దీనివల్ల శత్రువుల సోనార్ వ్యవస్థలకు చిక్కడం చాలా కష్టం. ఇది సుమారు 200 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లి పెద్ద యుద్ధ నౌకలను కూడా ధ్వంసం చేయగలదు. నీటి అడుగున సుమారు 24 గంటల పాటు నిఘా వేయగలదు లేదా లక్ష్యం కోసం వేచి ఉంటుంది.

హదీద్-110: ఇది ఫిబ్రవరి 2025లో ఇరాన్ కొత్తగా ప్రదర్శించిన జెట్-ఇంజిన్ అండర్ వాటర్ సూసైడ్ డ్రోన్. ఇది నీటి అడుగున ప్రయోగించి.. టార్గెట్ ను అత్యంత వేగంగా ఢీకొంటుంది.అసలు ఈ డ్రోన్ లు ఎలా పని చేస్తాయంటే.. అటానమస్ ఆపరేషన్ లు ఇవి చేస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇవి మనుషుల ప్రమేయం లేకుండానే టార్గెట్ ను ఐడెంటిఫై చేసి దాడి చేస్తాయి. తక్కువ ఎత్తులో ప్రయాణం చేయడం వీటి సామార్ధ్యం. కొన్ని రకాల డ్రోన్లు (UGEV) సముద్ర మట్టానికి కేవలం 50 సెంటీమీటర్ల ఎత్తులో ప్రయాణించి రాడార్లకు దొరకకుండా తప్పించుకుంటాయి. వీటిని సాధారణ సబ్‌మెరైన్‌ల నుంచే కాకుండా, చిన్న బోట్ల నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఇరాన్ తన డ్రోన్లను సముద్రం మధ్యలో నుంచి ప్రయోగించడానికి ప్రత్యేకమైన నౌకలను సిద్ధం చేసింది.

షహీద్ బఘేరీ అనే నౌకను ఇరాన్ సిద్దం చేసింది. ఇది ఒక భారీ కంటైనర్ నౌక. ఈ నౌకను డ్రోన్ క్యారియర్‌గా మార్చారు. దీనిపై 180 మీటర్ల పొడవైన రన్‌వే ఉంది, దీని ద్వారా వందలాది డ్రోన్లను ప్రయోగించవచ్చు. సాధారణ యుద్ధ నౌకలను రాడార్ల ద్వారా గుర్తించవచ్చు, కానీ ఈ అండర్ వాటర్ డ్రోన్లు "ఇన్విజిబుల్ కిల్లర్స్" లాంటివి. ఇవి హార్మోజ్ వంటి ఇరుకైన జలసంధుల్లో అమెరికా వంటి దేశాల భారీ యుద్ధ నౌకలకు ప్రధాన ముప్పుగా మారాయి. కేవలం 20,000 డాలర్లు ఖర్చయ్యే ఈ డ్రోన్లను అడ్డుకోవడానికి శత్రు దేశాలు మిలియన్ల డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ డ్రోన్ల వినియోగం వల్ల సముద్ర యుద్దాల స్వరూపమే మారిపోతుంది.

Published : 
  • 13 March 2026, 12:52 PM IST