Top story: రాధన్ విజయ్ కొంపముంచేన్… జ్యోతిష్యుడు పిచ్చిలో పడి తొలిదెబ్బ తిన్న విజయ్…!

పొలిటికల్ లీడర్లకి, సినిమా వాళ్లకి నిజంగానే జాతకాల పిచ్చెక్కువ. ఎవరి మాట వినని రాజకీయ నాయకులు కూడా జ్యోతిష్యులు చెప్పే మాటకి దెబ్బకి తలవంచుతారు. అందుకే పవర్ లో ఉన్న వాడి దగ్గర ఎవడో ఒక జ్యోతిష్యుడు చేరుతాడు.

Post Published By: dialnews
Updated : 14 May 2026, 12:30 PM IST

పొలిటికల్ లీడర్లకి, సినిమా వాళ్లకి నిజంగానే జాతకాల పిచ్చెక్కువ. ఎవరి మాట వినని రాజకీయ నాయకులు కూడా జ్యోతిష్యులు చెప్పే మాటకి దెబ్బకి తలవంచుతారు. అందుకే పవర్ లో ఉన్న వాడి దగ్గర ఎవడో ఒక జ్యోతిష్యుడు చేరుతాడు. వాడే చక్రం తిప్పుతూ ఉంటాడు. అలాంటి జ్యోతిష్యుని నమ్ముకుని పాలనలో మొదటి రోజే దెబ్బతిన్నాడు తమిళనాడు సీఎం జోసఫ్ విజయ్. చివరికి కళ్ళు తెరిచి తన తప్పు తానే తెలుసుకొని సరిదిద్దుకున్నాడు. నువ్వు సీఎం అవుతావు అని చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడు రిక్కీ రాధన్ పండిట్ నీ ముఖ్యమంత్రి విజయ్ తన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓ ఎస్ డి గా నియమించుకున్నారు. వ్యక్తిగత జ్యోతిష్యుల ను తీసుకొచ్చి ఇలా ప్రభుత్వ పోస్టింగ్ ఇవ్వడం, అది కూడా మొదటి రోజే ఒక జ్యోతిష్యుని ఓ ఎస్ డి గా నియమించడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చినాయి.

జాతకాలు చెప్పేవాడిని క్యాబినెట్ హోదాతో ఓ ఎస్ డి ఎలా చేస్తారంటూ మిత్రపక్షాలైన వి సి కె, డిఎండికే, వామపక్షాల నాయకులు ప్రశ్నించారు. రిక్కీ రాధన్ తమిళనాడులో ఒక ప్రముఖ జ్యోతిష్యుడు. సీఎం జయలలిత కి కూడా ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడుగా ఉన్నారు. ఈరోడ్ లో జన్మించిన రాధాన్ పండిట్ 1991 లో జయలలిత గెలుపుని అంచనా వేసి తమిళనాడు పాలిటిక్స్ లో పాపులర్ అయ్యాడు. కానీ 2014లో జయలలిత జైలుకెళ్తారన్న అంచనా తప్పడంతో ఆమె రాధన్ కి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత రాధన్ సింగపూర్ లో సెటిల్ అయ్యారు. జయలలితకు భయపడి రాధన్ సింగపూర్ పారిపోయారని కొందరు చెబుతూ ఉంటారు. అద్వానీ సహ ఎందరో ప్రముఖులకు రిక్కీ జ్యోతిష్యం చెప్పారు. ఇటీవల విజయ్ విజయాన్ని కూడా అంచనా వేసి, ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చారు.

గెలుపుని ముందే చెప్పి.... తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చిన రిక్కీ రాదనుకు వెనక.. ముందు చూడకుండా ఏకంగా తన ఓఎస్డి పోస్ట్ ఇచ్చేశారు విజయ్. దీంతో ఎవరి రికీరాధాన్ పండిత్ అని జనమంతా ఇంటర్నెట్లో సెర్చింగ్ చేశారు. జ్యోతిష్యుని ఓఎస్డి గాని నియమించడంపై విజయ్కు మిత్రపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. శాస్త్రీయ దృక్పథాన్ని నెలకొల్పడం ప్రభుత్వ బాధ్యతని, కానీ రిక్కీ రాదని నియమించి విజయ్ అందుకు విరుద్ధంగా ప్రవర్తించారని తమిళనాడు సిపిఐ సెక్రటరీ షణ్ముగం విమర్శించారు. ఇలాంటి వ్యక్తులను ప్రభుత్వంలో నియమించుకోవడం వల్ల జ్యోతిష్యం పై ప్రజల్లో మూఢనమ్మకం పెరగడం తప్ప మరో ఉపయోగం లేదని వామపక్షాలు ఆరోపించాయి.జ్యోతిష్యుడికి క్యాబినెట్ హోదాలో ప్రభుత్వంలో చోటు ఇవ్వడం ఏంటని అన్ని పార్టీలు విజయ్ ని వెక్కిరించాయి. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా టీవీకెపై డిఎండికే ఎమ్మెల్యే, దివంగత కెప్టెన్ విజయకాంత్ సతీమణి ప్రేమలత మండిపడ్డారు.

మీకు యువత ఓటు వేసి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చింది. కానీ మీరు అధికారం చేపట్టగానే జ్యోతిష్యం నమ్ముతున్నారు. యువత మిమ్మల్ని నమ్మితే, మీరు జ్యోతిష్యులు నమ్ముతారా? దీని మేం ఖండిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.ఓఎస్డిగా జ్యోతిష్యుడు రాధన్ పండిట్ ను నియమించడంలో తమిళనాడు సీఎం విజయ్ తొందరపడినట్లు స్పష్టమైనది. బల నిరూపణకు ముందే రాధ నియామకం ఆలోచిత చర్యాన్ని రాజకీయ విశ్లేషకులు మీడియాలోనే ఓపెన్ గా మాట్లాడారు. మ్యాజిక్ ఫిగర్ కు ఎడ్జ్ లో ఉన్న విజయ్ ఇలాంటి రాంగ్ స్టెప్ ఎందుకు వేశారు అనేది చాలామంది వాదన. అసెంబ్లీలో మరో మిత్రపక్షమైన విసికె కూడా విజయ నిర్ణయాన్ని తప్పు పట్టింది. చేసిన పొరపాటును విజయ్ వెంటనే దిద్దుకున్నారు. ఓ ఎస్ డి గా రిఖీరాధన పండిత్ ఒకని రద్దు చేశారు. అప్పటికప్పుడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిపక్షాలు సంగతి మిత్రపక్షాలే విజయ్ ని ఈ విషయంలో వ్యతిరేకించడంతో, అసెంబ్లీ ముగిగానే రాధా నియామకాన్ని రద్దు చేస్తూ జారీ చేశాడు విజయ్.మున్ముందు ఇలాంటి తప్పులు జరగకుండా విజయ్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. లేదంటే మిత్రపక్షాలే తమిళనాడు ముఖ్యమంత్రి ఒక ఆట ఆడుకుంటాయి.

 

 

Published : 
  • 14 May 2026, 12:30 PM IST