Top Story:ఎన్డీఏతోవిజయ్…? త్రిష చేతిలో విజయ్ కీలుబొమ్మా…?

ఎన్డీఏతో టీవీకే చేరుతుందా ? అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం గ్యారెంటీనా ? బీజేపీతో టీవీకే పొత్తులను త్రిష డిసైడ్‌ చేస్తున్నారా ? ఇప్పటికే ఎన్ని సీట్లు, ఏ యే స్థానాల్లో పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ వచ్చేసింది.

Post Published By: dialnews
Updated : 18 March 2026, 8:00 PM IST

ఎన్డీఏతో టీవీకే చేరుతుందా ? అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం గ్యారెంటీనా ? బీజేపీతో టీవీకే పొత్తులను త్రిష డిసైడ్‌ చేస్తున్నారా ? ఇప్పటికే ఎన్ని సీట్లు, ఏ యే స్థానాల్లో పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. పొత్తుల అంశాన్ని తేల్చేందుకే...అమిత్ షాతో త్రిష భేటీ అయ్యారా ? డీఎంకేను దెబ్బ కొట్టడం ఎన్టీఏ కూటమికి సాధ్యమేనా ?
తమిళనాడు రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ముక్కోణపు పోరులో పైచేయి సాధించేందుకు పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి.

డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే మధ్య జరుగుతున్న ఫైట్‌లో పైచేయి ఎవరు సాధిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల నిర్వహించిన సర్వేల్లో డీఎంకె కూటమికి అన్నాడీఎంకే కూటమి కంటే 5శాతం మెరుగ్గా ఉన్నట్లు తేలింది. దీంతో ఎన్డీఏ నేతలు అప్రమత్తమయ్యారు. ఎలాగైనా తమిళనాడును తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా...వ్యూహాలకు పదును పెట్టారు. విజయ్‌ పార్టీ...టీవీకేకు 12 శాతం ఓట్లు వస్తాయిని సర్వేల్లో వెల్లడైంది. దీంతో టీవీకే పార్టీని ఎలాగైనా తమ కూటమిలోకి లాగాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా విజయ్ గర్ల్ ఫ్రెండ్‌ త్రిషతో మంతనాలు జరుపుతున్నారు. ముంబైలో హోం మంత్రి అమిత్ షాతో త్రిష భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పొత్తులు, ఇచ్చే సీట్లు, మంత్రి పదవులపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

ఎన్‌డీఏ-టీవీకే పొత్తు...విజయ్ పార్ట్‌నర్ త్రిష చేతుల్లో ఉందని రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా విజయ్ త్రిషతో డేటింగ్‌ చేస్తున్నారు. కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. బీజేపీ చీఫ్‌ నైనార్ నాగేంద్రన్‌ నటి ఇంటి నుంచి బయటకు రావాలని వ్యాఖ్యానించడం...ఆ తర్వాత సంగీతతో విజయ్ విడాకుల వ్యవహారం బయటపడటం చకచకా జరిగిపోయాయి. త్రిషతో ఎఫైర్‌ కారణంగా విడాకులకు దరఖాస్తు చేసుకున్న విజయ్ భార్య సంగీత తెలిపారు. డైవర్స్ వ్యవహారం కోర్టులో ఉంది. దీంతో విజయ్, త్రిష...వారిద్దరు తమ వ్యవహారాన్ని ఇక దాచకూడదని డిసైడయ్యారు. ఓ నిర్మాత కుమారుడి వివాహానికి విజయ్‌-త్రిష...ఒకే వాహనంలో కలిసి వచ్చారు.

ఈ పరిణామంతో విజయ్-త్రిష డేటింగ్‌ చేస్తున్నారన్న వార్తలకు బలం చేకూరింది. ఇంతలోనే విజయ్‌తో త్రిష పెళ్లి అంశాన్ని ఆమె తల్లి పరోక్షంగా అంగీకరించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో రిపోర్టర్ ప్రశ్నకు...సీఎం కావాలన్నదే ధ్యేయమని త్రిష చెప్పారు. ఇప్పుడు పొత్తులను డిసైడ్ చేస్తున్నారు. జయలలితలాగా ఆమె సీఎం అవుతారన్న అంచనాలు బలపడుతున్నాయి.
టీవీకే పార్టీకి 12 శాతం ఓట్లు రావచ్చని పలు సర్వేలు అంచనా వేశాయి. డీఎంకేను ఎలాగైనా ఓడించాలని భావిస్తున్న ఎన్డీఏ...విజయ్‌ను కూటమిలో చేర్చుకుంటే తిరుగుండదని లెక్కలు వేస్తోంది. అన్నాడీఎంకే, బీజేపీ, టీవీకే పార్టీలు కలిస్తే...డీఎంకేను సులువుగా ఓడించవచ్చని ఎన్డీఏ నేతలు లెక్కలు వేసుకున్నారు. ప్రస్తుతం డీఎంకే, అన్నాడీఎంకే కూటమి మధ్య 5శాతం ఓట్ల తేడా ఉంది. విజయ్ చేరితో అన్నాడీఎంకే కూటమి 7శాతం ఓట్లతో పై చేయి సాధిస్తుంది. అందుకే డైరెక్టుగా విజయ్‌తో చర్చలు జరపకుండా త్రిషతో సంప్రదింపులు జరుపుతోంది.

కరూరు తొక్కిసలాట కేసుతో విజయ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటీవల సీబీఐ విచారణకు హాజరైన విజయ్...ఉత్సాహంగా బయటకు వచ్చారు. ఎన్డీఏలో చేరితే...కేసుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆమెకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జననాయగన్‌ విడుదలకు సహకరిస్తామని చెప్పినట్లు సమాచారం. న్సార్‌ బోర్డు సైతం విజయ్‌ సినిమాను పునఃపరిశీలించేందుకు తాజాగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదంతా త్రిష అమిత్ షాతో భేటీ వల్లనే సాధ్యమైందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగానే....మాజీ సీఎం పళనిస్వామి తనయుడు మిథున్‌‌ కూడా పలు మార్లు త్రిషతో సమావేశమయ్యారు. ఎన్డీఏలో చేరికపైన త్రిష, మిథున్‌ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

ఎన్డీఏ కూటమితో టీవీకే పొత్తు కుదరడం గ్యారెంటీ అన్న ప్రచారం జరుగుతోంది. 234 సీట్లున్న తమిళనాడులో అన్నాడీఎంకే ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది ? టీవీకేకు ఇచ్చే స్థానాలు ఎన్ని ? బీజేపీ ఎన్ని నియోజకవర్గాల్ల పోటీ చేస్తుంది ? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. దాదాపు 80 సీట్లు విజయ్ పార్టీకి ఇచ్చేందుకు బీజేపీ నేతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కూటమిలోకి విజయ్ వస్తే అంగీకరించేది లేదని ఇటీవలే అన్నాడీఎంకే చీఫ్‌, మాజీ సీఎం పళనిస్వామి కామెంట్స్‌ చేశారు. ఇంతలోనే తమిళనాడు ఎన్నికల సీన్‌ మారిపోతోంది. పొత్తుల వ్యవహారం త్రిష చేతుల్లోనే ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. 80 సీట్లకు టీవీకే చీఫ్ విజయ్ అంగీకరిస్తాడా ? త్రిష చెప్పినట్లు నడుచుకుంటాడా ? అన్నది కాలమే సమాధానం చెప్పాలి.

Published : 
  • 18 March 2026, 8:00 PM IST