ప్రపంచం మరో భారీ యుద్ధం వైపు అడుగులు వేస్తోందా? అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట ఇప్పుడు ఇంటర్నేషనల్ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. ఇరాన్ దేశ అగ్రనేతలందరినీ కేవలం 'ఒక్క దెబ్బతో' లేపేస్తామంటూ ట్రంప్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే ఈసారి ఇరాన్ కూడా ఊరికే కూర్చోలేదు. అమెరికాకు అసలు చరిత్రే లేదు, నాగరికత లేదు, కనీసం గౌరవం కూడా లేదంటూ ఇరాన్ ఇచ్చిన కౌంటర్ వార్నింగ్‌కు ట్రంప్ మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు అమెరికా ప్రెసిడెంట్ అంత ఘాటు వ్యాఖ్యలు ఎందుకు చేశారు? దానికి ఇరాన్ అత్తరు సీసాతో ఇచ్చిన అదిరిపోయే రిప్లై ఏంటి? అసలు ఈ రెండు దేశాల మధ్య ఇంత పగ ఎందుకుంది?
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శత్రుత్వం ఈరోజుది కాదు. దశాబ్దాలుగా నడుస్తోంది. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాన్‌తో ఉన్న న్యూక్లియర్ డీల్‌ను రద్దు చేసి, ఆ దేశంపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించారు. అది చాలదన్నట్టు, 2020లో ఇరాన్ అత్యంత శక్తివంతమైన మిలిటరీ జనరల్ 'ఖాసిం సులేమానీ'ని అమెరికా డ్రోన్ దాడి ద్వారా ఇరాక్‌లో హతమార్చింది. అప్పటి నుంచి ఇరాన్ అమెరికాపై కక్షతో రగిలిపోతోంది. ఇరాన్ అగ్రనేతలు ఎప్పటికైనా అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. అప్పటి నుంచి ఈ రెండు దేశాలు ఎప్పుడు తలపడతాయా అనే ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో, ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన ఒక భారీ వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఒక దేశ సుప్రీం లీడర్‌ను శత్రుదేశాలు టార్గెట్ చేసి చంపడంతో ఇరాన్ ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఆయన మరణం తర్వాత ఇరాన్ దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఖమేనీ పార్థివ దేహాన్ని ఇరాన్ రాజధాని టెహరాన్‌తో పాటు కాం, నజాఫ్, కర్బలా వంటి పవిత్ర నగరాల్లో వారం రోజుల పాటు ఊరేగిస్తున్నారు. ఈ అంత్యక్రియల వేడుకలకు ఊహించని విధంగా లక్షలాది మంది ఇరాన్ ప్రజలు పోటెత్తారు. ఇరాన్ ప్రభుత్వం కూడా దీన్ని తమ జాతీయ ఐక్యతకు, అమెరికాపై తమ నిరసనకు ప్రతీకగా ప్రపంచానికి చూపిస్తోంది.
ఇరాన్ వీధుల్లో కిక్కిరిసిన ఈ భారీ అంత్యక్రియల జనసందోహాన్ని చూసిన అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. యాక్సియోస్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన నోరు పారేసుకుంటూ.. 'ఇరాన్ ప్రజలకు ఖమేనీ అంటే ఇష్టం లేదనుకున్నా, ఇదంతా చూస్తుంటే నకిలీ కన్నీళ్లలా ఉన్నాయి' అంటూ ఎగతాళి చేశారు. అంతటితో ఆగకుండా.. 'ప్రస్తుతం ఇరాన్ టాప్ లీడర్స్, మిలిటరీ జనరల్స్, మంత్రులందరూ ఆ అంత్యక్రియల దగ్గరే ఒకే చోట గుమికూడారు. అమెరికా అనుకుంటే కేవలం ఒక్క షాట్ తో వాళ్లందరినీ అక్కడికక్కడే ఖతం చేయగలదు.
కానీ, అలా చేస్తే భవిష్యత్తులో చర్చలు జరపడానికి అవతలి వైపు ఎవరూ మిగలరు, అందుకే మేము ఆ బాంబు దాడి చేయడం లేదు' అంటూ అత్యంత అహంకారంతో బెదిరింపులకు దిగారు. ట్రంప్ చేసిన ఈ 'ఒక్క షాట్' బెదిరింపులకు ఇరాన్ ఊహించని రేంజ్లో తిప్పికొట్టింది. ఆర్మేనియాలోని ఇరాన్ ఎంబసీ సోషల్ మీడియా వేదికగా అమెరికా పరువు తీసేలా ఒక పవర్ఫుల్ పోస్ట్ పెట్టింది. 'నిన్ననే 250వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్న అమెరికాకు అసలు నాగరికత అంటే ఏంటో తెలియదు, దానికి చరిత్ర లేదు, కనీసం గౌరవం అంటే ఏంటో కూడా తెలియదు' అని విమర్శించింది. అందుకే ఇరాన్ ప్రజల గుండెల్లో ఉన్న నిజమైన బాధ, దేశభక్తి ఏంటో అమెరికా లాంటి దేశానికి అర్థం కావడం లేదని ఘాటుగా సమాధానం ఇచ్చింది.
అంతేకాదు, ప్రపంచం మెచ్చుకునేలా ఒక అద్భుతమైన పోలికను చెప్పింది. 'ట్రంప్.. మీరు కేవలం మనుషులను మాత్రమే చంపగలరు, కానీ వారి ఆశయాలను కాదు. మీరు అలీ ఖమేనీని చంపి ఒక అత్తరు సీసాను పగలగొట్టారు.. ఇప్పుడు ఆ సువాసన, ఆయన ఆశయాలు ప్రపంచమంతా మరింతగా వ్యాపిస్తున్నాయి' అంటూ ట్రంప్ నోరు మూయించేలా సమాధానం ఇచ్చింది. మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు ఎంత దారుణంగా మారాయో. ఒకవైపు సుప్రీం లీడర్ మరణంతో రగిలిపోతున్న ఇరాన్.. మరోవైపు తగ్గేదే లేదంటున్న డోనాల్డ్ ట్రంప్.