Top story:ఏం స్కెచ్ వేశావు రా…? ట్రంప్‌పై హత్యాయత్నం అంతా నాటకం డైవర్షన్ గేమ్ ఆడుతున్న డొనాల్డ్ ట్రంప్…!

హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే కనిపించే దృశ్యాలివి. వాస్తవానికి సిల్వర్ స్క్రీన్‌పైనే ఇంకాస్త రియలెస్టిక్‌గా ఉంటాయి. కానీ, వైట్‌హౌస్‌ కరెస్పాండెంట్స్ డిన్నర్‌లో ట్రంప్‌పై హత్యాయత్నం మాత్రం అంత రియలెస్టిక్‌గా లేదు అంటున్నారు అమెరికన్లు

Post Published By: dialnews
Updated : 28 April 2026, 10:00 PM IST

హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే కనిపించే దృశ్యాలివి. వాస్తవానికి సిల్వర్ స్క్రీన్‌పైనే ఇంకాస్త రియలెస్టిక్‌గా ఉంటాయి. కానీ, వైట్‌హౌస్‌ కరెస్పాండెంట్స్ డిన్నర్‌లో ట్రంప్‌పై హత్యాయత్నం మాత్రం అంత రియలెస్టిక్‌గా లేదు అంటున్నారు అమెరికన్లు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం రిపబ్లికన్లే చేసిన ఒక ఫేక్ అస్సాసినేషన్‌గా అనుమానిస్తున్నారు. అందుకు పక్కా ఆధారాలనూ సోషల్ మీడియాలో ట్వీట్లుగా వదులుతున్నారు. దానికంటే ముందు వాషింగ్టన్‌లోని హిల్టన్ హోటల్‌లో అసలేం జరిగిందో ఒకసారి చూద్దాం.వైట్‌హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్‌లో జరిగింది ఇదే. డిన్నర్‌ వద్ద సీక్రెట్‌ సర్వీసెస్‌ బృందం ఏర్పాటు చేసిన సెక్యూరిటీని దాటుకొని ఒక దుండగుడు ఆయుధాలతో హిల్టన్ హోటల్‌లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అడ్డుకున్న భద్రతా సిబ్బంది పైకి కాల్పులు జరిపాడు. వెంటనే ఎదురుకాల్పులు జరిపిన బలగాలు, అతన్ని వెంబడించి అదుపులోకి తీసుకొన్నాయి.

ఈ కాల్పుల్లో ఓ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌ గాయపడినట్లు వాషింగ్టన్‌ డీసీ పోలీస్‌ కమిషనర్‌ వెల్లడించారు. నిందితుడిని 31 ఏళ్ల కోల్‌ థామస్‌ అలెన్‌గా గుర్తించారు. అతను కాలిఫోర్నియాలోని టోరెన్స్‌ ప్రాంతానికి చెందినవాడని, హిల్టన్‌ హోటల్‌లో అతిథి అని చెప్పారు. కాల్పుల ఘటనలో అతిథులెవరికీ హానీ జరగలేదన్నారు. ట్రంప్‌, ప్రభుత్వంలోని అధికారులే నిందితుడి లక్ష్యమని తాత్కాలిక అటార్నీ జనరల్‌ మీడియాకు వెల్లడించారు. సింపుల్‌గా చెప్పాలంటే, వైట్‌హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్‌లో జరిగింది ఇదే. ఈ ఘటనలో అధ్యక్షుడు సురక్షితంగా బయటపడినా, ప్రస్తుతం చట్టపరమైన చిక్కుల్లో ఉన్న వైట్‌హౌస్ సమీపంలోని ఒక 'బాల్‌రూమ్' ప్రతిపాదనకు మద్దతు కూడగట్టడానికే ఈ ఘటనను "స్టేజ్డ్" అంటే ముందుగా పక్కాగా ప్లాన్ చేసిన నాటకం అని విమర్శకులు ఆరోపిస్తున్నారు. అందుకు కారణం కాల్పుల తర్వాత ట్రంప్ బాల్‌రూమ్ అంశాన్ని తెరపైకి తేవడమే.

కాల్పుల ఘటన తర్వాత ట్రంప్ చేసిన ప్రతిపాదనే ఇది. వైట్‌హౌస్ ప్రాంగణంలోనే ఒక భారీ, సురక్షితమైన బాల్‌రూమ్‌ను నిర్మించాలని పిలుపునిచ్చారు. 'రాత్రి జరిగిన ఘటనే మన గొప్ప సైన్యం, సీక్రెట్ సర్వీస్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్.. గత 150 ఏళ్లుగా ప్రతి అధ్యక్షుడు వైట్‌హౌస్ ప్రాంగణంలోనే ఒక పెద్ద, సురక్షితమైన బాల్‌రూమ్ నిర్మించాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారో తెలియజేస్తోంది." అని పేర్కొన్నారు. ఆ తర్వాతే సోషల్ మీడియాలో #Staged హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవ్వడం ప్రారంభమైంది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారు. ఈ ఫేక్ హత్యాయత్నం జరుగుతున్న సమయంలో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఒక టేబుల్ నుండి మరో టేబుల్‌కు తిరుగుతూ మిగిలిపోయిన డ్రింక్స్ కోసం వెతుకుతూ కనిపించాడని ఒక యూజర్, కాల్పుల సమయంలో డొనాల్డ్ ట్రంప్ స్పందనను, మెలానియా ట్రంప్ ముఖంలోని భయాన్ని వేలెత్తి చూపుతూ, ఈ ఎపిసోడ్ అంతా కేవలం ఒక బాల్‌రూమ్ కోసం ఆడిన నాటకమని మరో యూజర్ ఆరోపించారు.
అమెరికా అధ్యక్షుడిపై హత్యాయత్నం జరిగితే రక్షణ మంత్రి చాలా కూల్‌గా తిరగడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ కాల్పుల ఘటనపై ట్రంప్, మెలానియా రియాక్షన్లూ అనుమానాలకు తావిస్తున్నాయి.

ఇక ఎఫ్‌బీఐ చీఫ్ కాశ్ పటేల్ కూడా కుర్చీలోంచి కదల్లేదు. ఇలా చెప్పుకుంటూపోతే అసలు అక్కడ ఏదో ఓ చిన్న సంఘటన జరిగింది అన్నట్టుగా వారి తీరు కనిపించింది తప్పితే అమెరికా అధ్యక్షుడిపై హత్యాయత్నం జరిగినట్టుగా ఎవ్వరూ ఫీల్ అవ్వలేదు. అందుకే, నెటిజన్లు ఇదేదో ప్లాన్ చేసిన వ్యవహారంలా ఫీల్ అవుతున్నారు. ప్రధానంగా బాల్‌రూమ్ అంశాన్ని తెరపైకి తెచ్చి ఇదంతా ఒక నాటకం అని కొట్టిపారేస్తున్నారు. పైగా మీడియాపై పదేపదే దాడులు చేస్తున్నప్పటికీ, వైట్‌హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ ఈ ఏడాది వార్షిక విందుకు ట్రంప్‌ను ఆహ్వానించింది. గత కొన్నేళ్లుగా ఈ వేడుకను బహిష్కరిస్తున్న ట్రంప్, అధ్యక్షుడిగా ఈ డిన్నర్‌కు హాజరుకావడం ఇదే మొదటిసారి. ఇదే సమయంలో ఇతర ఉన్నతాధికారుల సమావేశాలతో పోలిస్తే, ఈ విందుకు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగం తక్కువ స్థాయి భద్రతను కల్పించిందని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. అందుకే ఈ కాల్పుల ఘటన ఆన్‌లైన్‌లో కుట్ర సిద్ధాంతాలకు మరింత ఆజ్యం పోసింది. అమెరికా ఎన్నికలకు కొన్ని నెలల ముందు పెన్సిల్వేనియా ర్యాలీలో జరిగిన కాల్పుల ఘటనతో కొందరు దీనిని పోల్చుతున్నారు. అప్పట్లో జరిగిన దాడిలో ట్రంప్ చెవికి స్వల్ప గాయమైంది, ఒక ప్రేక్షకుడు మరణించాడు. ఆ దాడి కూడా ప్రజల సానుభూతి కోసమే ప్లాన్ చేశారనే ఆరోపణలు వచ్చాయి, ఇప్పుడు తాజా ఘటన తర్వాత మళ్ళీ అవే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇక బాల్‌రూమ్ ప్రాజెక్ట్ విషయానికొస్తే.. వైట్ హౌస్ సమీపంలో సుమారు 400 మిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో 90వేల చదరపు అడుగుల భారీ బాల్‌రూమ్‌ను నిర్మించాలని ట్రంప్ ప్రతిపాదించారు. వైట్ హౌస్ కాంప్లెక్స్ లోపలే ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించడానికి ఇదొక హైసెక్యూరిటీ వేదికగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ తీవ్రమైన చట్టపరమైన, రాజకీయ అడ్డంకులను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ట్రంప్‌పై హత్యాయత్నం, బాల్‌రూమ్‌ను మళ్లీ తెరపైకి తేవడానికే అని చాలా మంది అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా.. ఎప్‌స్టీన్ ఫైల్స్ కేసులో విరాచణ, ఇరాన్ యుద్ధంలో వైఫల్యాలు, అమెరికన్లలో ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది అన్నదానిలో ఏ అనుమానం లేదు. పైగా త్వరలోనే అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికన్లను డైవర్ట్ చేయడం ఇలాంటి ఒక ఘటనతోనే సాధ్యం అవువుతుంది. కాబట్టి.. ఈ వ్యవహారంలో ట్రంప్ సర్కార్‌నూ అనుమానించాల్సిందే.

 

Published : 
  • 28 April 2026, 10:00 PM IST