50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయం. నాలుగు సార్లు ముఖ్యమంత్రి.ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఎదురీత ఆయనకు అలవాటు అయిన పని. ఆయనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే ఎందుకో ఈ మధ్య చంద్రబాబుకు జ్ఞాపకశక్తి తగ్గిందా..? లేక సమాచారం లోపమా తెలియదు గాని తాను మాట్లాడిన దానికి తానే కౌంటర్ వేసుకొని జనం ముందు చులకన అయిపోతున్నారు. చెప్పిందే చెప్పి....10 సార్లు చెప్పి అబద్దాన్ని నిజం చేయవచ్చని బలంగా నమ్మి చంద్రబాబు
ఆ జోరులో హిట్ వికెట్ చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో మూడు నాలుగు సందర్భాల్లో అలా అడ్డంగా దొరికిపోయారు చంద్రబాబు.
అసెంబ్లీలో తిరుమల లడ్డు కల్తీ విషయంపై మాట్లాడుతూ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి క్రైస్తవుడని, జగన్ అతన్ని టీటీడీకి చైర్మన్ ఎలా చేశారని నిలదీశారు చంద్రబాబు. అంతేకాదు కరుణాకర్ రెడ్డి తన కుమార్తె పెళ్లి మెదక్ చర్చిలో చేశారని ఫోటోలతో సహా చూపించారు. చంద్రబాబు మాట్లాడిన పావు గంటకి ప్రెస్ మీట్ పెట్టిన కరుణాకర్ రెడ్డి ,బాబును కడిగిపారేశారు. తాను హిందువు నని, తన కుమార్తె వివాహం తిరుపతిలో హిందూ సంప్రదాయ బద్ధంగా జరిగిందని, ఆ వేడుకకు బాలకృష్ణ, రామ్మూర్తి నాయుడు కూడా విచ్చేసారని ఫోటోలతో సహా ఆధారాలు బయటపెట్టి చంద్రబాబు పరువు తీశారు.
అసెంబ్లీ సాక్షిగా కరుణాకర్ రెడ్డి గురించి అబద్ధాలు చెప్పి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు బాబు. కేవలం ఈ విషయంలో మాత్రమే కాదు... తిరుమల ఏడుకొండల వివాదాల్లో కూడా... ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన 746 ,747 జీవోలు రద్దు చేస్తానని 2009లో క్రైస్తవుల కార్యక్రమంలో రికార్డెడ్‌గా హామీ ఇచ్చేశారు చంద్రబాబు.ఈ విషయం కూడా మర్చిపోయి, అసెంబ్లీ సాక్షిగా తిరుమల ఏడుకొండల పై మళ్లీ ఇష్టానుసారంగా రివర్స్ గేర్ లో మాట్లాడారు బాబు. ఏడుకొండలు రెండు కొండలు చేస్తానంటే తానే అందుకు వ్యతిరేకంగా పోరాడానని, తన వల్లే 746, 747 జీవోలు వచ్చాయని... అందుకోసం తిరుమల నడిచి వెళ్లి వెంకన్నకి మొక్కు కూడా తీర్చుకున్నానని చెప్పుకొచ్చారు చంద్రబాబు.
ఇలా చంద్రబాబు సమయానికి తగినట్లుగా, అవసరం వచ్చినప్పుడు అందుకు అనుగుణంగా మాట్లాడుతూ
అబద్దాన్ని నిజం చేయాలని, నిజాన్ని అబద్ధం చేయాలని ప్రయత్నిస్తూ దొరికి పోతున్నారు. ఇదే విషయంపై పార్టీలోనూ ,లీడర్ల మధ్య పెద్ద చర్చ జరుగుతుంది. చంద్రబాబు ఎందుకు ఇలా ప్రవర్తించి అందరిని బుక్ చేస్తున్నారని నాయకులు బుర్ర కొట్టుకుంటున్నారు. అసలు మాట్లాడకుండా ఉంటే గొడవే రాదు కదా అని అంటున్నారు టిడిపి నేతలు.