Top story: దమ్ముంటే చూసుకుందాం రా అంటున్న కొడాలి.. సైలెంట్ అయిపోయిన పేర్ని వైసీపీలో ఏం జరుగుతోంది..?

ఏపీ రాజకీయాల్లో కొడాలి నానీకి ఉన్న ఇమేజ్ వేరు. ఆయన పేరుకు పెద్దగా పరిచయం కూడా అవసరం లేదు. వైసీపీకి నమ్మకమైన నాయకుడిగా, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు నమ్మిన బంటుగా కొడాలి నానీ

Post Published By: dialnews
Updated : 6 March 2026, 10:21 AM IST

ఏపీ రాజకీయాల్లో కొడాలి నానీకి ఉన్న ఇమేజ్ వేరు. ఆయన పేరుకు పెద్దగా పరిచయం కూడా అవసరం లేదు. వైసీపీకి నమ్మకమైన నాయకుడిగా, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు నమ్మిన బంటుగా కొడాలి నానీకి మంచి పేరు ఉంది. వైసీపీ ఆవిర్భావం నుంచి, జగన్ వెంట నడిచిన కొడాలి నాని.. 2024 తర్వాత సైలెంట్ అయిపోయారు. పార్టీ నేతలను ఒక్కొక్కరిని అరెస్టు చేస్తున్న తర్వాత.. కొడాలి నాని లో భయం పెరిగింది అనే మాట రాజకీయ వర్గాల్లో వినపడింది. టిడిపి నియోజకవర్గంలో బలంగా కనపడటంతో.. కొడాలి నాని కొంతకాలం నియోజకవర్గానికి కూడా దూరంగానే ఉంటూ వస్తున్నారు.

అయితే ఇటీవల కాలంలో ఆయన పార్టీకి దూరంగా ఉండటం పట్ల, కొంత అధినాయకత్వం అసహనం వ్యక్తం చేస్తుంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. జగన్ వెంట నడిచి.. ఇప్పుడు దూరం కావడం పట్ల, కొంత పార్టీ నాయకులు ఆగ్రహంగా ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది. నియోజకవర్గంలో పార్టీ నాశనం అయిపోతున్న సరే, కొడాలి నాని మాత్రం బయటకు రాకపోవడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. కొడాలి నాని మాట్లాడితే రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం ఉంటుంది.

ఇటీవల కాలంలో వైసీపీని పదేపదే.. టిడిపి అదే విధంగా జనసేన పార్టీలు టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. రాజకీయంగా వైసీపీని దెబ్బ కొట్టేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే, మాట కూడా వినపడుతోంది. ఇలాంటి సమయంలో కొడాలి నాని మాట్లాడకపోవడాన్ని, ఆ పార్టీ కార్యకర్తలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక నియోజకవర్గానికి నాని దూరంగా ఉండటం ఒకటైతే.. కేసుల భయంతో నాని మాట్లాడటం లేదనేది రాజకీయ వర్గాల్లో జరిగే చర్చ. ఈ చర్చతో నానిని అభిమానించే వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు.

అయితే ఇప్పుడు కొడాలి నాని మళ్లీ యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు.. ఇటీవల కాలంలో ఆయన నిర్వహించిన మీడియా సమావేశం స్పష్టం చేసింది. గతంలో కొడాలి నాని ఏ విధంగా మాట్లాడారో.. దాదాపుగా అలాగే నాని భాష ఉంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. వైసిపి అనుకూల మీడియా కూడా ఓ రేంజ్ లో కొడాలి నానికి హైపిచ్చింది. అంబటి రాంబాబు అరెస్టు తర్వాత కొడాలి నానిలో ధైర్యం వచ్చింది అనే మాట కూడా వినపడుతోంది.

జోగి రమేష్, అంబటి రాంబాబు ఇద్దరు.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనుకున్నా సరే.. స్వేచ్ఛగా బయటకు రావటం చూసి, కొడాలి నాని కూడా అదే రేంజ్ లో ధైర్యంగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. కొడాలి నానికే ఉన్న మాస్ ఫాలోయింగ్.. వైసిపికి కృష్ణాజిల్లా వ్యాప్తంగా మంచి ఊపు తీసుకొచ్చింది. ఆయన ప్రభావం గుంటూరు జిల్లాలో కూడా కొంత అన్నమాట వాస్తవం. ఇప్పుడు కొడాలి నాని యాక్టివ్ అయితే మాత్రం వైసిపి అధిష్టానానికి కూడా జోష్ వస్తుంది.

ముఖ్యంగా వైఎస్ జగన్ కు, కొడాలి నానితో ఉన్న సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో.. రాజకీయంగా పార్టీకి బూస్ట్ అందించే విషయంలో నాని దూకుడు హెల్ప్ అవుతుంది. 2014 నుంచి 2019 వరకు కొడాలి నాని ఎక్కడ వెనక్కు తగ్గేవారు కాదు. అసెంబ్లీలో కూడా నాని దూకుడు పార్టీకి చాలా హెల్ప్ అయింది. అందుకే ఇప్పుడు నాని విషయంలో జగన్ కూడా కొంత ఓపికగా ఎదురు చూసి.. ఆయనను బయటకు తీసుకురావాలనే ప్రయత్నాలు కూడా చేశారు.

ఇక అంబటి రాంబాబుకు.. పార్టీ అండగా నిలబడిన నేపథ్యంలో.. కొడాలి నాని లో కూడా మళ్ళీ ధైర్యం కనపడి.. ఏం జరిగినా చూసుకుందాం అనే ధీమాతోనే ఆయన మాట్లాడుతున్నట్లు కనపడుతోంది. అయితే కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని మాత్రం.. కొంత సైలెంట్ గా ఉండటం, ఆ పార్టీకి ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. 2024 లో అధికారం కోల్పోయిన సరే.. బందరు పార్లమెంటుతో పాటుగా.. కృష్ణ జిల్లా మొత్తం నాని కొంత ప్రభావం చూపించారు. కానీ ఇప్పుడు మళ్లీ పేర్ని నాని సైలెంట్ అయిపోవడాన్ని.. ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే విషయంలో.. ఆయనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు నాని సైలెంట్ కావడంతో.. జనసేనను విమర్శించే విషయంలో, కొంత పార్టీ వెనుక పడుతోందనే భావన కూడా ఉంది. మరి నానీలు ఇద్దరు దూకుడు పెంచి మళ్ళీ యాక్టివ్ అయితే మాత్రం జగన్ కు కృష్ణా జిల్లాలో తలనొప్పి తప్పినట్లే.

Published : 
  • 6 March 2026, 10:21 AM IST