Top Story:పవన్ చేసిన తప్పు? విజయ్ గెలుపు… పవన్ కి కనువిప్పు అవుతుందా…?

పార్టీ పెట్టి సరిగ్గా రెండేళ్లు. పెద్ద పెద్ద బడాయి లకు పోలేదు.ప్రతిరోజు తన గురించి తాను స్వీయ భజన చేసుకోలేదు.పొత్తు పెట్టుకోవాల్సిందేనని మెడ మీద కత్తి పెట్టి భయపెట్టిన.... తలవంచలేదు. సెన్సార్ పేరు చెప్పి సినిమా ఆపేసిన వెనకడుగు వేయలేదు.

Post Published By: dialnews
Updated : 5 May 2026, 4:58 PM IST

పార్టీ పెట్టి సరిగ్గా రెండేళ్లు. పెద్ద పెద్ద బడాయి లకు పోలేదు.ప్రతిరోజు తన గురించి తాను స్వీయ భజన చేసుకోలేదు.పొత్తు పెట్టుకోవాల్సిందేనని మెడ మీద కత్తి పెట్టి భయపెట్టిన.... తలవంచలేదు. సెన్సార్ పేరు చెప్పి సినిమా ఆపేసిన వెనకడుగు వేయలేదు. వ్యక్తిగత జీవితాన్ని బజారుకీడ్చినా నోరెత్తలేదు. ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోలేదు. ఎవరి చంక ఎక్కి కూర్చోలేదు. వాడిని చంపుతా.... వీడిని నరుకుతా... గుడ్డలు విప్పి పరిగెట్టిస్తా ఇలాంటి పెద్ద పెద్ద శఫదాలు చేయలేదు. అన్నిటికీ మించి గంటకో సిద్ధాంతం , పూటకో విధానం అవలంబించలేదు. అటు సనాతన ధర్మాన్ని.... ఇటు ద్రవిడ సిద్ధాంతాన్ని రెండింటినీ నెత్తిన పెట్టుకోలేదు. ఇవేమీ లేకపోయినా ప్రజలు అతనికి పట్టం కట్టారు. తమిళ నటుడు విజయ్ పార్టీ టి వి కే తమిళనాడు ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని స్థాపించడానికి సిద్ధం అవుతుంది.

ఈ సందర్భంలో అందరికీ గుర్తొస్తున్న ఏకైక వ్యక్తి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్.2009 నుంచి రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ పిఆర్పి తో తన పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశారు.2014లో రాష్ట్రం విడిపోయాక జనసేన పార్టీ పెట్టారు. ఆ పార్టీ పెట్టి ఇప్పటికి 12 ఏళ్లు.2024 ఎన్నికల్లో మూడు పార్టీల కూటమి కలసి పోటీ చేస్తే పవన్ పార్టీ కి 21 సీట్లు వచ్చాయి. అంతకు ముందు 2014లో బిజెపి టిడిపిలకు సపోర్ట్ చేసి ప్రభుత్వ ఏర్పాటుకు సాయపడ్డాడు పవన్ కళ్యాణ్.2019లో బీఎస్పీ, వామపక్షాలతో కలిసి పోటీ చేసి తాను రెండు చోట్ల ఓడిపోయి పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకోగలిగాడు. దెబ్బకి 2024లో ఏపీలో బిజెపి, టీడీపీతో కలిసి జనసేన కూటమి కట్టింది. మూడు పార్టీలు కలిస్తే గాని ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యపడలేదు.

ఆ తర్వాత పవన్ సనాతన ధర్మాన్ని నినాదంగా ఎంచుకున్నాడు.2014లో పోటీ చేసే ధైర్యంలేక బరిలో దిగలేదు.2019లో ఒక్క సీటుకే పరిమితమయ్యాడు. ఒక్కోసారి ఒక్కొక్కరితో పొత్తు. ఒక స్పష్టమైన విధానం అంటూ లేకుండా, సంస్థగతంగా పార్టీని బలోపేతం చేయకుండా పదేళ్లు గాలివాటంగా జనసేన నడిపాడు. చివరికి టీడీపీ చేయి వేస్తే గాని ఆ పార్టీకి ఊపిరి రాలేదు. కూటమి సర్కారు ఏర్పడ్డాక రాజ్యాంగంలో లేని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవిని సృష్టించుకుని దానితో తృప్తి పడిపోయాడు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో ఓపిక సహనం కావాలి. నిజాయితీ కావాలి. అరుపులు కేకలు కాదు. అందుకే టీవీ కే విజయ్ సక్సెస్ స్టోరీ పవన్ కళ్యాణ్ కి ఎప్పటికీ ఓ గుణపాఠం లాంటిది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏపీలో ఒంటరిగా పోటీ చేసి గెలిచేటంత సీన్ లేదు. ఎప్పటికీ ఆ పార్టీ బిజెపి కో, టిడిపి కో.... తోక పార్టీగా మునుగడ సాగించాల్సిందే. దీనికి ప్రధాన కారణం జనసేనకు సమస్తాగతంగా బలం లేకపోవడం.

పొత్తుల కోసం రకరకాల ప్రయోగాలు చేయడం. పార్టీ పుట్టిన పదేళ్లలో బీఎస్పీ, లెఫ్ట్, బిజెపి, టిడిపి లతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా తమకంటూ ఒక సైద్ధాంతిక విధానం లేదని... ఎప్పటికీ ఒక తోక పార్టీ అని పవన్ కళ్యాణ్ తన పార్టీపై తానే ముద్ర వేసేసుకొన్నారు. ఒంటరిగా పోటీ చేసి నిర్ణయాత్మక శక్తిగా మారి ఉంటే పవన్ రాజకీయ భవిష్యత్తు మరోలా ఉండేది. ఏదో ఒక రోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు. ప్రభుత్వాన్ని స్థాపించేవాడు. అదేమీ లేకుండా 2014, 2019, 2024లో ఏదో ఒక పార్టీ చంకనెక్కి రాజకీయ మనుగడ కోసం పరితపించాడు.పవన్ కళ్యాణ్. కానీ టీవీ కే విజయ్ తన తొలి రోజు నుంచి తన పార్టీ విషయంలో... తన రాజకీయం విషయంలో స్పష్టంగా ఉన్నాడు. ఎవరు ఎన్ని ఒత్తిళ్లు పెట్టిన.... పొత్తులు పెట్టుకోవడానికి ఒప్పుకోలేదు. కాలం చెల్లిన ద్రవిడ సిద్ధాంతాన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగ లేదు. అసలు మతం, కులం రెండిటికి అతీతంగా రాజకీయం చేశాడు. ఎన్నడూ కుల ప్రస్తావన కూడా తేలేదు. 50 ఏళ్లుగా డీఎంకే ,అన్నా డీఎంకేకు అవకాశం ఇస్తున్న ప్రజలు తనకి ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించాడు. సింగిల్ గా పోటీ చెయ్యా లనే హీరోక్ డిసిషన్ ప్రజలను ఆకట్టుకుంది. అలాగే విజయ్ ఎన్నికల హామీలు సైతం ప్రజలను దగ్గరకు చేశాయి.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గురించి ఇదే చర్చ జరుగుతుంది. టిడిపి వైసిపి లకు సమాన దూరంగా ఉండి, చావు రేవో ఒంటరిగా పోటీ చేసి నిలబడి ఉంటే ఏదో ఒక రోజు పవన్ కి అవకాశం వచ్చేది. కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవాడు. కానీ అంత ఓపిక, నాయకత్వ లక్షణం రెండు పవన్ కళ్యాణ్ కి లేవు. ఏదో ఒక రకంగా అధికారంలో దూరిపోవాలి అనే తపన అతనికి సీఎం కుర్చీని దూరం చేసేసింది. దీనికి తోడు లేదు లేదంటూనే నిత్యం కులం, మతం గురించి మాట్లాడటం, అవాస్తవాలను ప్రచారం చేయడం, గంటకు ఓ రకంగా, పూటకో విధానంతో మాట్లాడటం వల్ల అతను స్పష్టత లేని నాయకుడు అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చేసింది. పవన్ కళ్యాణ్ కి జనం పూర్తిస్థాయి అధికారం ఇవ్వకపోవడానికి ఇదే కారణం. విజయ్కు అధికారం కట్టబెట్టడానికి కూడా అతనిలో ఉన్న స్పష్టత, నిజాయితీ ప్రధాన కారణం. పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేసి ఉంటే ఒకటి కాదు రెండుసార్లు ఓడిపోయిన ప్రజల అతన్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి ఉండేవారు. అది ఎప్పటికీ జరగదు.

Published : 
  • 5 May 2026, 4:58 PM IST