Top story: అవును క్యాటరింగ్ ట్రక్ లో దాక్కున్నా.. ఇరాన్ అటాక్ పై ట్రంప్ రియాక్షన్..!

ఒక దేశ అధ్యక్షుడికి ప్రాణహాని తలపెట్టే ముప్పు వస్తే.. అదీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా ప్రెసిడెంట్‌ను టార్గెట్ చేస్తూ శత్రుదేశం స్కెచ్ వేస్తే.. సెక్యూరిటీ విభాగాలు ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తాయి?

Post Published By: dialnews
Updated : 13 August 2026, 7:15 PM IST

ఒక దేశ అధ్యక్షుడికి ప్రాణహాని తలపెట్టే ముప్పు వస్తే.. అదీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా ప్రెసిడెంట్‌ను టార్గెట్ చేస్తూ శత్రుదేశం స్కెచ్ వేస్తే.. సెక్యూరిటీ విభాగాలు ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తాయి? తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలతో బయటపడటానికి ఒక హాలీవుడ్ సినిమా రేంజ్ లో సాగిన సీక్రెట్ ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. టర్కీ పర్యటనకు వచ్సిన ట్రంప్‌ను హతమార్చడానికి ఇరాన్ ఒక భయంకరమైన ప్లాన్ వేసిందని, ఆ దాడి నుండి ట్రంప్‌ను రక్షించడానికి అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు ఆయనను ఒక సాధారణ విమాన క్యాటరింగ్ ట్రక్‌లో దాచి ఎయిర్‌పోర్ట్ దాటించారనే షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు టర్కీ ఎయిర్‌పోర్ట్‌లో ఆ రోజు ఏం జరిగింది? డెకాయ్ ఆపరేషన్ పేరుతో మీడియాను ఎలా తప్పుదోవ పట్టించారు? ఈ హై-వోల్టేజ్

అసలు విషయానికి వస్తే.. గడిచిన జూలై 8వ తేదీన డొనాల్డ్ ట్రంప్ టర్కీ రాజధాని అంకారాలో పర్యటించారు. పర్యటన ముగించుకుని ఆయన తిరిగి అమెరికా ప్రయాణమయ్యే క్రమంలో అంకారా ఎయిర్‌పోర్ట్‌లో టీవీ కెమెరాలు చూస్తుండగానే ట్రంప్ తన అధికారిక విమానమైన 'ఎయిర్ ఫోర్స్ వన్' ఎక్కారు. అయితే ఆయన విమానం ఎక్కిన కొద్ది నిమిషాలకే అమెరికా ఇంటెలిజెన్స్ విభాగాలకు ఒక అత్యంత ప్రమాదకరమైన సమాచారం అందింది. ట్రంప్ ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్నే టార్గెట్ చేస్తూ ఇరాన్ దాడికి ప్లాన్ చేసిందని, ఆ థ్రెట్ వంద శాతం నిజమైనదని సీక్రెట్ సర్వీస్ గుర్తించింది.

దాంతో అధికారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్‌స్టంట్‌గా ఒక 'డిసెప్షన్ ఆపరేషన్' అంటే శత్రువులను తప్పుదోవ పట్టించే ప్లాన్ అమలు చేశారు. విమానంలోకి వెళ్లిన ట్రంప్‌ను.. ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై విమానాలకు భోజనాలు, సరుకులు సప్లై చేసే ఒక సాధారణ 'క్యాటరింగ్ ట్రక్' లోకి సీక్రెట్‌గా మార్చారు. ఆ ట్రక్‌లో ఎవరికీ అనుమానం రాకుండా ఎయిర్‌పోర్ట్ అవతలి వైపునకు తీసుకెళ్లి, అక్కడ సిద్ధంగా ఉంచిన ఒక చిన్న మిలిటరీ విమానం 'ఎయిర్ ఫోర్స్ C-32A' లోకి ట్రంప్‌ను ఎక్కించి చాలా రహస్యంగా టర్కీ నుండి అమెరికాకు తరలించారు.

ఈ ఆపరేషన్‌లో మరో నమ్మలేని ట్విస్ట్ ఏంటంటే.. అసలైన ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రెసిడెంట్ ట్రంప్ లేరనే విషయం అందులో ప్రయాణిస్తున్న వైట్ హౌస్ స్టాఫ్‌కు, ప్రెస్ మీడియాకు అస్సలు తెలియదు. విమానంలోని మరో సెక్షన్‌లో ఉన్న దాదాపు డజను మంది జర్నలిస్టులు.. ట్రంప్ తమతోనే ఉన్నారని భావిస్తూ ఆ డెకాయ్ విమానంలోనే టర్కీ నుండి బయలుదేరారు. శత్రువులు ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్నే ట్రాక్ చేస్తారు కాబట్టి, ట్రంప్ ప్రాణాలకు ఎలాంటి రిస్క్ ఉండకూడదనే ఉద్దేశంతో మీడియాను, వైట్ హౌస్ సిబ్బందిని ఒక డెకాయ్‌లా ఉపయోగించి.. ఆ విమానాన్ని మామూలుగానే నడిపించారు.

ఈ షాకింగ్ ఆపరేషన్ వివరాలను ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'ది వాషింగ్టన్ పోస్ట్' రీసెంట్‌గా బయటపెట్టడంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ముక్కున వేలేసుకుంది. ఈ వార్తలపై అమెరికాకు తిరిగి వచ్చిన తర్వాత జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద రిపోర్టర్లు డొనాల్డ్ ట్రంప్‌ను నేరుగా ప్రశ్నించారు. దానికి ట్రంప్ తనదైన స్టైల్లో స్పందిస్తూ.. "అవును, అది నిజమే.. నేను ఎప్పుడూ సీక్రెట్ సర్వీస్ మరియు మిలిటరీ అధికారులు ఏం చెబితే అది ఫాలో అవుతాను. నన్ను వేరే విమానంలో వెళ్లాలని వారు కోరారు, అంతే భద్రత ఉన్న చిన్న విమానంలో నన్ను పంపించారు, నేను వెళ్లాను" అని కన్ఫర్మ్ చేశారు.

అంతేకాకుండా.. ఇరాన్ ముప్పు గురించి అడగగా.. "నాకు ఇలాంటి బెదిరింపులు చాలా వస్తుంటాయి, నేను వాటి గురించి ఎక్కువగా అడగను, పట్టించుకోను కూడా. నేను ప్రపంచంలోనే అత్యంత అత్యంత ప్రభావవంతమైన ప్రెసిడెంట్‌ను కాబట్టే నాకీ బెదిరింపులు.. ఏ ప్రభావం లేని దేశాధ్యక్షులను ఎవరూ పట్టించుకోరు" అంటూ ఇరాన్‌పై ప్రెసిడెంట్ ట్రంప్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ పై తమకు పూర్తి కంట్రోల్ ఉందని, ఇరాన్ ఏమాత్రం తోక జాడించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. అమెరికా ప్రెసిడెంట్ ఒక క్యాటరింగ్ ట్రక్‌లో దాక్కుని శత్రుదేశం దాడి నుండి తప్పించుకోవాల్సి రావడం అనేది అంతర్జాతీయ స్థాయిలో అమెరికా సెక్యూరిటీ పటిష్టతను మరియు ఇరాన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ ఏ రేంజ్ లో ఉందో చూపిస్తోంది.

Published : 
  • 13 August 2026, 7:15 PM IST