4 ఓవర్లలో 58 పరుగులు, బుమ్రా కెరీర్ లోనే చెత్త రికార్డు…!

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కెరీర్‌లోనే చెత్త బౌలింగ్ రికార్డును నమోదు చేశాడు. టీ20 వరల్డ్‌కప్ ముందు జరిగిన కీలక టోర్నీలో బుమ్రా తేలిపోయాడు

Post Published By: dialnews
Updated : 2 February 2026, 11:50 AM IST

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కెరీర్‌లోనే చెత్త బౌలింగ్ రికార్డును నమోదు చేశాడు. టీ20 వరల్డ్‌కప్ ముందు జరిగిన కీలక టోర్నీలో బుమ్రా తేలిపోయాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కించుకున్న బుమ్రా.. ఈ టోర్నీలో ఎలా రాణిస్తాడు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. త్రివేండ్రం వేదికగా జరిగిన ఆఖరి టీ20లో బుమ్రా బౌలింగ్ ప్రదర్శన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపే ప్రదర్శన చేస్తుంటే.. బౌలర్లు మాత్రం దారుణంగా విఫలమవుతున్నారు.

ఈ సిరీస్‌లో భారత్ గెలిచిన మ్యాచ్‌లన్నీ బ్యాటర్ల పుణ్యమే. భారత పేస్ బౌలర్లు బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ , హర్షిత్ రాణా ఈ ముగ్గురూ ఈ సిరీస్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. త్రివేండ్రం టీ20లో అర్ష్‌దీప్ 5 వికెట్లు తీసినా 50కి పైగా పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది.జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లలో ఏకంగా 58 పరుగులు ఇచ్చాడు. కనీసం ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. బుమ్రా వేసిన ఒక ఓవర్‌లో డారిల్ మిచెల్ వరుస బౌండరీలతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

ఇన్నింగ్స్ 14వ ఓవర్ మొదటి బంతిని ఫోర్‌గా మలిచిన మిచెల్, వరుసగా రెండు బంతుల్ని సిక్సర్లుగా బాదాడు. ఆ తర్వాత సింగిల్ రాగా బెవాన్ జాకబ్స్ వెంటనే బౌండరీ బాదాడు. ఆ ఓవర్‌లో 22 పరుగులు వచ్చాయి. బుమ్రా కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన ఓవర్‌గా నిలవడమే కాకుండా, 4 ఓవర్లలో 58 పరుగులు ఇచ్చి అత్యంత చెత్త బౌలింగ్‌గా నిలిచింది.ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు ఓవర్లలో 51 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో 58, వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 36 పరుగులు 1 వికెట్, అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 33 పరుగులు 3 వికెట్లు పడగొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 271 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ జట్టు 19.4 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌట్ అయింది.

Published : 
  • 2 February 2026, 11:50 AM IST