రోహిత్ , కోహ్లీకి బిగ్ షాక్… కాంట్రాక్ట్ లిస్ట్ లో డిమోషన్…!

ఊహించిందే జరిగింది.. భారత దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి బీసీసీఐ షాకిచ్చింది. సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ 2025-26 జాబితాలో రోకో జోడీకి డిమోషన్ ఇచ్చింది.

Post Published By: dialnews
Updated : 11 February 2026, 2:30 PM IST

ఊహించిందే జరిగింది.. భారత దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి బీసీసీఐ షాకిచ్చింది. సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ 2025-26 జాబితాలో రోకో జోడీకి డిమోషన్ ఇచ్చింది. తాజాగా ప్రకటించిన జాబితాలో రోహిత్ , కోహ్లీలను గ్రేడ్ బికి పరిమితం చేసింది. అదే సమయంలో సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి  గ్రేడ్ ఏ ప్లస్ ను తొలగించింది. నిజానికి గత కొన్ని రోజులుగా దీనిపై వార్తలు వస్తున్నాయి. అన్ని ఫార్మాట్లు ఆడే ప్లేయర్స్ కు మాత్రమే గ్రేడ్ ఏ ప్లస్ వర్తిస్తుంది. గత ఏడాది వరకూ కోహ్లీ, రోహిత్ , జడేజా, బుమ్రా గ్రేడ్ ఏ ప్లస్ లోనే ఉండేవారు. ఈ కేటగిరీలో ప్లేయర్స్ కు ఏడాదికి రూ.7 కోట్ల రూపాయల పారితోషకం అందేది.

గ్రేడ్ ఏలో ఆటగాళ్లకు రూ.5 కోట్లు, గ్రేడ్ బిలో ఆటగాళ్లకు రూ.3 కోట్లు , గ్రేడ్ సిలో ప్లేయర్స్ కు రూ.1 కోటి రూపాయలు లభించేది. అయితే ఇప్పుడు మూడు ఫార్మాట్లు ఆడే ప్లేయర్స్ ఎవ్వరూ లేరు. ఎందుకంటే కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా ముగ్గురూ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. వీరిలో రోకో జోడీ టెస్టులు కూడా ఆడడం లేదు. జడేజా మాత్రమే వన్డే, టెస్ట్ ఫార్మాట్ లు ఆడుతున్నాడు. దీంతో కోహ్లీ, రోహిత్ లను బీసీసీఐ గ్రేడ్ బికి డిమోట్ చేసింది. ఒకవేళ టెస్టులు కూడా ఆడి ఉంటే గ్రేడ్ ఏలో ఉంచేదేమో. వచ్చే వన్డే ప్రపంచకప్ ఆడాలని టార్గెట్ గా పెట్టుకున్న రోకో జోడీకి అప్పటికి చోటు దక్కుతుందో లేదోనన్న దానిపైనా క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే తాజా జాబితాలో గ్రేడ్ ఏలో కేవలం ముగ్గురికి మాత్రమే చోటు దక్కింది. గిల్ , బుమ్రా, జడేజా మాత్రమే గ్రేడ్ ఏలో చోటు దక్కించుకున్నారు.

గ్రేడ్ బిలో రోకో జోడీతో పాటు కేఎల్ రాహుల్ , సిరాజ్ ,వాషింగ్టన్ సుందర్, పాండ్యా, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, జైస్వాల్ , సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ లకు చోటు దక్కింది. అటు గ్రేడ్ సిలో తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డితో పాటు సంజూ శాంసన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, రింకూ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు చోటు లభించింది. అయితే మహ్మద్ షమీ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో చోటు కోల్పోయాడు. ఇదిలా ఉంటే గతంలో గ్రేడ్ ఏ ప్లస్ కు బీసీసీఐ రూ. 7 కోట్లు చెల్లించేది, గ్రేడ్ ఏకు 5 కోట్లు, గ్రేడ్ బికు రూ.3 కోట్లు, గ్రేడ్ సికు రూ.1 కోటి రూపాయలు పారితోషకంగా  లభిస్తుంది.

Published : 
  • 11 February 2026, 2:30 PM IST