రోహిత్ ఆడడం కొందరికి ఇష్టం లేదు.. మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో విఫలమయ్యాడు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 23, 2026 | 02:45 PMLast Updated on: Jan 23, 2026 | 6:22 PM

Some People Dont Want Rohit To Play Former Player Makes Sensational Comments

టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో విఫలమయ్యాడు. కెప్టెన్సీ నుంచి తొలగించాక ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాపై జరిగిన సిరీస్ లో దుమ్ములేపిన హిట్ మ్యాన్.. కివీస్ తో జరిగిన సిరీస్ లో రాణించలేకపోయాడు. మూడు మ్యాచ్ ల్లో 61 పరుగులు చేసి నిరాశపరిచాడు. రోహిత్ విఫలం కావడంతో అతన్ని జట్టు నుంచి తప్పించడానికి జట్టు టీమిండియా ఎదురు చూస్తూ ఉంటుందని భారత జట్టు మాజీ క్రికెటర్ మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ 2027 వన్డే వరల్డ్ కప్ కు రోహిత్ ను ఆడకుండా చేయాలనీ జట్టు యాజమాన్యం ప్రయత్నిస్తుందని తివారి చెప్పాడు.

రోహిత్ ఆస్ట్రేలియాలో సెంచరీ సాధించిన తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్ లో విఫలమై ఉంటే సెలెక్టర్లు అతన్ని తొలగించాల్సి వచ్చేదన్నాడు. మేనేజ్‌మెంట్ రోహిత్ ను వన్డే వరల్డ్ కప్ కు వెళ్లకూడదని కోరుకుంటుందనీ వ్యాఖ్యానించాడు. అయితే రోహిత్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాపై అద్భుతంగా ఆడి తనలో ఇంకా క్రికెట్ ఉందని నిరూపించాడు. మూడు మ్యాచ్ ల సిరీస్ లో రాణించలేనంత మాత్రనా రానున్న సిరీస్ లో ఆడలేడు అనుకోకూడదని, అతనికి మనం గౌరవం ఇవ్వాలంటూ తివారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తివారీ చేసిన కామెంట్స్ భారత క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారాయి.

ఇదిలా ఉంటే చివరిసారిగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్ నుంచి దూరమైన హిట్ మ్యాన్ వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. మూడు ఫార్మాట్ లకు ముగ్గురు కెప్టెన్ లను కొనసాగడం బీసీసీఐ ఆలోచనల్లో లేనట్టు స్పష్టమవుతుంది. ఫిట్ నెస్ పై సైతం ఫోకస్ పెంచాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో సైతం రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు. 37 ఏళ్ల హిట్ మ్యాన్ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడడం దాదాపుగా ఖాయమైంది.