వరల్డ్ కప్ సెమీఫైనల్ ఫీవర్ మొదలైపోయింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా మరియు ఇంగ్లాండ్ తలపడబోతున్నాయి. అందరి కళ్లు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా మీద ఉన్నప్పటికీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మాత్రం అభిషేక్ శర్మ! ఈ మెగా మ్యాచ్‌లో అభిషేక్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుంది? అతను మళ్ళీ పాత ఫామ్‌ని అందుకుంటాడా? అని టీమిండియా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నిజం చెప్పాలంటే, ఈ వరల్డ్ కప్‌లో అభిషేక్ ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. టోర్నీ మొదట్లో వరుసగా మూడు సార్లు డకౌట్ అవ్వడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. అయితే, జింబాబ్వేపై చేసిన 55 పరుగులు అతను టాలెంట్ ఏంటో మరోసారి నిరూపించాయి. కానీ వెస్ట్ ఇండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కేవలం 10 పరుగులకే అవుట్ అవ్వడం, రెండు క్యాచ్‌లు డ్రాప్ చేయడం విమర్శలకు దారితీసింది.
మనోజ్ తివారీ వంటి మాజీలు 'అభిషేక్ తన వికెట్‌కు విలువ ఇవ్వాలి' అని సూచిస్తున్నారు. ఇర్ఫాన్ పఠాన్ అయితే అతని బ్యాటింగ్ టెక్నిక్‌లో చిన్న లోపం ఉందని, ఫ్రంట్ ఫుట్ మీద ఎక్కువ వెయిట్ పెట్టాలని సలహా ఇచ్చారు. అయితే, అభిషేక్ శర్మను తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే మ్యాచ్ జరుగుతోంది ముంబైలోని వాంఖడే స్టేడియంలో. మీకు గుర్తుందా? ఇదే ఇంగ్లాండ్‌పై దాదాపు ఏడాది క్రితం అభిషేక్ శర్మ కేవలం 54 బంతుల్లో 135 పరుగులతో చెడుగుడాడాడు. వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. చిన్న బౌండరీలు, ఫ్లాట్ పిచ్ అభిషేక్ లాంటి హిట్టర్‌కు బాగా కలిసి వస్తాయి. బంతి బ్యాట్ మీదకు నేరుగా వస్తుంది కాబట్టి, పవర్ ప్లేలో అతను ఇంగ్లాండ్ బౌలర్లను చిత్తు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ బౌలింగ్ ఎటాక్‌లో జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ వంటి క్వాలిటీ బౌలర్లు ఉన్నారు. ఆర్చర్ పేస్‌ను అభిషేక్ ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరం. అయితే, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కాబట్టి ఆదిల్ రషీద్‌ను టార్గెట్ చేసే అవకాశం ఉంది. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా అభిషేక్‌కు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.
'అభిషేక్‌కు ఒక్క ఇన్నింగ్స్ చాలు, అతను మళ్ళీ తన మునుపటి రిథమ్‌ను అందుకోవడానికి' అని మోర్కెల్ నమ్మకంగా చెప్పారు. ఓపెనింగ్‌లో సంజూ శాంసన్‌తో కలిసి అభిషేక్ ఒక 40-50 పరుగుల స్టాండ్ ఇస్తే, టీమ్ ఇండియాకు తిరుగుండదు. గత రికార్డులు మరియు ముంబై పిచ్ కండిషన్స్ చూస్తుంటే, అభిషేక్ శర్మ ఈ సెమీఫైనల్‌లో ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తాడు. అతను సుమారు 180+ స్ట్రైక్ రేట్‌తో ఒక 30 నుండి 40 మెరుపు పరుగులు చేసే అవకాశం ఉంది. ఒకవేళ మొదటి 3 ఓవర్లు నిలబడితే, అది హాఫ్ సెంచరీగా కూడా మారొచ్చు. ఇంగ్లాండ్ బౌలర్లకు అభిషేక్ అతిపెద్ద తలనొప్పిగా మారబోతున్నాడని టీమిండియా అభిమానుల నమ్మకం.
!