విహాన్, వైభవ్ విధ్వంసం, యువ భారత్ జైత్రయాత్ర…!

అండర్ 19 ప్రపంచకప్ భారత్ యువ జట్టు దుమ్మురేపుతోంది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ అంచనాలకు తగ్గట్టే రాణిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 28, 2026 | 05:50 PMLast Updated on: Jan 28, 2026 | 6:21 PM

Vihan And Vaibhavs Destructive Performance A Triumphant March For Young India

అండర్ 19 ప్రపంచకప్ భారత్ యువ జట్టు దుమ్మురేపుతోంది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ అంచనాలకు తగ్గట్టే రాణిస్తోంది. వరుస విజయాలతో సెమీఫైనల్ కు చేరువైంది. తాజాగా జింబాబ్వేను 204 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో విహాన్ మల్హోత్ర సెంచరీతో కదం తొక్కితే.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరిసాడు. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసాడు. 30 బంతుల్లో 52 పరుగులతో అదరగొట్టాడు. ఆరంభంలో ఓపెనర్ ఆరోన్ జార్జ్ , కెప్టెన్ ఆయుశ్ మాత్రే ఫెయిలయ్యారు. ఈ దశలో విహాన్ మల్హోత్రా జట్టును ఆదుకున్నాడు. జింబాబ్వే బౌలర్లపై ఆధిపత్యం కనబరుస్తూ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

ఈ క్రమంలో 107 బంతుల్లో 7 ఫోర్లతో 109 పరుగులు చేశాడు. చివర్లో అభిజ్ఞాన్ కుండు కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. 62 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 61 పరుగులు చేసాడు. దీంతో భారత్ అండర్ 19 జట్టు 50 ఓవర్లలో 8 ఓవర్లలో 352 పరుగులు చేసింది.ఛేజింగ్ లో జింబాబ్వే ఏ మాత్రం పోటీనివ్వలేకపోయింది. ఆరంభం నుంచే వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాటర్లు కనీసం క్రీజులో నిలవలేకపోయారు. దీంతో జింబాబ్వే 37.4 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది.

ఆ జట్టు బ్యాటర్లలో లిరోయ్ 77 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 62 పరుగులు మాత్రమే రాణించగా.. మిగిలిన వారంతా చేతులెత్తేశారు.దీంతో భారత్ స్కోరులో కనీసం సగం కూడా చేయలేకపోయింది. భారత బౌలర్లలో ఉధవ్ మోహన్, ఆయుష్ మాత్రే మూడు వికెట్లు తీయగా.. హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ చెరో వికెట్ తీసారు. ప్రస్తుతం భారత్ కు ఈ టోర్నీలో ఇది హ్యాట్రిక్ విజయం. సూపర్ సిక్స్ స్టేజ్ లో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ అదరగొట్టింది. ఒక్క ఓటమి కూడా లేకుండా టోర్నీలోనే బెస్ట్ టీమ్ గా కొనసాగుతోంది. మరొక్క విజయం సాధిస్తే చాలు భారత్ యువ జట్టు సెమీఫైనల్లో అడుగుపెడుతుంది. ఇప్పటికే వరుస విజయాలతో సెమీస్ కు చేరువైన భారత్ ఆదివారం పాకిస్తాన్ అండర్ 19 జట్టుతో తలపడుతుంది.