Top story:విజయారెడ్డి సూ*సైడ్‌కు కారణం ఇదే.. తేల్చేసిన పోలీసులు.. సోదరుడి ఆవేదన…!

ఏం జరిగిందో తెలియదు.. పిల్లలతో కలిసి ఎందుకు సూసైడ్ చేసుకుందో అర్థం కావడం లేదు.. చర్లపల్లి తల్లీపిల్లల ఆత్మహత్య ఘటన.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది

Post Published By: dialnews
Updated : 9 February 2026, 8:38 AM IST

ఏం జరిగిందో తెలియదు.. పిల్లలతో కలిసి ఎందుకు సూసైడ్ చేసుకుందో అర్థం కావడం లేదు.. చర్లపల్లి తల్లీపిల్లల ఆత్మహత్య ఘటన.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఆర్థిక సమస్యలు లేవు.. కుటుంబంలో ఇబ్బందులు అసలే లేవు.. అయినా విజయారెడ్డి ఎందుకు చనిపోయింది.. పిల్లలు కూడా తనతో ఎందుకు చనిపోవాలి అనుకుంది.. అసలు ఏం చెప్పి పిల్లల్ని ఆత్మహత్యకు ఒప్పించింది.. ఇవే ప్రశ్నలు వారం రోజులుగా ప్రతీ ఒక్కరి మెదళ్లలో తిరుగుతున్నాయ్‌. ఈ కేసుకు సంబంధించి ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు.. చాలామందిని ప్రశ్నించారు. వాట్సాప్ చాటింగ్‌ను పరిశీలించడం నుంచి.. విజయారెడ్డి కుటుంబసభ్యులు, ఆఫీసులో పనిచేసే వాళ్ల నుంచి వివరాలు రాబటట్డం వరకు.. చాలాలోతుగా విచారణ జరిపారు. ఐతే విజయా రెడ్డి ఫ్యామిలీ సూసైడ్ కేసులో పోలీసులు ఎట్టకేలకు పురోగతి సాధించారు. ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకోవటానికి గల కారణాలు బయటపెట్టారు.

డిప్రెషన్ కారణంగానే.. విజయాసెడ్డి ఈ కఠిన నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇంటర్ చదువుతున్న పిల్లలు చేతనా రెడ్డి, విశాల్ రెడ్డిని.. ఆమె పూర్తిగా తన కంట్రోల్‌లో పెట్టుంకుందని అన్నారు. దీంతో తల్లి చెప్పినట్లే వారు నడుచుకునేవారని.. తాను చనిపోతే పిల్లలు ఒంటరవుతారనే కారణంతోనే.. వారిని కూడా ఆత్మహత్యలు చేసుకునేలా ఒప్పించిందని బయటపెట్టారు. డిప్రెషన్‌కు గల కారణాలపై లోతుగా ఆరా తీస్తున్నట్లు ప్రకటించారు పోలీసులు. త్వరలోనే అన్ని విషయాలు బయటపెడతామని చెప్పారు. విజయారెడ్డి సూసైడ్‌ తెలుగు రాష్ట్రాలను కదిలింది. ఆమె భర్త సురేందర్ రెడ్డి ఉద్యోగరీత్యా దుబాయ్‌లో ఉంటుండగా.. పిల్లలు చేతనా రెడ్డి, విశాల్ రెడ్డి ఇంటర్ చదువుతున్నారు. భర్త దూరంగా ఉండటం, విజయా రెడ్డి కూడా ఓ ప్రముఖ ఐటీ సంస్థల ఉద్యోగి కావటంతో పిల్లల్ని హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నారు.

విజయా రెడ్డి మాత్రం తల్లితో కలిసి ఉంటున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. జనవరి 30న ఇద్దరు పిల్లల్ని హాస్టల్ నుంచి తన కారులో చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆ తర్వాత కారును పార్క్ చేసి పార్కింగ్ స్లిప్‌పై ఇక బ్రతకాలని లేదు అని సూసైడ్ నోట్ రాసి రైల్వే ట్రాక్‌పైకి చేరుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే గూడ్స్ ట్రైన్ కింద పడి ముగ్గురూ సూసైడ్ చేసుకున్నారు. వాళ్లు రైల్వే ట్రాక్‌పైకి చేరుకుంటున్న దృష్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయ్‌. ఈ కేసులో పోలీసులు గత 9 రోజుల పాటు లోతుగా విచారణ జరిపారు. ఆమె ఉద్యోగం చేస్తున్న కొలిగ్స్, భర్త, ఆమె తల్లి, సోదరుడి వాంగ్మూలాలు తీసుకున్నారు.

ల్యాప్‌టాప్, వాట్సాప్ చాట్, కాల్ హిస్టరీ పూర్తిగా చెక్ చేశారు. ఆమె డిప్రెషన్‌తోనే సూసైడ్ చేసుకున్నట్లు నిర్దారించారు. ఇక సూసైడ్‌ ఘటనపై కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని విజయారెడ్డి సోదరుడు చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఛానళ్లపై ఫిర్యాదు చేయడానికి మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ వచ్చారు.విజయారెడ్డి ఆఫీస్‌ వర్క్‌పై ఎప్పుడూ బిజీగా ఉండేదని.. టీమ్‌ లీడర్‌ కావడంతో 14 మందితో వర్క్‌ చేయిస్తూ డిప్రెషన్‌లో ఉండేదని.. ఆమె సోదరుడు చెప్పాడు. వారి మరణంపై ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాలు లేవని.. తమపై అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్‌ ఛానెల్స్‌పై ఫిర్యాదు చేయడానికి వస్తే కోర్టుకు వెళ్లాలని పోలీసులు సలహా ఇచ్చారని అంటున్నాడు.

Published : 
  • 9 February 2026, 8:38 AM IST