Top story: అట్లుంటది ….మనతోనీ పవన్ మార్క్ రాజకీయం…. సన్నిహితులు, కుటుంబ సభ్యులకె పదవులు..!

జనసేన పార్టీ పెట్టిన కొత్తలో పవర్ స్టార్, ప్రెజెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టేజీల మీద మైకులు పగిలిపోయేలా ఒక డైలాగ్ చెప్పారు. "నా రాజకీయం వారసత్వానికి వ్యతిరేకం.. నా కుటుంబం నుంచి ఎవ్వరూ రాజకీయాల్లోకి రారు, పదవులు తీసుకోరు" అని చేసిన సింహగర్జన ఇంకా చెవుల్లో మారుమోగుతూనే ఉంది

Post Published By: dialnews
Updated : 10 September 2026, 9:52 AM IST

జనసేన పార్టీ పెట్టిన కొత్తలో పవర్ స్టార్, ప్రెజెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టేజీల మీద మైకులు పగిలిపోయేలా ఒక డైలాగ్ చెప్పారు. "నా రాజకీయం వారసత్వానికి వ్యతిరేకం.. నా కుటుంబం నుంచి ఎవ్వరూ రాజకీయాల్లోకి రారు, పదవులు తీసుకోరు" అని చేసిన సింహగర్జన ఇంకా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. సీన్ కట్ చేస్తే..పవన్ మాటలకి.. చేసే పనులకి అస్సలు సంబంధం ఉండకూడదు బ్రదర్" అనే రేంజ్‌లో నడుస్తోంది వ్యవహారం. వారసత్వం వద్దు అన్నారు కానీ, ఇప్పుడు మెగా ఫ్యామిలీకి పదవుల జాతర కనిపిస్తోంది. ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా కుటుంబ సభ్యులందరికీ నామినేటెడ్ పోస్టుల లైన్ క్లియర్ అయిపోతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ అయిన మెగా బ్రదర్ నాగబాబుకి ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీ ఫారెస్టేషన్" ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ అనే ఓ క్రియేటెడ్ క్యాబినెట్ ర్యాంక్ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ ‘ఏపీ గ్రీన్’ సంస్థ వచ్చేది పర్యావరణ, అటవీ శాఖల కిందకే. మరి ఆ శాఖలకి మంత్రి ఎవరు..? సాక్షాత్తూ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారే. అంటే తమ్ముడి శాఖలోనే అన్నయ్యకి క్యాబినెట్ హోదాతో కూడిన పెద్ద కుర్చీ అన్నమాట. అబ్బా.. ఎంతటి అన్నదమ్ముల అనుబంధం. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేకపోవడంతో నాగబాబుకి ఏదో ఒక పదవి అర్జెంటుగా ఇవ్వాల్సి వచ్చింది. దీంతో క్యాబినెట్ హోదాతో మొక్కలు నాటే కార్యక్రమం కట్టపెట్టేసారు.

పవన్ కళ్యాణ్ గ వదిన.. మెగాస్టార్ చిరంజీవి ధర్మపత్ని సురేఖ కి తెలంగాణాలోని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డులో మెంబర్‌గా పదవి దక్కింది. ఒకపక్క పవన్ కళ్యాణ్ గారు తెలంగాణాలో జనసేనను బలోపేతం చేస్తాం, రాజకీయాలు మార్చేస్తాం అంటూ స్పీచ్‌లు ఇస్తూనే మరోపక్క వదిన సురేఖకి దైవసన్నిధిలో కీలక బోర్డు మెంబర్ చేసేశారు. ఆంధ్రాలో తమ్ముడు డీసీఎం, అన్నయ్య క్యాబినెట్ ర్యాంకుతో నామినేటెడ్ పోస్ట్ తెలంగాణాలో వదిన గారు ఆధ్యాత్మిక పదవుల్లో మెరుస్తున్నారు. కుటుంబంలో ఒకరికి పదవి వస్తేనే విమర్శలు వస్తాయి.. అలాంటిది స్టేట్లు దాటి మరీ పదవులు అందుకోవడం అంటే అది నిజంగా మెగా ప్లానింగ్ అనుకోవాలేమో. ఇది మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహిత మిత్రుడు ఆనంద సాయికిటిటిడి బోర్డు మెంబర్ పదవి దక్కింది. పవన్ కళ్యాణ్ కి పీఏగా చేసిన హరి ప్రసాద్ కి ఎమ్మెల్సీ కట్టబెట్టారు. ఇక పి ఆర్ ఓ గా పనిచేసిన చక్రవర్తికి నాలుగున్నర లక్షల వేతనంతో ఇన్ఫర్మేషన్ కమిషనర్ పదవి దక్కింది.

నిన్నటికీ నిన్న, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మరో సంచలన ఉత్తర్వు జారీ చేసింది. బెజవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా చిరంజీవి కుమార్తె, సుస్మిత కొణిదెలను నియమించారు. నిన్నటివరకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా, సినీ నిర్మాతగా ఉన్న మెగా డాటర్.. ఇప్పుడు దుర్గగుడి పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితురాలిగా అడుగుపెట్టబోతున్నారు. దేవుడి సేవ చేయడానికి భక్తులందరూ క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడితే.. మెగా ఫ్యామిలీకి మాత్రం డైరెక్ట్‌గా జీవోల రూపంలో స్పెషల్ ఎంట్రీలు, బోర్డు పదవులు వచ్చేస్తున్నాయి.పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు.. "నేను మిగతా పార్టీల లాగా వారసత్వ రాజకీయాలు చేయను.. నా కుటుంబానికి పదవులు ఇప్పించను.. నాది కొత్త తరం రాజకీయం" అని ఎంత బిల్డప్ ఇచ్చారు..? కానీ ఇవాళ సీన్ చూస్తే.. తమ్ముడు డిప్యూటీ సీఎం.. అన్నయ్య క్యాబినెట్ ర్యాంక్ చైర్మన్.. వదిన యాదగిరిగుట్ట బోర్డు మెంబర్.. అన్న కూతురు ఆంధ్రాలో దుర్గగుడి ప్రత్యేక ఆహ్వానితురాలు.. , ఫ్రెండ్ టిటిడి బోర్డు మెంబర్, పిఏ ఎమ్మెల్సీ, పి ఆర్ ఓ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా పదవులు అనుభవిస్తున్నారు. వారసత్వం వద్దు అన్న నోటితోనే.. సన్నిహితులు కుటుంబ సభ్యులందరికీ వరుసగా నామినేటెడ్ పదవులు ఇప్పించుకుంటూ పోవడం చూస్తుంటే.. జనసైనికులకు కూడా మైండ్ బ్లాక్ అయిపోతోంది . పార్టీ కోసం జెండాలు మోసి, లాఠీ దెబ్బలు తిన్న కార్యకర్తలకు ఏమో ‘చిప్ప’.. మెగా ఫ్యామిలీకి ఏమో ‘క్యాబినెట్ ర్యాంక్’ పదవులా అని సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. రాజకీయాల్లో సిద్ధాంతాలు మాట్లాడటం ఈజీనే కానీ.. అధికారంలోకి వచ్చాక సొంత కుటుంబానికి దూరంగా ఉండటం చాలా కష్టం అని పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు.

Published : 
  • 10 September 2026, 9:52 AM IST