1000 కోట్ల OTT రైట్స్.. నిజమైలే భూమ్ బద్దల్…!

వారణాసి మూవీ ఒక్క నెలలోనే 450 కోట్ల నుంచి 1000 కోట్ల నెంబర్స్ మధ్య గిర్రున తిరిగింది.. ఎక్కడికో వెళుతుందన్నోల్లే ఏమౌపోతుందో అని కంగారు పడే పరిస్థితి కూడా కనిపించింది.

Post Published By: dialnews
Updated : 10 February 2026, 2:00 PM IST

వారణాసి మూవీ ఒక్క నెలలోనే 450 కోట్ల నుంచి 1000 కోట్ల నెంబర్స్ మధ్య గిర్రున తిరిగింది.. ఎక్కడికో వెళుతుందన్నోల్లే ఏమౌపోతుందో అని కంగారు పడే పరిస్థితి కూడా కనిపించింది. కట్ చేస్తే ఇప్పుడు 1000 కోట్ల హిస్టరీ ఆల్ మోస్ట్ కన్పామ్ అయ్యేలా ఉంది. అదే ఓటీటీ రైట్స్... ఇంతవరకు సినిమాకు 1000 కోట్ల వసూళ్ళు రావటమే పాన్ ఇండియా లెవల్లో ఒక పెద్ద హిస్టరి.. కాని ఇప్పుడా నెంబర్ ఒక సినిమా ఓటీటీ రైట్స్ కి వస్తే ఎలా ఉంటుంది.. ఎగ్జాక్ట్ గా రెండు నెలల ముందు ఇలానే అన్నారు. తీరా చూస్తే నెట ఫ్లిక్స్ సంస్థ నష్టాల్లో ఉండటం, ఓటీటీ బిజినెస్ కూడా గొప్పగా లేకపోవటంతో, వారణాసికి 900 కోట్ల కాదు, అందులో సగం రావటం కూడా కష్టమే అన్నారు. దీనికి తగ్గట్టే ఫిల్మ్ టీం హాలీవుడ్ రిపోర్టర్ల పేరుతో అనామకులకు ఇంటర్వూలు ఇచ్చిందన్న మ్యాటర్ కూడా ట్రోలింగ్ కి గురైంది. కాని పాన్ వరల్డ్ కలలు కంటున్న రాజమౌళి, వెనక్కి తగ్గుతాడా? లేనే లేదు.. 1000 కోట్ల హిస్టరీని ఓటీటీ రైట్స్ రూపంలో సాధించేసినట్టున్నాడు. ప్రభాస్, ఎన్టీఆర్ , బన్నీ ఇలా ఏ హీరోకి దక్కి ఒక రికార్డు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎకౌంట్ లో పడేలా చేశాడు..ఇంతకి ఇదెప్పుడు అఫీషియల్ గా బయటికొస్తుంది...? భూమి బద్దలయ్యేనెంబర్ ఇంకెందుకు సైలెంట్ గా ఉంచుతున్నారు?

ఒక ఇండియన్ సినిమాకు 1000 కోట్ల బడ్జెట్ అంటే అంతా షాక్ అయ్యారు. కాని ఇప్పుడు ఒక భారతీయ సినిమాకు నెట్ ఫ్లిక్స్ 1000 కోట్లు కేవలం ఓటీటీ రైట్స్ కే చెల్లించబోతోందంటే, ఏమౌతారు.. అదే జరిగేలా ఉంది. 1300 కోట్ల నుంచి అన్ లిమిటెడ్ వరకు వారణాసి బడ్జెట్ లెక్కలు మారొచ్చు.. అచ్చంగా అలానే ఓటీటీ రైట్స్ రేటు కూడా ఇలానే ఘాటెక్కింది.నిజంగా ఇదే అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తే మాత్రం, బాలీవుడ్ బాక్స్ బద్దలౌతుంది. బాలీవుడ్డే కాదు హాలీవుడ్ కూడా షేక్ అవ్వాల్సిందే.. ఇంతవరకు ఒక ఇండియన్ సినిమాకు ఓటీటీ రైట్స్ రూపంలో 1000 కోట్లంటే, ఇది నేషనల్ న్యూసేకాదు.. ఇంటర్ నేషనల్ న్యూసే... ఎందుకంటే 1000 కోట్ల వసూల్లే గొప్పంటే, మన మార్కెట్ కి, అలాంటిది 1000 కోట్లే కేవలం వారణాసి ఓటీటీ రైట్స్ కే దక్కడం అంటే, అదో సంచలనాత్మన వార్త.

ఐతే ఇది రెండు నెల్ల క్రితం 900 కోట్ల నెంబర్ గా ఉంది.. కాని చాలా మంది ఇదంతా రాజమౌలి ప్రచారం కోసం చేసి జిమ్మిక్కన్నారు. రీసెంట్ గా హాలీవుడ్ రిపోర్టర్లంటూ దిక్కూ మొక్కూ లేని ఇద్దరు రిపోర్టర్లకు అసంధర్బంగా ఇంటర్వూలు ఇవ్వటంతో, ఇదెక్కి అమాయకపు ప్రచారం అన్నారు. తర్వాత ఇదంతా చేసింది, నెట్ ఫ్లిక్స్ కే కాదు, వరల్డ్ వైడ్ గా వారణాసి మూవీని ఇంటర్నేషనల్ సినిమా అని ప్రచారం చేయటంలో భాగం అని అన్నారు.అలా ఈ సినిమాని వరల్డ్ మార్కెట్ లోకి తీసుకెళ్లటం మొదలు పెడితే, రిలీజ్ అయ్యేలోపు వచ్చేహైప్ తో, ఓటీటీరైట్సే కాదు, వరల్డ్ వైడ్ గా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తోనే 5 వేల కోట్లు కొల్లగొట్టాలనేది రాజమౌళి స్కెచ్ అన్నారు. కాకపోతే ఓటీటీ సంస్థలంన్నీ నష్టాల్లో ఉండటం, వాల్లుకూడా రిస్కులు తగ్గించటంతో, వారణాసికి 450 కోట్ల వరకు ఆఫర్ చేస్తోంది నెట్ ఫ్లిక్స్ సంస్త అన్నారు.

కాని అందులో నిజం లేనట్టుందని ఇప్పుడిప్పుడే తేలుతోంది. ఎందుకంటే 30 భాషల్లో 100 కోట్ల మందికి రీచ్ అయ్యేలా 120 దేశాల్లో 55 వేల థియేటర్స్ ని నింపే పనిచేస్తున్నాడు రాజమౌళి. అన్ని థియేటర్స్ లో మామూలు టాక్ తో ఆడినా 5 నుంచి 10 వేల కోట్లొస్తాయి.. సో అంత పొటెన్షియల్ ఉన్న మూవీకి 1000 కోట్ల ఓటీటీ రైట్స్ సెన్సిబులే... అదేమాట నిజం చేసేందుకు రాజమౌళి తన మార్కెటింగ్ టీం ని రంగంలోకి దింపాడు. తాను దిగాడు... అందుకే ఆళ్ మోస్ట్ నెట్ ఫ్లిక్స్ కన్విన్స్ అయ్యే 1000 కోట్ల నెంబర్ కి ఓకే అవుతోందని, ఉగాది లోగా ఏదో సాలిడ్ న్యూస్ రావొచ్చని తెలుస్తోంది. ఈలోపు ఈ నెంబర్ మాత్రం ఇండియన్ మీడియాని కుదిపేసేలా ఉంది.

Published : 
  • 10 February 2026, 2:00 PM IST