మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతంలో టెంపర్ మూవీలో ఒక మాటన్నాడు.. వార్ ఆన్ కొరియా... పూరీ మేకింగ్ లో తను చేసిన టెంపర్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. పెర్ఫార్మర్ గా ఎన్టీఆర్ ని నెక్ట్స్ లెవల్ కి తీసుకుపోయింది.. అయితే అందులో ఎన్టీఆర్ అన్న డైలాగ్ వార్ ఆన్ కొరియా, ఇప్పుడు నిజం కాబోతున్నట్టుంది. ఏదో సినిమాలో ఓ సీన్ కోసం ఆ మాట పూరీ రాసి ఉండొచ్చు.. కాని ఇప్పుడు ఆ మాటనే నిజం చేసేలా ఉన్నాడు ఎన్టీఆర్. ఔను కొరియా మీద వార్ ప్రకటించాడు.. డ్రాగన్ టార్గెట్ చైనా కాదు, జపాన్ అంతకంటే కాదు.. ఇండోనేషియానో, మలేషియానో ఎన్టీఆర్ టార్గెట్ కానేకాదని తెలుస్తోంది. చిన్న దేశం, మనతో పోలిస్తే ఒక రాష్ట్రజనాబా అంతాకాదు...అలాంటి దేశం, అంత చిన్న మార్కెట్ మీద డ్రాగన్ తో వార్ చేయాలానుకుంటున్నాడా? ఔను ఇదే నిజం అయ్యేలా ఉంది. కొరియా చిన్న దేశమే కావొచ్చు.. దక్షిన కొరియాని టార్గెట్ చేయటం వెనక మాత్రం చాలా పెద్ద స్కెచ్చే ఉంది... కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలనే డ్రాగన్ తో వార్ ఆన్ కొరియా ప్రకటించేసినట్టున్నాడు.. ఇంతకి అంత చిన్న దేశం, ఎలా ఏనుగు కుంభస్థలం అనిపించుకుంటోంది? వార్ ఆన్ కొరియా ఎందుకు సెన్సేషనల్ నిర్ణయం?
వార్ ఆన్ కొరియా.. ఇది టెంపర్ మూవీలో కాజల్ తో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్. ఎప్పడో టెంపర్ మూవీ వచ్చినప్పుడు తాను చెప్పిన ఈ డైలాగే ఇప్పుడు డ్రాగన్ మూవీ మార్కెటింగ్ స్ట్రాటజీగా మారుతుందని ఎవరైనా ఊహించారా? కాని అదే జరిగేలా ఉంది. ఇంతకాలం డ్రాగన్ మూవీ పాన్ ఆసియా సినిమానా? పాన్ వరల్డ్ మూవీనా అన్న డౌట్లు వినిపించాయి..ఇవేవి కాదు, కేవలం డ్రాగన్ మూవీ కొరియా మీద ఆటం బాంబు పేలిస్తే అదే పదివేలనేది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆశ.. ఇంతకి అక్కడే ఎందుకు తన సినిమా దుమ్ముదులపాలని కోరుకుంటున్నాడు..? తనకి జపాన్ లో రజినికాంత్, ప్రభాస్ రేంజ్ లో డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్ నుంచి వచ్చి తన సెట్లో తనతో ఫోటోలు దిగి వెళ్లేంత, ఫ్యాన్ ఫాలోయింగ్ జపాన్ లో ఎన్టీఆర్ సొంతం.
కాని జపాన్ మార్కెట్ ని ఎన్టీఆర్ టార్గెట్ చేయట్లేదు. లక్షకి పైగా థియేటర్స్ ఉన్న చైనా మార్కెట్ మీద కన్నేయలేదు. ఇండోనేషియా, మలేషియా మార్కెట్ మీద ఫోకస్ లేదు. కాని మన దేశం లో ఒక కేంద్ర పాలిత ప్రాంతమనిపించేంత సైజుండే, దక్షిన కొరియా మీద ఫోకస్ పెంచాడు. ఆ దేశం మీద డ్రాగన్ బాంబు పేల్చబోతున్నాడు.అక్కడ సినిమాను రిలీజ్ చేయటమే కాదు, అక్కడ ప్రమోషన్ కోసం పది రోజులకు పైనే టైం కేటాయించాలనే తన నిర్ణయం, నిదానంగా బయటికొస్తోంది. మన తెలుగు మార్కెట్ తో పోలిస్తే, రెండు తెలుగు రాష్ట్రాలంత మార్కెట్ కూడా దక్షిన కొరియాకు లేదు.. అయినా కొడితే ఏనుగు కుంభ స్థలం కొట్టాలన్నట్టు, దక్షిన కొరియానే ఏనుగు కుంభస్థలం అనంటున్నాడు..
అక్కడే మైండ్ బ్లాంక్ చేసే లాజిక్ ఉంది. ఏంటంటే, కొరియాలో కొడితే, సౌండ్ హాలీవుడ్ లో వస్తుంది...ఔను... కొరియా సినిమాలు,వెబ్ సీరీస్ లు, కే పాప్ సాంగ్స్ కి అమెరికన్లే కాదు, యూరోపియన్లు కూడా బానిసలైపోతున్నారు. ఇండియాలో జెన్ జీ, జెన్ ఆల్ఫా కూడా కొరియా పాటలు, మాటలకు అడిక్ట్ అవటం చూస్తుంటే, అక్కడ మన సినిమా పేలితే, ప్రపంచం వ్యాప్తంగా డ్రాగన్ నిప్పులు వర్షానికి, వసూళ్ల తుఫాన్ వచ్చే చాన్స్ఉంది.చైనా, జపాన్, ఇండోనేషియా,మలేషియా పెద్ద మ్యాటరే కాదు.. అక్కడ కూడా కొరియన్స్ పాటలు, సినిమాలకున్న డిమాండ్ లెవలే వేరు.. అందుకే 99 హత్యలు చేసిన వాడిని వేసేస్తే, వాటి టోటల్ రికార్డులన్నీ కొత్త హంతకుడి ఎకౌంట్ లో పడిపోతాయనే సినిమా డైలాగే ఇక్కడ నిజమయ్యేలాఉంది. కాబట్టి ప్రపంచం మన వైపు చూడాలంటే, అసలు ప్రపంచం ఎటు వైపు చూస్తుందో అక్కడికి వెళ్లి నిలుచోవటం ఉత్తమం.. అందులో భాగంగా దక్షిన కొరియాలో డ్రాగన్ దూసుకెళ్ళేలా కంటెంటే కాదు,మార్కెటింగ్ కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. అందుకే సైలెంట్ గా సినిమా మీద తప్ప మరోవైపు చూడట్లేదు.. అంతా సైలెంట్ గా జరిగిపోతోంది. కొరియన్ భాషలో, డైరెక్ట్ గా రిలీజ్ కాబోయే మొదటి ఇండియన్ సినిమాగా డ్రాగన్ హిస్టరీ క్రియేట్ చేసేలా ఉంది.