మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ ఇప్పుడు సెన్సేషన్ గా మారబోతోంది. చైనా మీడియాలో కూడా ఇదిప్పుడు వార్తైందంటే నమ్ముతారా? ఔను ఒక ఇండియన్ మూవీ అది కూడా 700 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాకు చైనా వీరుడి పేరు పెడుతున్నారు.. ఇది షార్ట్ గా ఆ వార్త సారాంషం.. చైనాలోనే కాదు, పైసా ఖర్చు లేకుండా జపాన్, కొరియా, ఇండోనేషియాలో కూడా ఇప్పడుు ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ మీద వార్తల వరదలు పెరిగాయి. డ్రాగన్ సినిమా ఎప్పటినుంచో తెరకెక్కుతోంది. కాని ఇప్పడు ఇక్కడ ఎన్టీఆర్ కొడితే, చైనాలో సౌండ్ ఎందుకు వస్తోంది... అంతా టైటిల్ మహిమే.. డ్రాగన్ వర్కింగ్ టైటిల్ మాత్రమే అన్నారు. అసలు టైటిల్ ఇప్పుడు మనముందుకు తీసుకొస్తున్నారు. అదే బ్రూస్లీ.. ఔను ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ అసలు అఫీషియల్ టైటిల్ బ్రూస్లీగా తేల్చేశారా? అందుకే చైనా నుంచి జపాన్ వరకు ఎన్టీఆర్ పేరు అక్కడి మీడియాలో సెన్సేషనల్ న్యూస్ గా మారిందా? ప్రపంచానికి చైనా మార్షియల్ ఆర్ట్స్ ని పరిచయం చేసిన బ్రూస్లీ పేరు పెట్టినంత మాత్రమే ఇంతగా చైనా, జపాన్ లో ఎన్టీఆర్ సినిమా పేరు మారుమోగుతుందా? అంటే కానేకాదు.. అక్కడే కథలో కనెక్షన్ తో పాటే టైటిల్ తో ట్విస్ట్ ఇస్తోంది ఫిల్మ్ టీం.. ఇంతకి అదేంటి?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉన్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇది నిజంగా టాలీవుడ్ కే కాదు, పాన్ వరల్డ్ మూవీలు ప్లాన్ చేస్తున్న అందరికి షాక్ ఇచ్చే విషయమే.. అదే డ్రాగన్ మూవీ టైటిల్.. ఇప్పటి వరకు ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తోంది డ్రాగన్ మూవీ అనుకున్నారు. అదే ప్రచారం జరిగింది. నిర్మాత మాత్రం చాలా సార్లు అది కేవలం వర్కింగ్ టైటిలే అన్నాడు. కాని అసలు అఫీషియల్ టైటిల్ తేల్చకపోవటం, అంతా డ్రాగన్ అనే కన్ఫామ్ చేసుకున్నారు.చివరికి త్రిబుల్ ఆర్ వర్కింగ్ టైటిల్ నుంచి ఒరిజినల్ టైటిల్ గా మారినట్టు డ్రాగన్ టైటిలే ఫిక్స్ అయ్యేలా ఉందనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు డ్రాగన్ ప్లేస్ లోకి బ్రూస్లీ వచ్చాడు... ఇదొక్కటి చాలు, పాన్ ఆసియా మొత్తం ఊగిపోవటానికి.. అంటే కేవలం బ్రూస్లీ టైటిల్ పెడితే, ఎన్టీఆర్ మూవీ చైనా, జపాన్, కొరియా, ఇండోనేషియా, మలేషియాని కుదిపేస్తుందనుకోవాలా.? కానే కాదు.. కాని కంటేంట్ ఏమాత్రం బాగున్నా, ఈ సినిమా ఈజీగా చైనా , జపాన్ కొరియా మార్కెట్లను ఏలటం ఖాయం.
మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీకి గతంలో ఇదే టైటిల్ పెట్టారుకదా అనుకుంటే... అదొచ్చి పదేళ్లుదాటింది.. కాబట్టి ఏ సినిమా టైటిలైనా, ఆమూవీ వచ్చి పదేళ్లు దాటితే అదే టైటిల్ మరొకరు కూడా వాడుకోవచ్చు... కాబట్టే బ్రూస్లీ టైటిల్ ని రంగంలోకి దింపారని తెలుస్తోంది.. ఐతే ఈ టైటిలే పెట్టటానికి రీజన్ మాత్రం చైనా, జపాన్, కొరియా, మలేసియా, ఇండోనేషియా ఇలా మొత్తం సౌత్ ఏషియా అంతటా రీచ్ పెరుగుతుంది.ఆలెక్కన చరణ్ మూవీకి బ్రూస్లీ అని పెట్టినప్పుడు ఇదే జరగాలి కదా అన్న డౌట్ రావొచ్చు. కాని అప్పుడు తెలుగులో వచ్చిన బ్రూస్లీ ఇక్కడే సరిగా ఆడలేదు.
ఇక పాన్ ఇండియా ట్రెండ్ కూడా పెరగలేదు... అలాంటిది ఇక పాన్ ఆసియా, పాన్ వరల్డ్ మార్కెట్ లోకి చరన్ గత బ్రూస్లీ మూవీ పోలేదెందుకు అన్న డౌట్ కి అర్ధం లేదు. ఇప్పుడు మాత్రం లెక్కలు మారాయి. బాహుబలి, త్రిబుల్ ఆర్ తర్వాత తెలుగు సినిమా గ్లోబల్ మూవీగా మారిపోతోంది.కాబట్టి ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవల్లో చేస్తున్న డ్రాగన్ మూవీ టైటిల్ బ్రూస్లీ గా మారటం డెఫినెట్ గా చైనా, జపాన్, కొరియా మీడియా అటెన్షన్ లాక్కునేదే.. నాటు నాటు పాటతో గ్లోబల్ గా ఫోకస్ అయ్యి, దేవరతో కూడా పాన్ ఇండియానే షేక్ చేసిన ఒక ఇండియన్ సినిమాకు చైనీస్ లెజెండ్ పేరుని పెట్టడం ఇప్పుడు చైనాలోమాత్రం హాట్ టాపిక్ అవుతోంది.