సాధారణంగా నిర్మాతలు సినిమాల గురించి, కలెక్షన్ల గురించి మాట్లాడతాడు. కానీ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ స్టైలే వేరు! ఏదైనా మొహమాటం లేకుండా ఓపెన్‌గా చెప్పేసే నాగవంశీ.. తాజాగా ఒక హీరోయిన్‌పై తనకున్న క్రష్ గురించి బయటపెట్టాడు. ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ ప్రస్తుత క్రష్ మృణాల్ ఠాకూర్. నాగవంశీ ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్లలో ఒకరు. గతేడాది 'డాకు మహారాజ్', 'మ్యాడ్ స్క్వేర్' గుంటూరుకారం వంటి సినిమాలతో దూసుకుపోయాడు. ఆయన ఎప్పుడూ యూత్ ఫుల్ ఎనర్జీతో ఉంటాడు. తన ప్రెస్ మీట్స్ లో ఇచ్చే ఆన్సర్లు చాలా సరదాగా, కొన్నిసార్లు వివాదాస్పదంగా కూడా ఉంటాయి.
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో నాగవంశీకి 'మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు?' అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. "నాకు ఎప్పుడూ పూజా హెగ్డే అంటే ఇష్టం, రష్మిక మందన్నా అంటే కూడా ఇష్టమే. కానీ ప్రెజెంట్ నా మేజర్ క్రష్ మాత్రం మృణాల్ ఠాకూర్" అని ఓపెన్ అయిపోయాడు. నాగవంశీ ఒక అడుగు ముందుకేసి.. "హీరోయిన్ల ముందు నన్ను నేను యంగ్‌గా, యాక్టివ్‌గా ప్రజెంట్ చేసుకోవడానికి ఇటీవల పికిల్ బాల్ గేమ్ ఆడటం కూడా మొదలుపెట్టాను" అని నవ్వుతూ చెప్పాడు.
నిర్మాత స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత ఓపెన్‌గా తన క్రష్ గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. 'సీతారామం' సినిమాతో మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కుందనపు బొమ్మగా నిలిచిపోయింది. ఆ సినిమా తర్వాత ఆమె క్రేజ్ మామూలుగా లేదు. కేవలం ఫ్యాన్సే కాదు, సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా ఆమె అందానికి, నటనకు ఫిదా అవుతున్నారని చెప్పడానికి నాగవంశీ కామెంట్స్ ఒక ఉదాహరణ.