200 కోట్లు ఫైనల్.. ఎన్టీఆర్ vs ప్రభాస్..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వర్సెస్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇదే ఇప్పుడు రెమ్యునరేషన్ పరంగా ఈ ఇద్దరు స్టార్స్ మధ్య పోలికలతో పెరిగి పోటీ... నిజానికి పాన్ ఇండియా మార్కెట్ కి ఫస్ట్ కింగ్ అంటే రెబల్ స్టారే..

Post Published By: dialnews
Updated : 2 March 2026, 2:30 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వర్సెస్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇదే ఇప్పుడు రెమ్యునరేషన్ పరంగా ఈ ఇద్దరు స్టార్స్ మధ్య పోలికలతో పెరిగి పోటీ... నిజానికి పాన్ ఇండియా మార్కెట్ కి ఫస్ట్ కింగ్ అంటే రెబల్ స్టారే... తర్వాతే కన్నడ స్టార్ యష్, తెలుగు స్టార్స్ అయిన అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వచ్చారు.. ఇందులో అంతా వెనకబడిపోయినా... ఒక్కడు మాత్రం రెబల్ స్టార్ కే పోటి ఇచ్చేంతగా 4 ఏళ్లలో లెక్కే మార్చాడు. ఔను 2022 వరకు పాన్ ఇండియా లెవల్లో రెమ్యునరేషన్ లో అయినా, బాక్సాపీస్ సెన్సేషన్ లో అయినా రెబల్ స్టారే నెం.1 గా కొనసాగాడు. 75 కోట్లు, వందకోట్లు 150 కోట్లు నుంచి 200 కోట్ల వరకు తన రెమ్యునరేషన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా 400 కోట్ల కు తన పారితోషికం పెరిగిపోతోందన్న టైంలో, 200 కోట్లు ప్లస్ 200 కోట్లతో డ్రాగన్ గా గర్జిస్తున్నాడు ఎన్టీఆర్... కాకపోతే ప్రాఫిట్స్ లో షేర్ ని పక్కన పెడితే, రెండు వందలకోట్ల పారితోషికంతో ప్రభాస్ కి నిజంగానే ఎన్టీఆర్ పోటీ ఇస్తున్నాడా?

పాన్ ఇండియా ట్రెండ్ వచ్చాకే తెలుగు హీరోలు బాలీవుడ్ స్టార్లను కూడా రెమ్యునరేషన్ లో దాటిపోయారు. 1000 కోట్ల వసూల్లంటే ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరోలు రుచి చూపించిందే తెలుగు స్టార్లు.. బాహుబలి 1850 కోట్లు, త్రిబుల్ ఆర్ 1400 కోట్లు, కల్కీ 1200 కోట్లు, పుష్ప2కి 1600 కోట్లు..ఇలా మన సినిమాకు నార్త్ లో సౌండ్ ఎక్కువే..ఆరేంజ్ లో మన సినిమా పాన్ ఇండియా లెవల్లో రీసౌండ్ చేస్తుంటే, హీరోల రెమ్యూనరేషన్ మైండ్ బెండ్ చేయటం కామన్. ఆవిసయంలోనే ఇప్పుడు ఎన్టీఆర్ వర్సెస్ రెబల్ స్టార్ అన్నట్టు సీనేమారిపోయింది. ఒకప్పుడు హిందీ హీరోలతో మనోళ్లు పోటీ పడటమే గొప్ప.. ఇప్పుడు 200 కోట్ల నుంచి 400 కోట్ల వరకు తెలుుగ స్టార్స్ రెమ్యునరేషన్ రేంజ్ పెరిగిపోయింది..

ఖాన్లు, కపూర్లు, అంతా 125 కోంట్ నుంచి 180 కోట్ల రెమ్యునరేషన్ ని మించలేకపోయారు. కాని ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ కి 75 కోట్లు తీసుకుని, దేవరకి 140 కోట్ల రెమ్యునరేషన్ కి రీచ్ అయ్యాడు. వార్ 2 లో కేవలం 30 రోజుల కాల్ షీట్స్ కి 60 కోట్లు తీసుకున్న తను, డ్రాగన్ మూవీకి 200 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. అంతేకాదు డ్రాగన్ ప్రాఫిట్ లో 20శాతం షేర్ అంటే, డ్రాగన్ కి 1000 కోట్లొచ్చినా, అందులో 200 కోట్లు తనకి దక్కినట్టే..ఇక రెబల్ స్టార్ ప్రబాస్ కూడా 400 కోట్ల నుంచి 500 కోట్ల రెమ్యునరేషన్ కి రీచ్ అయ్యాడనే వార్తలు ఆమధ్య వచ్చాయి. కాకపోతే రియాలిటీ చూస్తే స్పిరిట్ కే తను హయ్యెస్ట్ ఎమౌంట్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. స్పిరిట్ మూవీకి 200 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్న తను, 25 శాతం ప్రాఫిట్ షేరింగ్ డీల్ కి ఒప్పుకున్నాడట. సో స్పిరిట్ కి 1000 కోట్లొస్తే 250 కోట్ల షేర్ తనకిఅదనంగా దక్కుతుంది...

ఐతే ప్రాఫిట్ షేర్లనేవి వసూల్ల మీద ఆధార పడిన వ్యవహారం. కాబట్టి అవి స్తిరంగా ఉండవు.. కాని అవికాకుండా తీసుకునే పారితోషికం విషయంలో ఎన్టీఆర్, ప్రభాస్ ఇద్దరూ 200 కోట్లని రీచ్ అయ్యారు. అక్కడ పోటీ పడుతున్నారు. ఈవిషయంలో చరణ్, బన్నీ, యష్ అంతా ఈ ఇద్దరు హీరోల వెనకే ఉండిపోయారు. ఐతే బాహుబలి నుంచి కల్కీ 2 వరకు పదేల్ల జర్నీలో ప్రభాస్ 200 కోట్ల రెమ్యునరేషన్ కి రీచ్ అయితే, అదే నెంబర్ ని మూడు నాలుగేళ్లలోనే రీచ్ అయ్యి షాక్ ఇస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.

Published : 
  • 2 March 2026, 2:30 PM IST