పాక్ లోనూ సంజూ మేనియా… భారత క్రికెటర్ పై పాక్ మాజీల ప్రశంసలు…!

టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్లోకి భారత్‌ను చేర్చిన సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపించారు. కోహ్లీలా ఆడాడంటూ కొనియాడారు.

Post Published By: dialnews
Updated : 4 March 2026, 12:55 PM IST

టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్లోకి భారత్‌ను చేర్చిన సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపించారు. కోహ్లీలా ఆడాడంటూ కొనియాడారు. సోషల్ మీడియాలో పాక్ ప్లేయర్ల కామెంట్స్ వైరల్ గా మారాయి.వెస్టిండీస్‌తో జరిగిన కీలక పోరులో సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన చేశాడు. తన అజేయమైన 97 పరుగుల ఇన్నింగ్స్‌తో భారత జట్టును సెమీఫైనల్‌కు చేర్చాడు. ఈ విజయంతో కేవలం భారత్‌లోనే కాకుండా, దాయాది దేశం పాకిస్థాన్‌లో కూడా సంజూ పేరు మారుమోగిపోతోంది. రెండుసార్లు ఛాంపియన్లైన వెస్టిండీస్ విధించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో సంజూ చూపిన పరిణతిని సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి వంటి దిగ్గజాలతో పాటు పాక్ మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసిస్తున్నారు.

పాకిస్థాన్ మాజీ బ్యాటర్ బాసిత్ అలీ తన యూట్యూబ్ ఛానెల్‌లో సంజూ బ్యాటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంజూ బ్యాటింగ్‌లో తనకు విరాట్ కోహ్లీ కనిపించాడన్నారు. వేర్వేరు బౌలర్లను ఎదుర్కొంటూ పరుగులు రాబట్టే విధానం, అతని పవర్ హిట్టింగ్ అద్భుతమని కొనియాడారు. కోహ్లీ లేని లోటు తెలియకుండా సంజూ ఛేజ్ మాస్టర్ లా వ్యవహరించాడని ఆయన పేర్కొన్నారు. ఏ బౌలర్‌ను ఎప్పుడు టార్గెట్ చేయాలి, గేర్లు ఎప్పుడు మార్చాలి అనే విషయంలో సంజూ లెక్కలు పక్కాగా ఉన్నాయని బాసిత్ అన్నారు.పవర్‌ప్లే హిట్టర్లు ఇద్దరూ అవుటైనప్పుడు సంజూ ఆడిన ఇన్నింగ్స్ విలువ 125 పరుగులతో సమానం. వారిద్దరి లోటు తెలియకుండా జట్టును ముందుకు నడిపించాడు" అని బాసిత్ అలీ అభినందించారు.

పాక్ మాజీ కెప్టెన్ మహమ్మద్ హఫీజ్ సంజూ నిస్వార్థమైన ఆట తీరును మెచ్చుకున్నాడు. సంజూ ఎప్పుడూ తన వ్యక్తిగత సెంచరీ కోసం ప్రయత్నించలేదన్నాడు. అతనికి 100 కంటే జట్టు విజయమే ముఖ్యమనీ,. తొలుత దూకుడుగా ఆడిన అతను, తర్వాత ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు యాంకర్ రోల్ పోషించాడన్నాడు. ఆటగాడికి తన దేశాన్ని గెలిపించడమే అతిపెద్ద మైలురాయి అని సంజూ నిరూపించాడని హఫీజ్ పేర్కొన్నాడు.పాక్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ సైతం సంజూ ప్రదర్శనను చూసి ఆశ్చర్యపోయాడు. ఒక టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత్ ఓడిపోతుందని జోస్యం చెప్పిన మహమ్మద్ అమీర్ అంచనాలను తప్పుబట్టాడు.

Published : 
  • 4 March 2026, 12:55 PM IST