3 పాత్రలను ఒకే పోస్టర్ లో.. మైండ్ బెండింగ్…!

వారాణాసి ప్రమోషన్ లెక్కేమారబోతోంది. ఉగాదికి వచ్చే పోస్టర్ మీద అంచనాలు పెంచేలా ఫిల్మ్ టీం కొత్త ఎనౌన్స్ మెంట్ కి సిద్దమైనట్టుతెలుస్తోంది.

Post Published By: dialnews
Updated : 7 March 2026, 4:30 PM IST

వారాణాసి ప్రమోషన్ లెక్కేమారబోతోంది. ఉగాదికి వచ్చే పోస్టర్ మీద అంచనాలు పెంచేలా ఫిల్మ్ టీం కొత్త ఎనౌన్స్ మెంట్ కి సిద్దమైనట్టుతెలుస్తోంది. మొన్నటికి మొన్న అమెరికన్ యూ ట్యూబర్ తో ఇందులో హీరో వేసేది మూడు పాత్రలని తేల్చాడు రాజమౌళి. ఇప్పుడు ఆ పాత్రలను పోస్టర్ రూపంలో రిలీజ్ చేయబోతున్నారు. హ్యాపీ ఉగాది అని కాకుండా, వెల్కమ్ టూ సరికొత్త యుగాధి.. అంటే ఉగాది అసలు పదం, యుగాధిని ఇక్కడ వాడబోతున్నారు.. అంటే వారణాసి మూవీతో తెలుగు సినిమాకు సరికొత్త యుగారంభం అని పరోక్షంగా చెప్పబోతోంది ఫిల్మ్ టీం. ఇంతకి రుద్రుడిగా, శివుడిగా, రాముడిగా ఇలా మూడు పాత్రల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు పోస్టర్ ఉంటుందా? అన్ని సర్ ప్రైజులు ఇప్పుడు ఇంటర్వూల రూపంలో, లేదంటే పోస్టర్ల రూపంలో చెప్పేస్తే ఎలా? అసలు రాజమౌళి ఇంతకాలం సైలెంట్ గా ఉండి, ఇప్పడిలా అన్నీ తానే రివీల్ చేయటం వెనకున్న స్ట్రాటజీ ఏంటి..? రిలీజ్ కి ఏడాదికి ముందే మొత్తం కథంతా చెప్పేసేలా ఉన్నాడు జక్కన్న.. ఇంతకి తన ప్రమోషన్ ఫార్ములా ఏం చెబుతోంది?

వారణాసి కేవలం 1400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే సినిమా మాత్రమే కాదు, ఐమ్యాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న మొదటి భారతీయ సినిమా కూడా.. దీనికి తోడు ప్రపంచంలో ఏ సినిమా కూడా 55 వేల థియేటర్స్ లో రిలీజ్ కాలేదు. ఇది విడుదల కాబోతోంది. 120 దేశాలు, 100 కోట్ల ఆడియన్స్ ని రీచ్ అవటమే టార్గెట్ గా వారణాసిని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.అలాంటి మూవీని మొదట్నుంచి సీక్రెట్ గా ఉంచి, అమెరికన్ రిపోర్టర్ల ముందు సాంతం, సీక్రెట్లన్నీ రివీల్ చేస్తూ వస్తున్నాడు రాజమౌళి. ఓరకంగా ఫ్యాన్స్ కి ఇలా అయినా అప్ డేట్స్ దక్కాయని అంతా అనుకుంటుంటే, ఇప్పుడు అసలు ఆటని షురూ చేయబోతున్నాడు. రాజమౌలి ఎంతగా తన సినిమా కంటెంట్ ని సీక్రెట్ గా దాస్తాడో, అంతకుమించేలా అదే కంటెంట్ ని వదిలినప్పుడు, సునామీ క్రియేట్ చేస్తాడు.

అది తన మార్కెటింగ్ స్ట్రాటజీ. అదే ఇప్పడు జరగబోతోది. ముందుగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో త్రిబుల్ ధమాకా రెడీ అయ్యింది. ఇంతవరకు వారణాసి లో సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఎలా ఉంటుందో అందరికీ, తెలుసు. కాని ఇందులో తను వేస్తున్న మూడు పాత్రల్లో ఒక రోల్ తాలూకు లుక్ మాత్రమే అందరం చూశాం.. ఇప్పడు రుద్రుడిగానే కాదు, శివుడిగా, రాముడిగా కూడా మహేవ్ బాబు లుక్ ఎలా ఉంటుందో రాజమౌళి చూపించబోతున్నాడు.మోస్ట్ లీ ఉగాదికే ఈ సినిమా పోస్టర్ రావొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇది వారణాసి విజువల్స్ తో కూడిన గ్లింప్స్ కాదు.. టీజర్ అంతకంటే కాదు.. కేవలం పోస్టర్.. కాని ఇది ట్రైలర్ కి ఏమాత్రం తీసిపోదు.

ఎందుకంటే సినిమాలో ఏముందో, ట్రైలర్ చూస్తే ఒక అంచనాకు రావొచ్చు.. అలానే ఇందులో హీరో పాత్ర రేంజ్ ఏంటో తేలాలంటే, అందులో తను వేసే మూడు పాత్రల లుక్స్ బయటికొస్తే చాలు.వారణాసి క్రియేట్ చేయబోయే సునామీని అంచనా వేసుకోవచ్చు.. ఐతే ఈ మూవీలో రాముడిగా, శివుడిగా మహేశ్ బాబు లుక్ ముందే రివీల్ అయితే, ఇక థియేటర్స్ లో ఏమంత కిక్ ఉంటుందనే డౌట్ రావొచ్చు.. అక్కడే రాజమౌళి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు. రుద్రుడి పాత్ర ముందుగా, ఇక శివుడు, రాముడి పాత్రలో మహేశ్ లుక్స్ మాత్రం తన వెనక వైపు ఉండేలా ప్లాన్ చేస్తున్నాడ. ఇక్కడ ముఖం చీకట్లో ఉండేలా, అంటే కల్కీలో కృష్ణుడి పాత్ర చూపించినట్టు మోషన్ పోస్టర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సో హీరో వేసే మూడు పాత్రలు చూపించనట్టు చూపిస్తూ, ముఖం కనిపించకుండా చేయటంతో, ఆ సర్ ప్రైజింగ్ లుక్ ని సీక్రెట్ గా ఉంచినట్టౌతోంది.. జక్కన్న ప్లాస్ నెక్ట్స్ లెవల్ అనిపించేలా ఉంది.

Published : 
  • 7 March 2026, 4:30 PM IST