Election to 56 Rajya Sabha seats across the country
పార్లమెంట్ బడ్జెట్ మలి విడత సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. లోక్సభ స్పీకర్ పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు విపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన జీవితంలో ఇలాంటి ప్రతిపక్షాన్ని చూడలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇక అవిశ్వాస తీర్మానంపై చర్చ లేదని ప్యానెల్ స్పీకర్ జగదంబికాపాల్ ప్రకటించడంపై విపక్షాలు మండిపడ్డాయి. అవిశ్వాస తీర్మానంపై చర్చించాలంటూ విపక్షాల డిమాండ్ చేయగా.. విపక్షాల ఆందోళనల మధ్యే సభ కొనసాగుతోంది. అటు పశ్చిమ ఆసియా దేశాల పరిస్థితులపై కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్ ప్రకటన చేసారు.