సూపర్ స్టార్ మహేశ్ బాబు వారణాసి రిలీజ్ కి ముందే 4000 కోట్ల స్టార్ గా మారేలా ఉన్నాడు. ఇంతవరకు తన సినిమాల హయ్యెస్ట్ కలెక్సన్స్ 300 కోట్లు మించలేదు. అలాంటిది తన కొత్త మూవీ వారణాసి ఏకంగా 4 వేలకోట్లని రిలీజ్ కి ముందే సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ 1000 కోట్ల ఓటీటీ రైట్స్ రూపంలో వచ్చాయన్నారు. కట్ చేస్తే ఇప్పుడు కేవలం తెలుగు వర్సన్ ఓవర్ సీస్ రైట్స్ కే 160 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇలా అన్ని భాషల ఓవర్ సీస్ రైట్స్ లెక్కేస్తే అవే దగ్గర దగ్గర 800 కోట్లు దాటుతున్నాయి.. ఈలెక్కన ఇండియాలో థియేట్రికల్ రైట్స్ పరిస్థితేంటి? వాటన్నింటిని కలిపితేనే 4 వేల కోట్లని లెక్కతేలిందా? ఇదే విధంగా రిలీజ్ తర్వాత టాక్ కిక్ ఇస్తే, 6 వేల కోట్ల వసూళ్లు అసలు అత్యాశే కాదా?
సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా వారణాసి రిలీజ్ కి ముందునుంచే వండర్స్ చేస్తుందనే అంచనాలున్నాయి. ప్రీరిలీజ్ బిజినెస్ మీద చాలా ప్రచారాలు జరిగాయి.. ఇప్పుడు సీన్ చూస్తే మైండ్ బ్లాంక్ అయ్యే నెంబర్స్ వినిపిస్తున్నాయి. వారణాసి తెలుగు వర్షన్ ఓవర్ సీస్ రైట్సే 160 నుంచి 170 కోట్లు పలుకుతున్నాయని తెలుస్తోంది.యూఎస్ బేస్డ్ ఫార్స్ ఫిల్మ్స్ సంస్థ, వారణాసి తెలుగు వర్షన్ ఓవర్ సీస్ రైట్స్ డిస్ట్రిబ్యూషన్ కి 160 నుంచి 170 కోట్లు ఆఫర్ చేసిందట.
ఇది కేవలం తెలుగు వర్షన్ విలువే.. హిందీ వర్షన్ కి ఇంతకు డబుల్ ఎమౌంట్ రావొచ్చు..తమిళ్, మలయాళం, కన్నడ వర్షన్ కి ఎంతుంటుంది.. ఇక ఇంగ్లీష్ వర్షన్ రైట్స్ ఎంతుండొచ్చు.. ఏది డీల్ ఫైనల్ కాలేదు.కాని కేవలం వారనాసి యూఎస్, కెనెడా దేశాల రైట్సే, 800 కోట్లు దాటుతున్నాయి. ఇంకా యూరప్ లో అన్ని భాషల వర్షన్స్, ఇలా ఎన్ని దేశాల్లో రిలీజ్ చేస్తున్నారో, అన్ని దేశాల రైట్స్ లెక్కేస్తే, తక్కువ ఎమౌంట్ తోనేఅంచనా వేసినా, అవే 1200 కోట్ల వరకు ఉండొచ్చంటున్నారు. ఆల్రెడీ వారణాసి ఓటీటీ రైట్స్ 1000 కోట్లంటున్నారు.
దీనికి తోడు, ఇంకా ఇండియన్ థియేట్రికర్ రైట్స్ కూడా మైండ్ బ్లాంక్ చేసేలా ఉన్నాయి. అవి ఓవరాల్ గా 2 వేల కోట్లు ఉండొచ్చంటున్నారు.. అలా లెక్కేస్తే ఓటీటీ రైట్స్ కాకుండానే 4 వేల కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ చేసేలా ఉంది వారణాసి మూవీ. ఓటీటీ రైట్స్ తాలూకు వెయ్యికోట్లు అదనం... అది కలిస్తే 5 వేల కోట్లొచ్చేసినట్టే .. అంటే 1400 కోట్ల పెట్టుబడి అప్పుడే 4 నుంచి 5 వే లకోట్ల రాబడిగా మారినట్టే కనిపిస్తోంది.
ఇక రిలీజ్ అయ్యాక ఏమాత్రం టాక్ బాగున్నా , డిస్ట్రిబ్యూటర్లంతా పెట్టిన 4 వేల కోట్లు తిరిగొచ్చినా, మరో రెండు వేల కోట్లు అంటే టోటల్ గా 6 వేల కోట్లు వారనాసి సినిమాకు రావటం పెద్ద కష్టమేమి కాదని తేలుతోంది. హాలీవుడ్ రేంజ్ లో రిలీజ్ చేయటమే కాదు, అదే స్థాయిలో 6 వేల కోట్లు మించేలా వసూళ్లు రాబడితే మాత్రం పాన్ వరల్డ్ ట్రెండ్ కూడా సెట్ చేసిన దర్శకుడిగా రాజమౌళి పేరు హిస్టరీలో వినిపిస్తుంది. సూపర్ స్టార్ పేరు వరల్డ్ వైడ్ గా మారుమోగుతుంది.