సూపర్ పండగెప్పుడు..? TEASERతోనే అసలు కిక్…!

వారణాసి మూవీ మళ్లీ వార్తల్లోకి రావటానికి కారణం ధురందర్ 2 మూవీ. ఈ సినిమా దుమ్ముదులపుతోందని, కలెక్షన్స్ చూస్తే అర్ధమౌతోంది.ఐతే ఈ మూవీని, దర్శకుడిని, హీరోని ఇలా మొత్తం టీం ని రాజమౌళి ఆకాశానికెత్తాడు.

Post Published By: dialnews
Updated : 23 March 2026, 6:30 PM IST

వారణాసి మూవీ మళ్లీ వార్తల్లోకి రావటానికి కారణం ధురందర్ 2 మూవీ. ఈ సినిమా దుమ్ముదులపుతోందని, కలెక్షన్స్ చూస్తే అర్ధమౌతోంది.ఐతే ఈ మూవీని, దర్శకుడిని, హీరోని ఇలా మొత్తం టీం ని రాజమౌళి ఆకాశానికెత్తాడు. తన ట్వీట్ తో ఇండస్ట్రీని షేక్ చేశాడు. అంతే వెంటనే సోషల్ మీడియాలో వారణాసి వార్ మొదలైంది. ఎప్పుడీ సినిమా టీజర్ అంటూ ప్రశ్నల వర్షం రాజమౌలికి పెరిగిపోయింది... వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ అన్నారు.. పాన్ వరల్డ్ లెవల్లో విడుదలని తేల్చారు. ఆలెక్కన హాలీవుడ్ స్టాండర్డ్స్ ప్రకారం, సినిమా రిలీజ్ కి కనీసం 6 నుంచి 8 నెలల ముందు ట్రైలర్ రావాలి... అది రావాలంటే అంతకంటే ముందు టీజర్ రావాలి... గ్లింప్స్ పేలాలి.. కాని ఇంతవరకు వారణాసి కాన్సెప్ట్ గ్లింప్స్ తప్ప, అసలు విజువల్స్ కదిలే గ్లింప్స్ రాలేదు.. అందుకే టీజర్ పండగెప్పుడన్న ప్రశ్న మొదలైంది. మరోకరి హిట్ మూవీని పొగిడి రాజమౌళి ఇలా నెటీజన్ కి దొరికిపోయాడా? వారణాసి టీజర్ పండగెప్పుడో ఇకమీదటైనా తేలుస్తాడా?

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ కి సడన్ గా కాన్సెప్ట్ గ్లింప్స్ తో ఊపు తెచ్చి.. ఊరించి, తర్వాత గ్యాప్ ఇచ్చిన రాజమౌళి, మొన్నీమధ్య అమెరికన్ యూ ట్యూబర్స్ కి ఇంటర్వూలు ఇచ్చాడు. కట చేస్తే మళ్లీ సైలెంట్...
ఇప్పుడు ధురందర్ 2 మీద దెగ పొగడ్తల వర్షం కురిపించినా రాజమౌళి, ఎందుకు మళ్లీ వారనాసి ఊసెత్తట్లేదు.. షూటింగ్ తో బిజీనా? అసలు తన స్ట్రాటజీ ఏంటి.రిలీజ్ ఏడాది ఉంది... కాని ఈలోపు కాన్సెప్ట్ గ్లింప్స్ ఈవెంట్ తో షాక్ ఇచ్చాడు. మళ్ళీ గ్యాప్ ఇచ్చి, అమెరికన్ రిపోర్టర్లకు వరుస పెట్టి ఇంటర్వూలు ఇచ్చాడు. వాళ్లే పెద్ద ఫేమస్ యూ ట్యూబర్స్ కూడా కాదు.. కాని ఈ ప్రమోషన్ తో ఏం సాధించాడో ఇప్పటికీ అర్ధం కావట్లేదు. మరి ఇదో రకం ప్రమోషనల్ స్ట్రాటజీయేమో అన్న అంచనాలు కూడా ఉన్నాయి.

ఏదేమైనా వారణాసి అసలు గ్లింప్స్ లేదంటే విజువల్స్, డైలాగ్స్ తో కూడిన టీజర్ ఎప్పుడనే ప్రశ్న అలానే ఉంది. రిలీజ్ డేట్ కి ఇంకా ఏడాది టైం ఉన్నా, వరల్డ్ సినిమా అంటే, కనీసం ఏడాది ముందో లేదంటే 8 నెలల ముందే ట్రైలర్ వదలాలి.. ఆలెక్కన దసరాకు ట్రైలర్ వచ్చేయాలి... అంటే దానికి ముందే టీజర్ రావాలి.. దానికి ముందు గ్లింప్స్ వచ్చేయాలి.ఆల్రెడీ కాన్సెప్ట్ గ్లింప్స్ ని భారీ ఈవెంట్ తో రిలీజ్ చేసిన రాజమౌళి, అసలు గ్లింప్స్ ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడా? లేదంటే షూటింగ్ తోనే బిజీనా? తన టీం టీజర్ ప్రిపరేషన్ ఎప్పుడో చేసిందన్న వార్తలొచ్చాయి.. కాని ఎలాంటి ఎనౌన్స్ మెంట్స్ రావట్లేదు. అసలు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఎలాంటి క్లూ ఉండట్లేదు. అన్నీ సడన్ గా అది సర్ ప్రైజ్ లా చేస్తూ వస్తున్నాడు రాజమౌళి.

అందుకే వారణాసి టీజర్ లేదంటే డైలాగ్స్ తో కూడిని గ్లింప్స్ పండగెప్పుడనే ప్రశ్న ఎదురౌతోంది. శ్రీరామ నవమి వచ్చే వారమే ఉంది. సో అప్పడైనా ఏదైనా ఎనౌన్స్ మెంట్ ఉంటుందా? టీజర్ లేదంటే, గ్లింప్స్ లాంచింగ్ డేట్స్ రాబోతున్నాయా? ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న ప్రచారం ప్రకారం చూస్తే, వినాయక చవితికి టీజర్ లాంచ్ చేస్తాడనంటున్నారు.దానికి ముందు గ్లింప్స్ ని మాత్రం మేనెల్లో వదిలితే ఎలాఉంటుందనే డిస్కర్షన్ టీంలో జరిగినట్టు ప్రచారం జరిగింది. కాని ఏది అఫీషియల్ గా తేలలేదు. సో శ్రీరాముడి ఎపిసోడ్ వారణాసిలో చాలా క్రూషియల్. కాబట్టి, శ్రీరామ నవమికి ఏదైనా సర్ ప్రైజింగ్ ఎనౌన్స్ మెంట్ ఉండొచ్చనే ప్రచారం ఊపందుకుంటోంది. ఇదే ప్రశ్ననుధురందర్ 2 ని మెచ్చుకుంటున్న రాజమౌళికి సోషల్ మీడియాలో ట్వీట్లతో వేస్తున్నాడు సూపర్ ఫ్యాన్స్.

Published : 
  • 23 March 2026, 6:30 PM IST