సూపర్ స్టార్ మహేశ్ బాబు వారణాసి లుక్ అదిరింది. రాజమౌళి సినిమా కాబట్టి, కాన్సెప్ట్ గ్లింప్స్ చూస్తే నెక్ట్స్ లెవల్లో ఉండేలా ఉందని తేలుస్తోంది. ఇక ప్రియాంక చోప్రాకు వరల్డ్ వైడ్ గా ఉన్న రీచ్, మార్కెట్ కూడా ఈ మూవీకి ప్లస్ అయ్యేలా ఉంది. కాకపోతే ఇది పాన్ వరల్డ్ గోడలు బద్దలు కొడితే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు... వారణాసి పక్కా హిట్ అవుతుంది.. అందులో డౌట్ లేదు.. ఇండియాలో బాక్సులు బద్దలైపోతాయి.. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. కథేంటో, కంటెంట్ ఏముందో ఎవరికీ తెలియకున్నా, బ్లాక్ బస్టర్ కన్ఫామ్ చేసుకుంటున్నారు. కాని సరిపోదు.. వరల్డ్ ఆడియన్స్ మన మూవీ కోసం థియేటర్స్ ముందు క్యూ కట్టాలంటే భూమి బద్దలైపోవాయి.. ఓరకంగా థియేటర్స్ లో భూకంపం రావాలి.. వారణాసి లో వండర్స్ ఎన్నైనా ఉండొచ్చు.. కాని ఇదే వండర్స్ చేయకపోతే, పాన్ వరల్డ్ మార్కెట్ లో ఏది అంత ఈజీకాదు.. అంతగా వారణాసిని కంగారు పెట్టిస్తోన్న అంశం ఏంటి?
మన అణుబాంబు పితామహుడైన హోమీజే బాబా ఒక మాట అనేవాడు.. పవరే పవర్ ని గౌరవిస్తుంది.. బలహీనంగా ఉంటే మనల్నీ ఎవరూ లెక్కచేయరు.. ఈ మాటే మనల్ని అణుదేశంగా మార్చిందంటారు.. అంటే మనల్ని లెక్కచేయనోళ్ల మైంబ్ బ్లాంక్ అయ్యేలా, దిమ్మతిరిగి బొమ్మ కనిపించే షాక్ ఇస్తేనే, మనల్నీ లెక్కచేస్తారు.. అలా చేస్తేనే మనం గురించి తెలియని వాళ్లు కూడా, అన్ని సర్ధుకుని, సడన్ గా గౌరవించటం మొదలు పెడతారు... బాహుబలి 1 తో అలానే సౌత్ సినిమా అంటే బాలీవుడ్ వణికింది. అప్పటి నుంచి సౌత్ సినిమా , తెలుగు మూవీల మహిమంటే వాళ్లు అన్నీ మూసుకుని గౌరవించాల్సి వచ్చింది. అలాంటి మ్యాజిక్కే వారణాసి వరల్డ్ వైడ్ గా చేయాలి...రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా ఎంత గొప్ప సినిమా చేసినా, అదేదో వరల్డ్ వైడ్ గా 55 వేల థియేటర్స్ లోరిలీజైతే సరిపోదు.. మంచి సినిమా అనిపించుకున్నా ఉపయోగం ఉండదు.. నార్త్ ఇండియాను బాహుబలి ఎలా షేక్ చేసింది.. అలా చాచి పెట్టి కొట్టనట్టు, అసలు హాలీవుడ్ వాల్లకే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా వారనాసి వండర్ చేయాలి.. అప్పుడు పాన్ వరల్డ్ లో మన మూవీలకు గౌరవం, మన సినిమాలకోసం థియేటర్ల ముందు తెల్లోల్లు కూడా క్యూ కట్టే రోజులొస్తాయి..
అసలు బాహుబలి 1 వచ్చినప్పుడు మొదటి రోజు నార్త్ ఇండియాలో ఎవరూ పట్టించుకోలేదు. కాని రెండో రోజుకి, బాలీవుడ్ బాక్సాఫీస్ బెండుతీసింది ది బిగినింగ్ మూవీ... కట్ చేస్తే రెండేళ్ల వరకు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్నే ఖాన్లు, కపూర్లను కూడా షేక్ చేసింది.ఆ తర్వాత రెండేళ్ళకు బాహుబలి 2 వస్తే, నార్త్ ఇండియాలో బాహుబలి తప్ప మరో పేరు వినిపించలేదు.అదో ప్రభంజనం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడెప్పడో మొగలే ఆజాం, షోలే తర్వాత జనాల్లో పూనకాలొచ్చినట్టు థియేటర్స్ ముందు క్యూకట్టింది బాహుబలి 2 కోసమే.. మరో విచిత్రం ఏంటంటే, మొగలే ఆజం, షోలే బాలీవుడ్ ని షేక్ చేయొచ్చు కాని, దేశం మొత్తం థియేటర్స్ ముందు క్యూ కట్టేలా చేసింది మాత్రం బాహుబలి2నేఅచ్చంగా నార్త్ ఇండియా, సౌత్ ఇండియా మధ్య అడ్డుగోడల్ని కూల్చేసినట్టు, వరల్డ్ మార్కెట్ కి ఇండియన్ సినిమాకు మధ్యున్న గోడల్ని కూల్చాలంటే వారణాసి వండర్ చేయాలి... ఇండియన్ సినిమా అంటే ఐదు పాటలు, రొమాన్స్ కాదు, అంతకుమించే కంటెంట్ ఉందని అందరికి అర్ధం అవ్వాలి.. అలా చేయగలిగితేనే వారణాసి వరల్డ్ సినిమాలో వెలగుతుంది.. లేదంటే,రష్యా జర్మనీ, జపాన్ లో బాహుబలి, త్రిబుల్ ఆర్ సందడి చేసినట్టు, కొంతవరకు వారణాసి హల్చల్ కనిపించే ఛాన్స్ ఉంది.