Top story: అమెరికా బెండు తీసిన ఇరాన్…ఇరాన్ దెబ్బకి అమెరికా ఇజ్రాయిల్ విలవిల…!

యుద్ధం మొదలైనప్పుడు ఇరాన్ 24 గంటల్లో ఫినిష్ అయిపోతుందని అన్నారు. తీరా చూస్తే నెలరోజులైనా, ఇరాన్ ఒక్క అడుగు కూడా వెనక్కి చేయలేదు. ఎదురుదాడి ఆపలేదు. యుద్ధంలో నుంచి ఎలా వెనక్కి వెళ్ళాలో కూడా అమెరికాకు అర్థం కావడం లేదు.

Post Published By: dialnews
Updated : 30 March 2026, 2:50 PM IST

యుద్ధం మొదలైనప్పుడు ఇరాన్ 24 గంటల్లో ఫినిష్ అయిపోతుందని అన్నారు. తీరా చూస్తే నెలరోజులైనా, ఇరాన్ ఒక్క అడుగు కూడా వెనక్కి చేయలేదు. ఎదురుదాడి ఆపలేదు. యుద్ధంలో నుంచి ఎలా వెనక్కి వెళ్ళాలో కూడా అమెరికాకు అర్థం కావడం లేదు. అడక్కపోయినా... ఐదు రోజులు ఒకసారి... విరామం ప్రకటించాడు ట్రంప్. మరోవైపు దొంగ యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఏం చేసినా.... ఇష్టం జరిగిన ఇరాన్ మాత్రం లొంగటం లేదు అమెరికాకు.పేరుకు అగ్రరాజ్యం..! ఆర్థికంగా, ఆయుధసంపత్తి పరంగా ప్రపంచంలోనే టాప్‌ కంట్రీ, అమెరికా. అత్యాధునిక యుద్ధ విమానాలు, సైనిక శక్తి, CIA లాంటి ఇంటెలిజెన్స్‌ వ్యవస్థలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా, ఎప్పుడైనా మిలటరీ ఆపరేషన్స్‌ చేయగలిగే శక్తి ఉంది. వీటిని చూసుకొనే అమెరికా పాలకులు ఎగిరెగిరిపడుతుంటారు. తమకు నచ్చని పాలకులను దింపేస్తారు. వెనెజువెలా ప్రెసిడెంట్‌ మధురోను ఎలా బంధించారో కూడా చూశాం. ఐతే ఇదంతా గతం. ఇరాన్‌తో యుద్ధం మొదలయ్యాక అమెరికా ఎంత వీక్‌ తెలిసొచ్చింది. ఇప్పుడు యుద్ధంలో ముందుకు వెళ్లలేక, బయటకు రాలేక పూర్తిగా ట్రాప్‌లో చిక్కుకుంది అమెరికా.

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై సర్‌ప్రైజ్ ఎటాక్ చేసింది అమెరికా. ఇజ్రాయెల్‌తో కలిసి ఖమేనీ కాంపాండ్‌పై మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌, అమెరికా చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో సుప్రీం లీడర్ ఖమేనీ, IRGC చీఫ్‌, ఆర్మ్‌డ్‌ ఫోర్స్ చీఫ్‌ స్టాఫ్‌, డిఫెన్స్‌ మినిస్టర్‌, ఖమేనీ సెక్యూరిటీ అడ్వైజర్ సహా 17 మంది కీలక నేతలు చనిపోయారు. ఈ దెబ్బకు ఇరాన్ కాళ్లబేరానికి వస్తుందని అంతా భావించారు. ఇరాన్ పనైపోయిందని అనుకున్నారు. రెజీమ్ ఛేంజ్‌ అవుతుందని కలలు కన్నారు. తీరా చూస్తే, ఇరాన్‌ ఊహించని షాక్ ఇచ్చింది. కన్నుకు కన్ను.. పన్నుకు పన్ను అంటారు కదా. అదే స్ట్రాటజీని ఫాలో అయ్యింది ఇరాన్‌. అమెరికాను డైరెక్టుగా కొట్టలేదు. ఇజ్రాయెల్‌పైనా దాడులు చేస్తూ సమయాన్ని, మిస్సైళ్లను వృథా చేయొద్దు అనుకుంది. తమ నొప్పిని అమెరికాకు తెలియాలంటే ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టడం మొదలు పెట్టింది ఇరాన్‌. గల్ఫ్ దేశాల్లోని యూఎస్‌ బేస్‌లను వరుసగా టార్గెట్ చేసింది. మిస్సైళ్లతో విరుచుకుపడింది. దుబాయ్‌, ఖతార్‌, కువైట్‌ ఎయిర్‌పోర్టులపైనా దాడులు చేసింది. హోటళ్లు, పోర్టులు, డేటాబేస్ సెంటర్లపైనా ఎటాక్ చేసింది ఇరాన్‌.

ఓవైపు ఇజ్రాయెల్‌, అమెరికా దాడులను ఎదుర్కొంటూనే, రోజు రోజుకు ఇరాన్ తన వ్యూహాలు మార్చుతూ వచ్చింది ఇరాన్‌. ఎక్కడబడితే అక్కడ గుడ్డిగా కొట్టలేదు. ఇష్టమొచ్చినట్లు దాడులు చేయలేదు. అసమాన యుద్ధ వ్యూహంతో ముందుకెళ్తోంది. గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను టార్గెట్ చేసి అమెరికాపై ఒత్తిడి తీసుకురావడంలో సక్సెస్‌ అయ్యింది ఇరాన్‌. ఆయిల్‌, గ్యాస్‌ కేంద్రాలపై వరుసగా దాడులు చేసింది. ఖతార్‌లోని రాస్ లఫ్పాన్‌ పైనా ఎటాక్ చేసింది. ఈ దెబ్బకు LNG ప్లాంట్ మూసివేయాల్సి వచ్చింది. దీన్ని పునరుద్దరించాలంటే మూడు నుంచి ఐదేళ్లు పడుతుంది. దీనివల్ల ఖతార్‌కు ఏడాదికి లక్షా 98 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇప్పటికే ప్రపంచ దేశాలు గ్యాస్ సంక్షోభవంలో చిక్కుకున్నాయి. ఇటు సౌదీలోని రాస్ తనురా రిఫైనరీపై దాడి చేసింది. ఈ దెబ్బకు రిఫైరీ మొత్తం షట్‌డౌన్ చేయాల్సి వచ్చింది.

ఇరాన్‌ వ్యూహాత్మకంగా హర్మూజ్‌ జలసంధిని మూసివేసి ప్రపంచాన్ని సంక్షోభవంలోకి నెట్టింది. హర్మూజ్ జలసంధి దగ్గర వందలాది కార్గో షిప్పులు చిక్కుకుపోయాయి. దాంతో ఆయిల్‌, గ్యాస్‌, ఎరువుల సరఫరా నిలిచిపోయింది. ఆసియా దేశాలతో పాటు యూరప్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. హర్మూజ్‌ జలసంధిని ఓపెన్ చేస్తానంటూ ట్రంప్‌ భారీ భారీ డైలాగులు చెప్పారు. జలసంధిని ఓపెన్ చేయడానికి రావాలని బ్రిటన్‌, చైనా, సౌత్‌కొరియా, జపాన్ దేశాలను కోరారు. అయినా ఏ ఒక్క దేశం ముందుకు రాలేదు. దాంతో మరింత రెచ్పిపోయిన ట్రంప్ ఇరాన్‌కు 48 గంటల డెడ్‌లైన్ పెట్టారు. హర్మూజ్‌ను 48 గంటల్లో ఓపెన్‌ చేయాలని, లేదంటే ఇరాన్‌లోని అతిపెద్ద పవర్‌ ప్రాజెక్టులపై దాడులు చేస్తామని హెచ్చరించారు.

అయినా ఇరాన్ బెదరలేదు. తమ దేశానికి చెందిన పవర్ ప్లాంట్‌ను టార్గెట్ చేస్తే, తాము గల్ఫ్‌ దేశాల్లోని పవర్‌ ప్లాంట్‌లతో పాటు జలశుద్ధి కేంద్రాలను ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే ఇరాన్ దాడులతో విలవిల్లాడుతున్న గల్ఫ్ దేశాలు...ట్రంప్‌పై ఒత్తిడి పెంచాయి. యుద్ధానికి త్వరగా ముగింపు పలకాలని కోరాయి. ఇరాన్‌ పవర్ ప్రాజెక్టుపై దాడి చేయొద్దని విజ్ఞప్తి చేశాయి. చేసేది ఏమీలేక దిగొచ్చిన ట్రంప్‌...48 గంటల డెడ్‌లైన్‌ను పక్కనబెట్టారు. ఇరాన్‌ ముందు 15 పాయింట్ల ప్రణాళికను పెట్టగా, దాన్ని కూడా ఇరాన్‌ లైట్ తీసుకుంది. ట్రంప్‌ ఆఫర్‌ను తిరస్కరిస్తూ...ఐదు కండీషన్లు పెట్టింది. ట్రంప్ చెప్పినప్పుడు కాదు, తాము అనుకున్నప్పుడే యుద్ధం ముగుస్తుందని తేల్చి చెప్పింది ఇరాన్‌.

ఈ 28 రోజుల్లో అమెరికా సాధించిన దానికంటే, పోగొట్టుకున్న పరువే ఎక్కువ. ఫోజులు కొట్టడం తప్ప, విషయం లేదన్నది తేలిపోయింది. అమెరికా పెట్టుకున్న టార్గెట్స్‌లో ఏదీ పూర్తికాలేదు. రెజీమ్ ఛేంజ్ కాలేదు. ఇరాన్‌ ఆర్మీ, నేవీ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ను పూర్తిగా ధ్వంసం చేయలేకపోయింది. చివరికి ఇరాన్ ఫ్రాక్సీలైనా హిజ్బొల్లా, హుతీలను కూడా బలహీనపర్చలేకపోయింది. ఖమేనీ, అలీ లారిజాని తామే చంపామని అమెరికా చెప్పుకుంటున్నా, ఆ క్రెడిట్ ఇజ్రాయెల్‌కే దక్కుతుంది. ఈ యుద్ధంలోనే అమెరికా గొప్పలు చెప్పుకుంటున్న ఫిఫ్త్ జనరేషన్‌ ఫైటర్‌ జెట్‌ F-35 సైతం ఎక్స్‌పోజ్ అయ్యింది. ఇది రాడార్‌కు చిక్కదు అని ఇన్నాళ్లు అమెరికా చేసుకున్న మార్కెటింగ్‌ ఉట్టిదేనని తేలిపోయింది. ఇరాన్‌ రాడార్లు F-35ని గుర్తించడమే కాదు, ఎటాక్ సైతం చేశాయి. యుద్ధం ఇలానే కొనసాగితే అమెరికా, అమెరికాను నమ్ముకున్నందుకు గల్ఫ్ దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

Published : 
  • 30 March 2026, 2:50 PM IST