అగ్రరాజ్యం గర్వమణిచే సమయం ఆసన్నమైందా? ఇరాన్ పొలిమేరల్లో అమెరికన్ ఆర్మీకి.. చావు వెల్కం చెప్తుందా..? అంటే అవుననే అంటున్నారు వార్ అనలిస్ట్ లు. 'వెల్కమ్ టు హెల్'.. అంటూ ఇరాన్ చేస్తోన్న గర్జన.. జస్ట్ నార్మల్ వార్నింగ్ కాదు.. అమెరికా సైనికుల పాలిట డెత్ వారెంట్.. మిడిల్ ఈస్ట్ లో అడుగుపెట్టిన ప్రతి అమెరికా సైనికుడికి ఇరాన్ సైన్యం ఇస్తున్న స్ట్రాంగ్ మెసేజ్ ఇది. ప్రపంచాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలనుకునే అమెరికాకు, ఇరాన్ తన అసలైన విశ్వరూపాన్ని చూపించబోతోంది. అగ్రరాజ్యం తన శవపేటికలను తానే తెచ్చుకుంటోందా? ఇరాన్ ఎందుకు ఇంత ధీమాగా ఉంది? ఈ యుద్ధం ప్రపంచ గమనాన్ని ఎలా మార్చబోతోంది?
అమెరికాకు చరిత్ర అంటే భయం.. ఎందుకంటే ఆ చరిత్రలో గెలుపు కంటే అవమానాలే ఎక్కువ.. 1970ల్లో వియత్నాం చిన్న దేశమే కావచ్చు, కానీ అమెరికాను ముప్పుతిప్పలు పెట్టి పంపించింది. మొన్నటికి మొన్న 20 ఏళ్ల పాటు అఫ్గానిస్తాన్‌లో వేల కోట్ల డాలర్లు ఖర్చు చేసి, చివరకు తాలిబన్ల దెబ్బకు రాత్రికి రాత్రే దొంగలా పారిపోయింది. ఆ పరుగులో తన సొంత ఆయుధాలను, హెలికాప్టర్లను కూడా వదిలేసి వెళ్ళిన 'పిరికి చరిత్ర' అమెరికాది. ఇప్పుడు ఇరాన్ జోలికి రావడం అంటే.. అది ఆత్మహత్యా సదృశ్యమే. ఇరాన్ అంటే ఇరాక్ లాంటి బలహీనమైన దేశం కాదు.
ఇది టెక్నాలజీ, తెగువ రెండూ ఉన్న గడ్డ. అమెరికా చేసే ప్రతి తప్పుకు ఈసారి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటివరకు కేవలం క్షిపణులు, డ్రోన్లతో జరిగిన యుద్ధం.. ఇప్పుడు అసలైన గ్రౌండ్ వార్ గా మారుతోంది. అగ్రరాజ్యం అమెరికా తన వేల మంది సైనికులను, మెరైన్లను ఇరాన్ సరిహద్దులకు పంపిస్తోంది. అగ్రరాజ్యం చేస్తున్న ఈ సాహసం వారి పతనానికి నాంది కాబోతోందా? ఇరాన్ దగ్గర ఉన్న ఆ రహస్య ఆయుధాలేంటి? గత కొన్ని రోజులుగా ఇరాన్ తన క్షిపణి శక్తితో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.
అమెరికా రక్షణ కవచాలను చేధించుకుంటూ ఇరాన్ మిస్సైల్స్ లక్ష్యాలను తుత్తునియలు చేస్తున్నాయి. అమెరికా దగ్గర ఎన్ని యాంటీ-మిస్సైల్ సిస్టమ్స్ ఉన్నా.. ఇరాన్ పంపుతున్న డ్రోన్ల సమూహాలు వాటిని గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ తన అండర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీస్ నుంచి దాడులు చేస్తూ అమెరికా స్థావరాలను వణికిస్తోంది. ఆకాశం నుంచి పడుతున్న మృత్యువును ఆపలేక అమెరికా ఇప్పుడు తన సైన్యాన్ని నేరుగా రంగంలోకి దించుతోంది. అంటే ఆకాశంలో ఓడిపోయి, ఇప్పుడు నేలపై అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది.
అమెరికా సైన్యం గ్రౌండ్ వార్ కు వస్తామంటోంది.. కానీ ఇరాన్ భూభాగం ఎలాంటిదో వారికి తెలుసా? అనేదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఇరాన్ అంటే కేవలం ఇసుక ఎడారి కాదు.. అది ఒక సహజ సిద్ధమైన కోట. ఇరాన్ చుట్టూ ఉన్న జాగ్రోస్ పర్వత శ్రేణులు అమెరికా ట్యాంకులకు, భారీ వాహనాలకు ఒక నరకం చూపించబోతున్నాయి. వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ పర్వతాల్లో.. ఇరాన్ సైన్యం ఇప్పటికే అత్యాధునిక క్షిపణి కేంద్రాలను, స్నిపర్ పాయింట్లను ఏర్పాటు చేసుకుంది. అమెరికా సైనికులు ఒక్క అడుగు ముందుకు వేయాలంటే.. ప్రతి కొండ నుంచి మృత్యువు వారిని వెంటాడుతుంది.
వియత్నాం అడవుల్లో అమెరికాకు చెమటలు పట్టిస్తే.. ఇరాన్ పర్వతాల్లో వారికి రక్తపాతం ఖాయం. ఇక ఇరాన్ తీరప్రాంతం చూస్తే.. పర్షియన్ గల్ఫ్ అంతా ఇరుకైన జలసంధులతో నిండి ఉంది. అక్కడ అమెరికా భారీ యుద్ధ నౌకలు కదలడమే కష్టం. కానీ ఇరాన్ దగ్గర ఉన్న వేల సంఖ్యలో చిన్న చిన్న 'స్పీడ్ బోట్స్' మౌనంగా వచ్చి అమెరికా నౌకలను సముద్ర గర్భంలో కలిపేస్తాయి. 'మా గడ్డ మీదకు రండి.. కానీ ఇక్కడి మట్టి మిమ్మల్ని తిరిగి వెళ్లనివ్వదు' అని ఇరాన్ కమాండర్లు గర్జిస్తున్నారు. అంటే, అమెరికా సైన్యం ఇరాన్ లో అడుగుపెట్టడం అంటే.. తమంతట తామే ఒక నేచురల్ ట్రాప్ లో చిక్కుకోవడమే.
ఇరాన్ భౌగోళిక స్థితి అమెరికా టెక్నాలజీని కూడా వెక్కిరిస్తుంది. ఇక్కడ సాటిలైట్లు పనిచేయవు, రాడార్లకు సిగ్నల్స్ అందవు.. కేవలం ఇరాన్ సైన్యం గర్జన మాత్రమే వినిపిస్తుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం.. అమెరికా తన అత్యంత శక్తివంతమైన 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్ మరియు మెరైన్లను మిడిల్ ఈస్ట్‌కు తరలిస్తోంది. సుమారు 10,000 మంది అదనపు సైనికులను పంపడానికి పెంటగాన్ ప్లాన్ చేస్తోంది. కానీ ఇరాన్ దీన్ని ఒక అవకాశంగా చూస్తోంది. 'మా గడ్డపైకి వస్తే మీరు ఈజీ టార్గెట్స్ అవుతారు' అని ఇరాన్ సైనిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వియత్నాం అడవుల్లో, అఫ్గానిస్తాన్ పర్వతాల్లో తన్నులు తిన్న అమెరికాకు.. ఇప్పుడు ఇరాన్ ఎడారి ఇసుక తిన్నెలే సమాధులు కాబోతున్నాయి. ఇరాన్ దగ్గర ఉన్న 'రెసిస్టెన్స్ గ్రూపులు' ప్రతి గల్లీలో అమెరికా సైన్యాన్ని వేటాడటానికి సిద్ధంగా ఉన్నాయి. అమెరికా సైనికులు జీతం కోసం యుద్ధం చేస్తారు.. కానీ ఇరాన్ సైనికులు దేశం కోసం ప్రాణాలిస్తారు. ఇరాన్ తన 'టెహ్రాన్ టైమ్స్' పత్రిక మొదటి పేజీలోనే 'WELCOME TO HELL' అని వేసి అమెరికా అహంకారాన్ని దెబ్బకొట్టింది. 'మీరు ఆయుధాలతో రండి.. మేము ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటాం' అన్నదే ఇరాన్ సందేశం.
అమెరికా పంపే ట్యాంకులు, హెలికాప్టర్లు ఇరాన్ గడ్డపై తుప్పు పట్టడం ఖాయం. ఒక చిన్న దేశం అగ్రరాజ్యాన్ని గడగడలాడిస్తుంటే, ప్రపంచమంతా ఆశ్చర్యంగా చూస్తోంది. ఇది ఇరాన్ సత్తా. అమెరికా తన తప్పులను సరిదిద్దుకోకుండా మరోసారి యుద్ధంలోకి దూకుతోంది. కానీ ఈసారి వారు తలపడేది తాము తక్కువ అంచనా వేసి.. చావుదెబ్బ తిన్న ఇస్లామిక్ రిపబ్లిక్ తో. ఇరాన్ గడ్డపై అమెరికా అడుగుపెట్టిన రోజు.. అది ఒక కొత్త ప్రపంచ చరిత్రకు ఆరంభం అవుతుందనే మాట వినపడుతోంది. ఆ చరిత్రలో అమెరికా పతనం స్పష్టంగా కనిపిస్తోంది.