బతికున్నంత కాలం మహారాణిలా గడిపింది. నిత్యం రాజకీయ వ్యూహాలు, ఎత్తు గడలు, పగ ప్రతీకారాలు, గెలుపు ఓటములు, పంతాలు... శపదాలు.... అవినీతి , అక్రమార్చన ఇవే జీవితముగా గడిపింది. చివరికి అనారోగ్యంతో... కొట్టుమిట్టాడుతూ..... కన్ను మూసింది . తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, పురచ్చి తలైవి జయలలిత జీవితంలో మెరుపులు మరకలు అవి. హైదరాబాదులో కొన్నేళ్లుగా పన్ను కట్టకపోవడంతో జయలలిత ఇంటిని జిహెచ్ఎంసి జప్తు చేసింది. జయలలిత వారసులు ఎవరు ఆ ఇంటిని పట్టించుకోకపోవడంతో, ప్రభుత్వం జప్తు చేయాల్సి వచ్చింది. జయలలిత కి హైదరాబాదులో ఇల్లు ఉందా? చాలామంది ఆశ్చర్యపోయారు. జయ కి చెన్నై, బెంగళూరులో మాత్రమే కాదు హైదరాబాద్ తో పాటు పలుచోట్ల ఆస్తులున్నాయి. సినిమా హీరోయిన్గా.... పొలిటికల్ లీడర్ గా.... సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా జయ సంపాదించిన అపారమైన ఆస్తులు ఇప్పుడు ఎవరెవరో అనుభవిస్తున్నారు. నా అనే వాళ్ళు లేకుండా చచ్చిపోయిన పురచి తలైవి ఎవరికోసం ఈ ఆస్తులు సంపాదించింది? ఎందుకోసం సంపాదించింది? చివరికి ఏం తీసుకెళ్లింది? ఏం సాధించింది?
650 చెప్పుల జతలు, వందలాది పట్టు చీరలు, కిలోల కొద్ది బంగారం, డైమండ్స్... బెంగళూరులో, చెన్నై హైదరాబాదులో, ఊటీలో ఫామ్ హౌస్ లు, చెన్నై పోఎస్ గార్డెన్లో పెద్ద బంగ్లా, ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియని ఆస్తులు..జయ టి వి లో పెట్టుబడులు....... ఇవన్నీ జయలలిత అపారంగా కూడబెట్టిన సంపదలు. స్టార్ హీరోయిన్గా, అన్నా డీఎంకే అధినేతగా, ముఖ్యమంత్రిగా.... జయలలిత కూడబెట్టిన ఆస్తులు ఇవి. వివాహం లేదు.... పిల్లలు లేరు, ఎవరితోనూ సఖ్యత లేదు.... దీంతో జయలలిత చివరి రోజులు చాలా దారుణంగా గడిచాయి. జయ స్నేహితురాలు శశికళ చేతుల్లో ఆమె చిక్కుకుపోయింది. శశికళ మేనల్లుడు సుధా కరణ్ కొన్నాళ్లపాటు జయకి పెంపుడు కొడుకు గా ఉన్నాడు. ఆ సమయంలోనే వేలకోట్లు దోచేశాడు సుధాకరం. ఇక శశికళ దోపిడీకి అంతే లేదు. జయ అవినీతి సొమ్ములో... శశికళదే వాటా ఎక్కువ. అసలు జయ లలితకి తన ఆస్తులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు.
ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు జయ ఆస్తికి వారసులమని కోర్టులకు ఎక్కి కొంత ఆస్తిని మాత్రమే దక్కించుకోగలిగారు. అంతకుముందే శశికళ జయ ఆస్తుల్లో చాలా వాటిని సద్దేసింది. మరికొంత ,మాజీ ముఖ్యమంత్రి అన్న డీఎంకే మాజీ నేత పన్నీర్ సెల్వం నొక్కేశాడు. హైదరాబాదులో మేడ్చల్ దగ్గర జయకు పెద్ద బంగ్లా, ద్రాక్షతోట తోపాటు ఫామ్ హౌస్ ఉండేవి. వాటిలో కొంత భాగాన్ని ఆ ఏరియా కి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి కబ్జా పెట్టేసాడని... సమాచారం. ఇలా ఒకటి కాదు.... జయ లలిత కూడబెట్టిన ఆస్తులన్నీ రాజుల సొమ్ము రాళ్ల పాలులా ఎవరెవరో దోచేశారు.
బెంగళూరులో ఆస్తులన్నీ బినామీలు దోచుకున్నారు.అన్నా డీఎంకే సీనియర్ నేతలు దగ్గర దాచిన, బంగారం క్యాష్ వాళ్ల దగ్గరే ఉండి పోయాట. తాన్సీ భూములు కేసు, జయ టీవీ కేసు, అక్రమార్జన కేసు ఇల ఎన్నో జైలుకి ఉన్నాయి. వాటిలో శిక్ష తప్పించుకున్న.... మరణాన్ని మాత్రం తప్పించుకోలేకపోయింది జయ. చివరి రోజుల్లో సెలైన్ వాటర్ పైనే బతికింది. అహంకారమే నాయకత్వ లక్షణంగా బతికిన జయ ఆస్తులు ఇప్పుడు ఎవరెవరో అనుభవిస్తున్నారు. ఇంకొన్ని పట్టించుకునే వారు లేక అలా పడి ఉన్నాయి. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ లో ఉన్నఇల్లు చివరికి జిహెచ్ఎంసి జప్తులోకి వెళ్లిపోయింది. సంపాదన పిచ్చిలో.... మనుషుల్ని కాకుండా కేవలం ఆస్తులు మాత్రమే ప్రేమించే వాళ్ళు జయ జీవితాన్ని చూసి... చివరికి ఏం మిగులుతుందో అర్థం చేసుకోవాలి. ఎంత సంపాదించినా.... ఏం చేసినా చివరికి ఏమీ మిగల దనే నిజాన్ని తెలుసుకోవాలి.