సమంత ఇక హీరోల పక్కన కనిపించదేమో? అసలు ఆమెకు హీరోనే అవసరం లేదా?సామ్‌లోని చిలిపితనం.. కొంటెతనం మున్ముందు చూడలేమా? సమంత సినిమా అంటే కష్టాలు..బాధలేనా?సీరియస్ రోల్స్ మాత్రమే చేస్తూ.. సమంత మెచ్యూర్డ్ ఫెమినిస్ట్ అనిపించుకోవాలనుకుంటోందా?
నమంతలో ఈ మార్పుకు కారణం ఏంటి?సమంతను చూస్తుంటే.. ఎందుకిలా మారి పోయింది? లేడీ ఓరియెంటెడ్ హీరోయిన్ అనిపించుకుంటే చాలదు. అంతకు మించి ఫెమినిస్ట్ హీరోయిన్ ముద్రను బలంగా కోరుకుంటోంది. స్టెప్పులు డాన్సులు వేసే హీరోయిన్ గా కాకుండా అవినీతి చెందిన చూడాలని కోరుతుంది సమంత. పూలు..పండ్లు పట్టుకున్న చేతులతో కత్తులు.. గన్స్ పట్టుకుంటూ యాక్షన్ బరిలోకి దిగిపోయింది.
నాగచైతన్యతో పెళ్లి తర్వాత స్టార్ హీరోలు సమంత వైపు చూడడం మానేశారు. వాళ్లే కాదు.. యంగ్ హీరోలు సైతం సామ్‌తో జత కట్టడానికి ఇంట్రస్ట్ చూపించలేదు. దీంతో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ వైపు 'యూటర్న్' తీసుకోవాల్సి వచ్చింది. ఓ బేబి సినిమాతో మరో హిట్ పడగానే.. లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కు కేరాఫ్ అడ్రెస్ తనేనని గట్టిగా నమ్మి.. యశోద.. శాకుంతలంలో నటించింది. యశోద ఏవరేజ్‌గా ఆడితే.. శాకుంతలం ధమాల్ అనడంతో నిర్మాతలు భారీగా నష్టపోయారు.శాకుంతలం డిజాస్టర్‌తో సమంతకు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా రావడం మానేశాయి. 'ఖుషీ'లో విజయ్ దేవరకొండతో నటించే ఛాన్స్ వచ్చినా.. అరుదైన వ్యాధి మయో మైటిస్ రావడంతో.. షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. ఎట్టకేలకు ఖుషీ పూర్తి చేసినా..ఫ్లాప్ కావడంతో తెలుగు ఇండస్ట్రీని సమంతను పూర్తిగా మర్చిపోయింది.
లేడీ ఓరియెంటెడ్ మూవీస్ మూడ్నాళ్ల ముచ్చటగా మిగిపోయాయి. ఫేస్‌లో మాయ చేసే చరిష్మా తగ్గడంతో.. హీరోలు పట్టించుకోవడం మానేశారు. యాడ్స్ ప్రమోషన్స్... వర్కవుట్స్ అంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుందేగానీ..ఫామ్‌లోకి రాలేకపోయింది. బిగ్‌స్క్రీన్ మీద కనిపించడంలేదన్న బాధను తీర్చుకోవడానికి 'శుభం'తో ప్రొడ్యూసర్ అవతారం ఎత్తి గెస్ట్ అపీరియన్స్ ఇచ్చింది. నిర్మాతగా తొలి అడుగు సక్సెస్ కావడంతో.. 'మా ఇంటి బంగారం'లో నటిస్తూ.. నిర్మిస్తోంది సమంత.సమంత స్టార్ పక్కన నటించి పదేళ్లయింది. రంగస్థలం తర్వాత స్టార్స్‌తో జత కట్టలేదు. ఛాన్సులివ్వని హీరోలను పక్కన పెట్టి తనే హీరోగా మారి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేసింది. యూటర్న్.. ఓ బేబి...యశోద.. శాకుంతలం...లేటెస్ట్‌గా 'మా ఇంటి బంగారం' అంటూ ఫెమినిస్ట్ ఓరియెంటెడ్ మాత్రమే చేస్తోంది సామ్. తనొక స్త్రీ పక్షపాతి అని అందరూ అనుకునేలా అలాంటి కథలనే ఎంచుకుంటోంది. అందుకు ఆమె రాజా భర్త రాజ్ డీకే కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు.
ఆన్ స్క్రీన్ అయినా.. ఆఫ్ స్క్రీన్ అయినా.. మెచ్యూర్డ్ ఫెమినిస్ట్ అనిపించుకునే ప్రయత్నం చేస్తోంది సామ్. ఆమధ్య హాలీవుడ్ రిపోర్టర్ నిర్వహించిన 'ఉమెన్ ఇన్ ఎంటర్‌టైన్‌మెంట్' ఈవెంట్‌లో పాల్గొన్న సామ్ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించింది. పురుషులతో పోలిస్తే.. మహిళలే ఎక్కువసార్లు 'సారీ' చెబుతున్నారని.. ఇది వారి ఆత్మవిశ్వాసం తగ్గిపోవడానికి కారణమని పేర్కొంది సమంత. ప్రతి చిన్న విషయానికీ సారీ చెప్పాల్సిన పని లేదని ఇకనైనా మహిళలు ఈ అలవాటును మార్చుకోవాలని సూచించింది.సమంత ప్రస్తుతం ఏ సినిమా చేసినా కథ తన చుట్టూ తిరిగేలా వుండాలి. క్యారెక్టర్ మెచ్యూర్డ్ ఫెమినిస్ట్‌గా వుంటేనే సినిమా ఓకె చేస్తుంది. పుష్పలో 'ఊ అంటావా మావా' ఐటంసాంగ్ చేసినా.. థీమ్ నచ్చి చేశానని చెప్పింది సామ్. సమంత సినిమాలు చూస్తుంటే... అప్పులు పాటలు ఇక కనిపించని, ఆమె పక్కన హీరోలు ఉండరని, కేవలం లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి సమంత పరిమితం అయిపోతుంది అని క్లారిటీ వచ్చేసింది.