గైడ్ లు, ట్రెక్కింగ్ సంస్థలు, హెలికాప్టర్ ఆపరేటర్లు, హాస్పిటల్ సిబ్బంది ముఠాగా ఏర్పడి విదేశీ పర్వతారోహకులను మోసం చేసి 200 కోట్ల రూపాయలు కొట్టేశారు.ఎవరెస్ట్ సాక్షిగా జరిగిన బిగ్ స్కామ్ ఇది. ట్రెక్కర్సే టార్గెట్‌గా మాఫియా రెచ్చిపోతోంది. విదేశీ పర్వతారోహులకు ఇచ్చే ఆహారంలో కావాలని బేకింగ్ సోడా మోతాదుని మించి కలిపి అస్వస్థతకు గురయ్యేటట్లు చేస్తారు. సోడా ఎక్కువగా తీసుకోవడంతో జీర్ణ కోశ సమస్యలు మొదలవుతాయి. అయితే ఎత్తు కారణంగానే అనారోగ్యం వచ్చిందని టూరిస్టులను, గైడ్లు నమ్మించి హెలికాప్టర్లను రప్పిస్తారు. అప్పటికే భయంతో ఉన్న పర్వతారోహకులు అడిగినంత డబ్బు ఇచ్చి హెలికాప్టర్లో వచ్చి హాస్పటల్లో జాయిన్ అవుతారు. వైద్యం చేసి వాళ్లను పంపించేస్తారు. ఆ తర్వాత నకిలీ వైద్య పత్రాలు, తప్పుడు రిపోర్టులు, తారుమారు చేసిన ఫ్లైట్ డాక్యుమెంట్ లతో అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి డబ్బులు క్లెయిమ్ చేస్తారు. అలా విదేశీ టూరిస్ట్ ల నుంచి 200 కోట్లకు పైగా కొట్టేసింది ఎవరెస్ట్ మాఫియా టీం. ఇప్పుడు నేపాల్ ఇండియాలో చలనం రేపుతున్న స్కామ్ ఇది.
మౌంట్ ఎవరెస్ట్.ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం.దీన్ని అధిరోహించాలనేది ఎంతోమంది టూరిస్టుల కల.ఇలా వచ్చేవాళ్లతో కొందరి జీవితాలతో గైడ్లు, హెలికాప్టర్ సంస్థలు కలిసి ఆటలాడుతున్నారు.పర్యాటకులకు తినే ఆహారంలో బేకింగ్ సోడా కలిపి, ఆపై అత్యవసర రెస్క్యూ పేరుతో డబ్బులు గుంజేస్తున్నారు.20 మిలియన్ డాలర్లు, అంటే సుమారు 200 కోట్లు ఇన్సూరెన్స్ స్కామ్ చేసింది ఈ ముఠా
నేపాల్‌లో ట్రెకింగ్ చేసే పర్యాటకుల భోజనంలో గైడ్లు ముందుగానే బేకింగ్ సోడా ఎక్కువగా కలుపుతున్నారు. దీంతో వారిలో జీర్ణకోశ సమస్యలు తలెత్తతున్నాయి. ఆ సమయంలో పర్వతం ఎత్తు కారణంగానే ఇలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయని ట్రెక్కర్లను నమ్మిస్తుంటారు. వారి భయాన్ని సొమ్ము చేసుకోవడం మొదలుపెడతారు. వారిని అత్యవసరంగా ఆసుపత్రులకు తరలించేందుకు హెలికాప్టర్లను రప్పిస్తారు. ఎంత డబ్బు అయినా చెల్లించేలా అప్పటికే బాధితులను ఒప్పిస్తారు.
ఈ కుట్రలో ట్రెకింగ్ ఏజెన్సీలు, హెలికాప్టర్ ఆపరేటర్లు, ఆస్పత్రులు ఒక మాఫియాగా ఏర్పడ్డాయి. టూరిస్టులకు చికిత్స చేసినట్లు దొంగ పత్రాలు సృష్టించి, అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి కేటుగాళ్లు కోట్లాది రూపాయలు క్లెయిమ్ చేశారు.వచ్చిన సొమ్మును గైడ్లు, హెలికాప్టర్ కంపెనీలు, ట్రెక్కింగ్ ఏజెన్సీలు, నకిలీ పత్రాలు ఇచ్చిన ఆసుపత్రులు పంచుకుంటున్నాయని దర్యాప్తులో తేలింది. ఎవరెస్ట్ మాఫియా కేసులో నేపాల్ పోలీసులు ఇప్పటివరకు 32 మందిపై కేసులు బుక్ చేశారు. వీరిలో హెలికాప్టర్ కంపెనీ యజమానులు, ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఉన్నారు. నిందితుల నుంచి 11.3 మిలియన్ డాలర్ల జరిమానా వసూలు చేయాలని ప్రాసిక్యూటర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
నేపాల్ టూరిజంలో ఇలాంటి స్కామ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి.దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ బీమా సంస్థలు నేపాల్ ట్రెక్కర్లకు కవరేజీ ఇవ్వడం ఆపేశాయి.
బేకింగ్ సోడా స్కాంపై అంతర్జాతీయంగా ఎప్పుడు చాలా పెద్ద చర్చ జరుగుతుంది. విదేశీ టూరిస్టులను... చిన్న చిన్న మోసాలు చేయడం అన్నిచోట్ల జరుగుతూనే ఉంటుంది. కానీ ఇలా ఏకంగా వాళ్లు తినే ఆహారంలో బేకింగ్ సోడా కలిపి, కడుపునొప్పి రప్పించి... ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేసి ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేయడం అనేది జరగడం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ ఇన్సూరెన్స్ సంస్థలన్నీ
ఈ స్కాంపై గట్టిగానే దృష్టిపెట్టాయి.