అదే జరిగితే.. రోమాలు నిక్కబొడుస్తాయ్…!

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ఇంటర్వెల్ బ్యాంగ్ లో సైన్యాధిపతిగా ప్రమాణం చేస్తే, థియేటర్ దద్దరిల్లింది... మిర్చీలో తాటి చెట్ల మద్య మగతనం చూపించమంటే, చేసిన ఫైట్ బాక్సాఫీస్ మీద మాస్ బుల్లెట్లను దింపింది.. ఛత్రపతితో కత్తితో విలన్ ని గాల్లో లేపే సీన్ కి మాస్ ఆడియన్స్

Post Published By: dialnews
Updated : 10 April 2026, 6:20 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ఇంటర్వెల్ బ్యాంగ్ లో సైన్యాధిపతిగా ప్రమాణం చేస్తే, థియేటర్ దద్దరిల్లింది... మిర్చీలో తాటి చెట్ల మద్య మగతనం చూపించమంటే, చేసిన ఫైట్ బాక్సాఫీస్ మీద మాస్ బుల్లెట్లను దింపింది.. ఛత్రపతితో కత్తితో విలన్ ని గాల్లో లేపే సీన్ కి మాస్ ఆడియన్స్ కి రోమాలు నిక్కబొడిచాయి.. ఇది రెబల్స్ స్టార్ ప్రభాస్ రేంజ్ కి పడాల్సిన సీన్లు.. ఎలివేషన్లు.. ఆఖరికి డార్లింగ్ మూవీలొ ఐస్ బ్రేకింగ్ సీన్ ని కూడా ఒక్కాసారిగా కామెడీ మూవీని కాస్త, మాస్ యాక్సన్ డ్రామానేమో అనుకునేలా చేశాడు. అంతటి ఎనర్జీ ఉన్న ప్రబాస్ ని బాహుబలి 2 తర్వాత ఎవరూ సరిగా వాడలేదనే కంప్లైంట్ ఉంది. సలార్ హిట్టవ్వొచ్చు.. 800 కోట్లు రావొచ్చు.. కల్కీ 1200 కోట్ల హిట్ కావొచ్చు.. కాని అందులో ప్రభాస్ ని పది శాతం కూడా సరిగా వాడలేదు... అయినా వసూళ్ల వరదొచ్చింది.. నిజంగా రెబల్ స్టార్ లో మాస్ ఎమోషన్ ని పట్టుకుంటే, పాన్ ఇండియా పానిక్ అవుతుందనేంత అంచనాలున్నాయి..అందుకే ఒకప్పటి ప్రభాస్ నిసందీప్ రెడ్డి మనముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడా? దానికి ధురందర్ 2 సినిమా ఇద్దరు కలిసిచూడటానికి మైండ్ బ్లాంక్ అయ్యే కనెక్షన్ ఉందా?

ధురందర్ 2 ని సందీప్ రెడ్డి తో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ కలిసి చూశాడు.. ఇదే ఇప్పుడు నేషనల్ లెవల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరు కలిసి సినిమా తీస్తున్నారంటేనే, అదో సెన్సేషనల్ కాంబినేషన్. అలాంటి ఈ ఇద్దరు కలిసి 1500 కోట్లు రాబట్టిన ధురందర్ 2 మూవీని చూస్తున్నారంటే, ఏదో టైంపాస్ కాదు.. అంతగా చూడాలంటే ఇంట్లో క్యూబ్ సాయంతో హోమ్ థియేటర్స్ లోనే చూడొచ్చు..కాని ఇక్కడ ఈ కాంబో ఏదో మెసేజ్ ఇస్తోంది..రెబల్ ఫ్యాన్స్ కి ఎప్పటి నుంచో ఉన్న కల నెరవేరబోతోందన్న మెసేజే థియేటర్స్ నుంచి సందీప్ రెడ్డి వంగ ఇస్తున్నాడా? ఏదో కలిసి ఇద్దరు ఒక హిట్ మూవీ చూసినంత మాత్రాన, అదో వైరల్ వార్త అవ్వాలా? ఔను డెఫినెట్ గా అది వార్తే.. ఇంతకాలం ప్రభాస్ రేంజ్ కి తగ్గ మూవీ పడలేదన్న వెలితి ఎప్పుడూ కనిపిస్తూనే ఉండేది.. సలార్, కల్కీ హిట్టవ్వొచ్చు..కాని ప్రభాస్ ఒరిజినల్ పవర్ ని అవి చూపించలేదనే అభిప్రాయముంది.

సలార్ లో ఒకటీ రెండు అద్బుతమైన సీన్లు, కల్కీలో కర్ణుడి సీన్ తో పాటు, క్లైమాక్స్ సీను.. ఆమాత్రానికే వెయ్యికోట్ల రేంజ్ వచ్చేసింది.. అలాంటిది ఒక్కసారి ప్రభాస్ ని ఛత్రపతి రేంజ్ లో చూపిస్తే ఎలా ఉంటుంది.. బాహుబలి రేంజ్ మళ్లీ ఎప్పుడు పడుతుంది. మిర్చీ లాంటి ఊర మాస్ ఎమోషన్స్ ఎప్పుడు కనిపిస్తాయి.. ఇలాంటి ఎదురుచూపులతో ఆకలి మీదున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందుకే, వాళ్ల ఆకలి తీర్చే టైం వచ్చిందని స్పిరిట్ టీం చెప్పకనే చెబుతోంది.యానిమల్ మూవీతో పోలిస్తే దురందర్ లో వయోలెన్స్ తక్కువే.. అలాంటి దర్శకుడే ధురందర్ 2 చూడ్డానికి ప్రభాస్ తో వచ్చాడంటే, అదో మెసేజ్.. రోమాలు నిక్కబొడిచేలా ఇస్తున్న మెసేజ్.

ఇంట్లో ఉండే పర్సనల్ థియేటర్ ని కాదని, పబ్లిక్ లో ఈమూవీ చూడటంలోనే, ఇంతకుమించే వయోలెన్స్ ని చూపించేందుకు, ఒకప్పటి ప్రభాస్ ని మీముందుకు తీసుకొస్తున్నామన్న మెసేజ్ ఇస్తోంది స్పిరిట్ టీం. అంతేకాదు, స్పిరిట్ షూటింగ్ మరే మూవీ షూటింగ్ వల్ల ఎఫెక్ట్ కాదనే మెసేజ్ కూడా ఇస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ.అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు తన మేకింగ్ లో ఉండే ఇంటెన్సిటీ మీద ఎవరికీ అనుమానం లేదు. కాని ఒకప్పటి ప్రభాస్, వర్షం లెవల్లో, చత్ర పతి లెవల్లో సందీప్ చూపిస్తే చూడాలనే కోరికతో ఆకలిమీదున్నారు రెబల్ ఫ్యాన్స్..ఆ ఆకలికి సమాధానమే ధురందర్ 2 థియేటర్స్ లో సందీప్, ప్రభాస్ సిట్టింగ్ అంటున్నారు. నిజంగా ఓ టీజర్ వదిలినా రాని కిక్ ని , సందీప్ ఇలా పరోక్షంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇస్తున్నాడు.. వస్తున్నాం, గట్టిగా కొట్టబోతున్నాం అని ఇండైరెక్ట్ గా తేల్చాడు.. ఇది ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కిరికీ అర్ధమైంది... అందుకే నేషనల్ మీడియా కూడా వీళ్లు థియేటర్స్ లో కనిపించిన విజువల్స్ తో, వార్తలు వైరల్ చేస్తోంది.

Published : 
  • 10 April 2026, 6:20 PM IST