మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మీద రూమర్లు ఎలా ఉన్నా, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లో భారీ మార్పు, భారీ కదలిక వచ్చింది. ఫైనల్ స్క్రీప్ట్ కి ఎన్టీఆర్ ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే కాదు, మాటల మాంత్రికుడితో కనీసం 3 గంటలు చర్చించాడు. అంటే వివాదాలన్నీ పోయి, అంతా ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఆల్రెడీ ఇది లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి ని బేస్ చేసుకుని రాసుకున్న మైథాలజీ డ్రామా అని ముందు నుంచే ప్రచారం జరుగుతోంది. ఇదే కథతో తెలుగు,తమిల్, మలయాళ, కన్నడ భాషల్లో 6 సినిమాలొస్తున్నాయన్న వార్తలు వైరలయ్యాయి. ఇలాంటి టైంలో గాడ్ ఆఫ్ వార్ థీమ్ స్టోరీ అదే అయినా, అసలు కథ మతిపోగొడుతుందని తెలుస్తోంది. అది నచ్చే అల్లు అర్జున్ మాటల మాంత్రికుడి వెంటపడ్డాడని అంటున్నారు.. ఇంతకి గాడ్ ఆఫ్ వార్ స్టోరీలైన్ ఏంటి? దాన్ని మాడ్రనైజ్ చేసి ఎలాంటి మైథాలజీ డ్రామాని త్రివిక్రమ్ రెడీ చేస్తున్నాడు.. ? ఏదో గాసిప్ కాదు.. రూమర్ అసలే కాదు.. ఇండస్ట్రీ సర్కిల్ లో వినిపిస్తున్న గాడ్ ఆఫ్ వార్ బేసిక్ స్టోరీలైన్ నిజంగా మతిపోగొడుతోంది.. ఇది లీకైనా, గాడ్ ఆఫ్ వార్ లక్ మారదనే త్రివిక్రమ్ ధీమా వెనకున్న కారణం ఏంటో మీకోసం..
సీనియర్ ఎన్టీఆర్ అనగానే ఎవరికైనా రాముడు గుర్తుకొస్తాడు.. రావణుడు గుర్తుకొస్తాడు.. లేదంటే కృష్ణడు గుర్తొస్తాడు.. కర్ణుడై కదిలిస్తాడు.. ఓరకంగా దేవుడంటే ఎన్టీఆరే గుర్తుకొచ్చేలా తను ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు.. ఇప్పడు తాతకు తగ్గ మనవడనిపించుకోవాలంటే ఎన్టీఆర్ ఏం చేయాలి... ఇప్పుడు ఒకే ఒక్క సినిమాతో ఎన్టీఆర్ జూనియర్ అంటే మురుగనే గుర్తుకొస్తాడా? లార్డ్ సుబ్రహ్మణ్యాన్ని ఎన్టీఆర్ లో చూసుకునే రోజొస్తుందా?తాతకు తగ్గ మనవడనిపించుకునేందుకు ఎన్టీఆర్ చేయని ప్రయత్నం లేదు. తాతలానే యమగోల స్టైల్లో యమదొంగగా మారాడు. యముడిగా మారాడు.. కట్ చేస్తే బాలరామయణం రాముడిగా కదిలించాడు. జైలవకుశలో మాడ్రన్ రావణుడిగా వనికించాడు.. కాని నిజం చెప్పలాంటే, ఆ పాత్రలన్నీ సీనియర్ ఎన్టీఆర్ చేసినవే.. కాబట్టి తాత దారిలో నడిచిన మనవడిగా ఈ మూవీలతోపేరొచ్చింది.. కాని తన పేరుచెబితే, ఫలానా దేవుడి పాత్ర గుర్తొచ్చేంత సాలిడ్ పాత్ర మాత్రం తనకి పడలేదు.
అందుకే మురుగన్ గా మారుతున్నాడు. లార్డ్ సుబ్రహ్మణ్యన్ అంటే ఎన్టీఆర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే కార్తికేయుడే గుర్తుకురావాలి.. అప్పుడు ఎందుకు అరవ జనం తన సినిమా చూడరో.. ఎందుకు తెలుగు సినిమాను ఆదరించరో చూద్దం.. ఇది గాడ్ ఆఫ్ వార్ టీం కాన్ఫిడెన్స్.. కథేం కొత్తది కాదు..అందరికి అందు భాటులో ఉన్న స్టోరీలైనే.. అసలు లార్డ్ సుబ్రహ్మణ్యం జన్మకి కారణమేంటి అనేదే బేసిక్ స్టోరీలైన్.ముందు ఆ స్టోరీలైన్ క్లుప్తంగా తెలుసుకుంటే, ఇదెలా గాడ్ ఆఫ్ వార్ గా మారబోతుందే ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ఉంది. పురణాల ప్రకారం తారకా సురుడనే రాక్షసుడిని చంపే శక్తి శివకుమారుడికే ఉంటుంది.. అందుకే శంకరుడి ఫైర్ నుంచి పుట్టుకొచ్చిన గంగ ఒడిలో ఆరుగురు దేవతల చేతిలో పెరిగిన, షణ్ముకుడు కార్తికేయ ఎలా తారకా సుర వధకానిస్తాడు.. ఇది పురాణమే.. అందరికి అందుబాటులో ఉన్న స్టోరీలైనే..
దేవతల నాయకుడైనా కార్తికేయుడు, రాక్షసులతో యుద్దానికి దిగటం అన్న పాయింట్ ని, దేవతలకే బలంగా మారిన తన నాయకత్వమే హీరోయిక్ ఎలిమెంట్ గా తీసుకున్నాడు త్రివిక్రమ్. ఇక్కడి వరకు ఎలంటి రూమర్స్ కాని, లీకులు కాని లేవు.. కాకపోతే ఆ ఎలిమెంట్ ని తీసుకుని, దాన్నెలా మాడ్రైజ్ చేస్తున్నాడు. అలాని మైథాలజీ టచ్ పోకుండా, పురాణాల లింక్ ఎలా కంటిన్యూ చేస్తాడనేదే కొంచె, సెన్సిటివ్ టాపిక్..అక్కడే త్రివిక్రమ్ రైటర్ గా సక్సెస్ అవ్వాలి.. లేదంటే గాడ్ ఆఫ్ వార్ కూడా అందుకు రామాయనం తీస్తే ఎలా ఉంటుందో, అలానే ఎందరు తీసినా మురుగన్ కథ ఒకేలా బోరింగ్ గా ఉండే ఛాన్స్ఉంది.
కాని సొంతంగా కథ రాయమంటే త్రివిక్రమ్ కి కష్టమేమోకాని, రీమేక్ లు ఫ్రీమేక్ లకు మాత్రం తన పెన్, గన్ లా దూసుకెళతుంది. అందుకే గాడ్ ఆఫ్ వార్ స్క్రిప్ట్ నెక్ట్స్ లెవల్లో రెడీ అయ్యిందట.లేదంటే ఆ కథని, బన్ని దగ్గరికి తీసుకెళ్లి, వివాదానికి కారకుడైన త్రివిక్రమ్, మొత్తానికి మళ్లీ ఎన్టీఆర్ ని ఇంప్రెస్ చేయగలిగాడంటే, అంతా ఫైనల్ స్క్రిప్ట్ లో ఉన్న క్వాలిటీ మహిమే.. ఏదేమైనా చాలా కాలం తర్వాత త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మూడుగంటల పైన కథా చర్చలు చేశాడంటే, డెఫినెట్ గా ఏదో విషేశమే అనుకోవాల్సిందే.. మ్యాన్ ఆఫ్ మాసెస్ కి ఈ కథ ఎంతగా నచ్చిందంటే, ఇక మీదట మురుగన్ అంటే తనే గుర్తొచ్చేంత గొప్పగా తన పాత్ర, సినిమా కథ సిద్దమైందనే కాన్ఫిడెన్స్ తనలో కనిపిస్తోంది. తన టీంలో కాన్ఫిడెన్స్ లెవల్ పెరిగినట్టు టాక్ పెరిగింది... సో టైటిల్ ఎనౌన్స్ చేసేప్పుడే తన పాత్రని రిలీజ్ చేస్తే, ఫ్యాన్స్ లో పూనకాలు రావటం గ్యారెంటీ.. అదే మే 20న జరగొచ్చని తెలుస్తోంది.