MASS WEAPON.. అది వాడితే ఆపేదెవడు…?

ఎన్టీఆర్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ త్రిబుల్ ఆర్. దాంతోనే గ్లోబల్ గా నాటు నాటు పాటతో ఊహించనంత గుర్తింపొచ్చింది. వెంటనే దేవర మూవీ చేస్తే అది రాజమౌలి సెంటిమెంట్ నే బ్రేక్ చేసేంత హిట్టైంది.

Post Published By: dialnews
Updated : 11 April 2026, 6:00 PM IST

ఎన్టీఆర్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ త్రిబుల్ ఆర్. దాంతోనే గ్లోబల్ గా నాటు నాటు పాటతో ఊహించనంత గుర్తింపొచ్చింది. వెంటనే దేవర మూవీ చేస్తే అది రాజమౌలి సెంటిమెంట్ నే బ్రేక్ చేసేంత హిట్టైంది. అయినా కూడా మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అసలు వెపన్ ని అటు రాజమౌళి వాడలేదు. ఇటు కొరటాల శివ వాడలేదు.. ఎన్టీఆర్ మాస్ హీరో అన్నది నిజమే కావొచ్చు. కాని తనలోని నటుడిని వాడుకుంటే, పాత్రతో ఆడుకుంటాడనే పేరుంది. అలాంటి పాత్ర త్రిబుల్ ఆర్ లో పడలేదు. దేవరలో తనేసింది మాస్ హీరో పాత్ర తప్ప, పెర్పామెన్స్ కి అంత స్కోప్ లేదు. అందుకే తన కెరీర్ లో టెంపర్ స్థాయి పాత్ర పడితే, బాక్సాఫీస్ లో బద్దలైపోతుందంటారు. కాని అలాంటి పాత్ర పడేదెప్పుడు? డ్రాగన్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ లో పూర్తి స్తాయి నటుడిని చూడబోతున్నామా? పెర్పామెన్స్ బాగుంటే, ఆవార్డులొస్తాయి కాని, అద్రుష్టం మార్చే వసూల్లొస్తాయా? డ్రాగన్ లో ఎన్టీఆర్ ని ఆపేదెవరు?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ లేటౌతోంది.. అందులో ఎలాంటి డౌట్ లేదు. జూన్ లోరావాల్సిన సినిమా, దసరాకు...ఆతర్వాత సంక్రాంతికి వాయిదా అనగానే పోస్ట్ పోన్ వార్తల్లో నిజం ఉందని తేలింది. అందులో ఎలాంటి డౌట్ లేదు. కాని రూమర్లు స్ప్రెడ్ చేస్తున్నట్టు, కథాలోపాలు, రీషూట్ ప్రచారాలు నిజం కాదని నిర్మాతలే తేల్చారు..అయితే రెండు భాగాలుగా కథని మరింత పెంచటం, పాన్ ఆసియా ప్రాజెక్ట్ గా మొదటి భాగం, పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా డ్రాగన్ 2ని ప్లాన్ చేయటం వల్లే, షూటింగ్ డిలే అవుతోందని ఫీలర్స్ వదులుతోంది ఫిల్మ్ టీం. ఇక్కడ సమస్య అది కాదు.. ఇది అసలు కేవలం రెగ్యులర్ ఫార్ములా మూవీ కాదు.ఎన్టీఆర్ కి మాస్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఊర మాస్ స్టార్ గా మార్కెట్ ఉంది. అందుకే, తనలోని నటుడిని పస్తులుంచి, తనలోని స్టార్ కోసం, ఫ్యాన్స్ కోసం ఫార్ములా మూవీలు చేయాల్సి వస్తుంది... అలా కాకుండా, తనలోని పెర్ఫార్మర్ ఆకలి తీర్చే టెంపర్ లాంటి మూవీ లు, అందులో తను వేసిన పాత్రల్లాంటి రోల్స్ దొరికితే, నటుడిగా నవరసాలు చూపిస్తాడు.ఆవిషయంలో చిరుతోనే పోల్చేంతగా తను ఫోకస్ అయ్యాడు. అందుకే డ్రాగన్ తనలోని నటుడిని, తనలోని మాస్ స్టార్ ని ఇద్దరిని శాటిస్ఫై ,చేసే సినిమా గా రాబోతోంది. ఎన్టీఆర్ తో సినిమా తీస్తే కేవలం మాస్ మార్కెట్ కోసమేకాదు, తనలోని అసలైన మాస్ వెపన్ అయిన పెర్పామెన్స్ ని కూడా వాడుకోవాలి... ఇది ప్రశాంత్ నీల్ తీసుకున్న స్ట్రాంగ్ డిసీజన్.

అందుకే ప్రాజెక్ట్ లేటైనా, రెండు భాగాలుగా డ్రాగన్ ని మార్చినా, అంతా ఎన్టీఆర్ లో అసలు సిసలు వెపనైన, పెర్ఫార్మర్ అన్న కోణాన్ని వాడటమే.. త్రిబుల్ ఆర్ హిట్టైనా, అందులో భీమ్ గా ఎన్టీఆర్ పెర్పామెన్స్ పీక్స్ అనిపించినా... అతి తన రియల్ స్టామినా కాదు.. తనలోని నటుడిని కరెక్ట్ గా వాడుకుంటే, వెండి తెరని తను ఆడుకుంటాడు..అందుకే, పాన్ ఆసియా, పాన్ వరల్డ్ లాంటి ప్రాజెక్ట్స్ కి కత్తిలాంటి కథ, కదిలించే కదానాయకుడి పెర్ఫామెన్స్ ఇవే పెట్టుబడిగా పెడుతున్నాడు డ్రాగన్ దర్శకుడు ప్రశాంత్ నీల్. మనకు మార్కెట్ లేని చోట, మన మూవీ ఆడాలంటే, అందులో కంటెంట్, లీడ్ రోల్ పెర్ఫామెన్స్ అదిరిపోవాలి.. సో పాన్ ఆసియా, పాన్ వరల్డ్ ఆడియన్స్ నిమెప్పించాలంటే, మ్యాన్ ఆఫ్ మాసెస్ ని కాదు, తనలోని నటుడిని మాత్రమే వాడాలి... అదే డ్రాగన్ లోజరుగుతున్నట్టుంది.అంటే ఇంతవరకు తను చేసిన మాస్ మూవీల్లో ఎన్టీఆర్ కి పెర్ఫామెన్స్ చేసేంత స్కోప్ రాలేదని కాదు.. కాని తన మొత్తం స్టామినాను వాడాలంటే, టెంపర్ లో తనకి పడ్డట్టు పెర్పామెన్స్ కి ఊహించనంత స్పేస్ ఉన్న పాత్రపడాలి.. లక్కీగా అది మాస్ రోల్ అయితే ఇటు మాస్, అటు క్లాస్ కమ్ కొత్త ఆడియన్స్ కి ఈజీగా కనెక్ట్ అవుతుంది. అందుకే 14 కేజీల బరువు తగ్గి లుక్ తోనే కాదు, పాత్రకోసం పరిదులన్నీ పక్కన పెట్టి చేయాల్సిన రిస్క్ లన్నీ చేస్తున్నాడు ఎన్టీఆర్.

Published : 
  • 11 April 2026, 6:00 PM IST