వారణాసి రెండు భాగాలుగా తెరకెక్కుతుందని ప్రచారమే తప్ప, ఎక్కడా కన్ ఫర్ మేషన్ రాలేదు. వారణాసి పార్ట్ వన్ గ్లోబ్ ట్రాటర్ అని, వారణాసి 2 టైం ట్రాటర్ అని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. కాని ఏది కన్పామ్ చేయలేదు. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్లు లేవు. ఐతే ఇది ఒక్క భాగంగా తీయటం కష్టమని రాజమౌళి మాటల్లోనే అర్ధమౌతోంది. కాబట్టే పక్కగా టూ పార్ట్స్ గా ఈ సినిమా వస్తుందని అంతా కన్ఫామ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇందులో రాముడు, రుద్రుడు, శివుడు మూడు పాత్రలేస్తున్న మహేశ్, మొదటి భాగంలో మూడు పాత్రల్లో కనిపిస్తాడా? లేదంటే ఒక పాత్రని వారణాసి సీక్వెల్ కోసం సీక్రెట్ గా ఉంచుతారా? ఎందుకంటే కల్కీలో కూడా కర్ణుడి పాత్రని కాసేపే చూపించారు. పార్ట్ 2 కోసమే దాచుంచారు... అచ్చంగా అలాంటిదేదో వారణాసి2 కోసం జరగబోతోందా? కల్కీ 2 కి, వారణాసికి ఉన్న కనెక్షన్ వల్లే, సెకండ్ పార్ట్ కోసం మహేశ్ వేసే ఒక పాత్ర దాచుంచబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇంతకి ఏ రోల్ ని సీక్వెల్ కోసం దాచి ఉంచబోతున్నారు?
వారణాసిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు రుద్రుడిగా, శివుడిగా, రాముడిగా కనిపించబోతున్నాడు. మూడు పాత్రలు వేయబోతున్నాడు. ఇది అఫీషియల్ గా కన్ఫామ్ చేసిన అంశమే. 4 గంటల సినిమాలో మూడు పాత్రలతో రెండు మైండ్ బెండింగ్ సీక్వెన్స్ తో వారణాసి వసూళ్ల సునామీ క్రియేట్ చేస్తుందన్నారు. కాని ఇది రెండు భాగాలుగా మార్చబోతున్న ప్రాజెక్ట్ అని రీసెంట్ డెవలప్ మెంట్స్ తో తేలింది.అంతేకాదు, రెండో భాగం కోసం మూడో పాత్రని సీక్రెట్ గా దాచాలనే ఐడియా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం కావాలనిచేయటం కాదు, కథని రెండు గా విభజించటం వల్ల, మూడో పాత్ర రెండో సీక్వెల్ లో ఉండిపోవాల్సి వస్తోందట. ఇంతకి ఏంటా పాత్ర? ఇదే ఇండస్ట్రీలో హాట్ కేకులా మారిన ప్రశ్న.. ఈ ప్రశ్నకు సమాధానం మీదే రూమర్లు, భారీ ప్రచారాలు పెరిగాయి.
వారణాసిలో హీరో ముందు రుద్రుడి పాత్రలో భారీ సాహసాలు చేస్తాడు. విలనచెప్పాడని, విలువైన వస్తువుకోసం కాలంలో వెనక్కి ప్రయానం చేస్తాడు.. ఆప్రాసెస్ లోనే రాముడిని కలుస్తాడు.. ఇది ఈమధ్య వినిపిస్తున్న గాసిప్స్ లో ఇదో స్టోరీ లైన్. ఐతే అలా రాముడు, రుద్రుడు పాత్రలు మాత్రమే మొదటి భాగంలో ఉంటాయట.. శివుడి పాత్ర తాలూకు ట్విస్ట్ కేవలం సీక్వెల్ లో ఉంటుందని తెలుస్తోంది.టైటిలే వారణాసి, అంటే కాశి నాథుడి ఎంట్రీ లేకపోతే ఎలా? అందుకే వారణాసి మొదటి భాగం ఎండ్ అయ్యే టైంలో శివుని ఎంట్రీ తో ఎండ్ కార్డ్ వేస్తారనే అంచనాలున్నాయి. కాని సెకండ్ పార్ట్ మొత్తం శివుడి పాత్రతోనే 60శాతం ఉంటుందని తెలుస్తోంది. కత పరంగా ఆపాత్రనే సీక్వెల్ కోసం సీక్రెట్ గా ఉంచబోతున్నారట. కేవలం లుక్ ని వారణాసి మొదటి భాగం క్లైమాక్స్ లో రివీల్ చేసి, క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం జరుగుతున్నట్టు లీకులు షాకులిస్తున్నాయికల్కీలో ఎలా అయితే కల్కీ2 లో ఎక్కువ గా కనిపించబోయే కర్ణుడి పాత్రని, కల్కీ మొదటి భాగం చివర్లో చూపించి షాక్ ఇచ్చారు. అదే స్కెచ్ వారణాసి లోకూడా వాడబోతున్నట్టు తెలుస్తోంది. ఇది కొద్దిగా రూమర్లలో నిజానికి దగ్గరగా ఉన్న ప్రచారం అన్న మాటే వినిపిస్తోంది.